Google Meet New Features: గూగుల్ మీట్‌లో సరికొత్త ఫీచర్లు.. అదిరిపోయే అప్‌డేట్లు

Google Meet New Features: వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్‌ గూగుల్ మీట్ సరికొత్త అప్‌డేట్లను ప్రకటించింది. కొత్త ఫీచర్లలో అటెన్డెన్స్‌ రిపోర్టులు, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్‌, పోలింగ్ విభాగాలు ఉన్నాయి.

news18-telugu
Updated: October 12, 2020, 4:35 PM IST
Google Meet New Features: గూగుల్ మీట్‌లో సరికొత్త ఫీచర్లు.. అదిరిపోయే అప్‌డేట్లు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్‌ గూగుల్ మీట్ సరికొత్త అప్‌డేట్లను ప్రకటించింది. జి సూట్ ఎంటర్ప్రైజ్ ఎడ్యుకేషన్‌ వినియోగదారులకు ఈ అప్‌డేట్లు ఉపయోగపడనున్నాయని గూగుల్ తెలిపింది. కొత్త ఫీచర్లలో అటెన్డెన్స్‌ రిపోర్టులు, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్‌, పోలింగ్ విభాగాలు ఉన్నాయి. ఈ నెలాఖరులోపు అర్హత ఉన్న వినియోగదారులకు ఇవి అందుబాటులోకి రానున్నాయి. వీటితోపాటు గతంలో ప్రకటించిన సాఫ్ట్ వేర్ డ్రివెన్ నాయిస్ క్యాన్సిలేషన్ వంటి అత్యాధునిక ఫీచర్లు గూగుల్ మీట్‌ను పోటీదారులలో ప్రత్యేకంగా నిలపనున్నాయి.

పోలింగ్ ఫీచర్‌తో ఎన్నో ప్రయోజనాలు

గూగుల్ మీట్ ఎంటర్ప్రైజ్ ఎడ్యుకేషన్ కస్టమర్లకు ఇప్పటికే పోలింగ్‌ అప్‌డేట్ అందుబాటులో ఉంది. విద్యార్థులు క్లాస్ వర్క్‌లో వెనుకబడ్డారో లేదో దీని ద్వారా తెలుసుకోవచ్చు. విద్యార్థుల పనితీరును తెలుసుకోవడానికి ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఆన్‌లైన్ తరగతుల్లో తమకు ఏయే పాఠాలు కావాలో యాజమాన్యానికి తెలిపేందుకు విద్యార్థులు పోలింగ్ సెక్షన్‌ను ఉపయోగించుకోవచ్చు. ఆన్‌లైన్‌ క్లాసులపై విద్యార్థులు మరింత ఆసక్తి చూపేందుకు ఈ అప్‌డేట్లు తోడ్పడుతాయని గూగుల్ మీట్‌ ప్రొడక్ట్ మేనేజర్ సమీర్ ప్రధాన్ చెబుతున్నారు. ఏదైనా ఒక అంశంపై చర్చించేందుకు, డిబేట్లు పెట్టుకోవడానికి పోలింగ్ ఫీచర్ ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.

ప్రశ్నలు అడగొచ్చు..
గూగుల్ Q&A ఫీచర్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు గూగుల్ ప్రకటించింది. క్వశ్చన్ అండ్ ఆన్సర్‌ ఫీచర్‌తో విద్యార్థులు పాఠాలకు అంతరాయం కలిగించకుండా ప్రశ్నలు అడగవచ్చు. ఈ విభాగంలో ఉపాధ్యాయులు ఏవైనా ప్రశ్నలను హైడ్ చేయవచ్చు. లేదా వాటిని ఎప్పుడైనా ఎనేబుల్, డిసేబుల్ చేయవచ్చు.

హాజరు తీసుకోవడం తేలిక..
గూగుల్‌ షీట్ల ద్వారా ఉపాధ్యాయులు హాజరు రిపోర్టు తీసుకోవచ్చు. ఇందుకు కనీసం ఐదుగురు విద్యార్థులైనా ఆన్లైన్‌ క్లాసుల్లో పాల్గొనాలి. ఈ ఏడాది చివర్లో ఈ ఫీచర్‌కు మరిన్ని అప్‌డేట్లు తీసుకురానున్నట్లు గూగుల్ తెలిపింది. జామ్‌బోర్డ్‌తో కూడిన డిజిటల్ వైట్‌బోర్డ్ ఫీచర్‌ను కూడా గూగుల్ విడుదల చేయనుంది. దీన్ని అడ్మిన్‌ నియంత్రించేలా డిజైన్ చేస్తున్నారు.
మరిన్ని అప్ డేట్లు..

ఈ అప్‌డేట్లతో వచ్చే ‘బ్రేకవుట్ రూమ్స్‌’ ఆప్షన్‌తో, టీచర్లు విద్యార్థులను కొన్ని గ్రూప్‌లుగా విభజించి చర్చలు పెట్టుకోవచ్చు. రాబోయే నెలల్లో గూగుల్ మీట్ ‘ఆస్క్‌ ఫర్‌ హెల్ప్‌’ వంటి ఆప్షన్లతో ఉపాధ్యాయుల సౌలభ్యం కోసం మరిన్ని అప్డేట్లను తీసుకురానుంది. జి సూట్ ఎంటర్ప్రైజ్ ఫర్‌ ఎడ్యుకేషన్‌ కస్టమర్లకు బ్రేకవుట్ రూమ్స్‌ ఫీచర్‌ ఈ రోజు నుంచే అందుబాటులోకి రానుంది. గత నెలలో గూగుల్ మీట్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఎంటర్ప్రైజ్ కస్టమర్ల కోసం నాయిస్ క్యాన్సిలేషన్‌ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.  దీని ద్వారా ఆన్లైన్ క్లాసులు జరుగుతున్నప్పుడు అనవసర శబ్ధాలు వినిపించకుండా చూసుకోవచ్చు.
Published by: Nikhil Kumar S
First published: October 12, 2020, 1:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading