Home /News /technology /

GOOGLE MEET NEW UPDATE USERS CAN ADD 25 CO HOSTS LIMIT MUTE PARTICIPANTS NS GH

Google Meet: మీరు గూగుల్ మీట్ వినియోగిస్తారా? అయితే, ఈ అదిరిపోయే కొత్త ఫీచర్ గురించి తెలుసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఆన్‌లైన్ వీడియో కాలింగ్ యాప్ గూగుల్ మీట్ మరో కొత్త అప్‌డేట్‌ను పరిచయం చేసింది. క్విక్ యాక్సెస్‌ పేరుతో విడుదలైన ఈ ఫీచర్ ఉపయోగించి ప్రతి మీటింగ్‌లో 25 మంది కో-హోస్ట్‌లను యాడ్ చేయొచ్చు.

కరోనా సమయంలో వీడియో కాలింగ్ యాప్స్ వాడకం పెరిగిపోయింది. యూజర్ల అవసరాలను తీర్చేలా ఆయా యాప్స్ సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతున్నాయి. తాజాగా ప్రముఖ ఆన్‌లైన్ వీడియో కాలింగ్ యాప్ గూగుల్ మీట్ మరో కొత్త అప్‌డేట్‌ను పరిచయం చేసింది. క్విక్ యాక్సెస్‌ పేరుతో విడుదలైన ఈ ఫీచర్ ఉపయోగించి ప్రతి మీటింగ్‌లో 25 మంది కో-హోస్ట్‌లను యాడ్ చేయొచ్చు. ఈ కో-హోస్ట్‌లు.. పార్టిసిపేంట్లకు సంబంధించిన స్క్రీన్‌ షేర్, చాట్ మెసేజెస్ లను నియంత్రించగలుగుతారు. మీటింగ్ నిర్వహించే హోస్ట్‌కు ఉండే అన్ని అధికారాలు కో-హోస్ట్‌లకు ఉంటాయి. అంతేకాకుండా, కో-హోస్ట్‌లు పార్టిసిపేంట్లను మ్యూట్ చేయడం, మీటింగ్‌లను ముగించడం వంటి పనులను కూడా చేయగలరు. యూజర్లు ఎక్కువగా రిక్వెస్ట్ చేసిన ఫీచర్లలో మీటింగ్ మోడరేషన్ ఫీచర్ ఒకటి కాగా.. గూగుల్ మీట్‌ ఈ ఫీచర్‌ని ఎట్టకేలకు అందుబాటులోకి తెచ్చింది.
Zoom Update: జూమ్‌లో ఆన్‌లైన్ క్లాసులు చెబుతున్నారా లేదా వింటున్నారా? ఈ కొత్త అప్‌డేట్ మీ కోసమే!
Smartphone Charging Tips: మీ స్మార్ట్ ఫోన్ ను ఛార్జ్ చేసేటప్పుడు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి.. ఈ టిప్స్ తప్పక తెలుసుకోండి

హోస్ట్‌ తాను నిర్వహించే ప్రతి మీటింగ్‌కు 25 కో-హోస్ట్‌లను నియమించవచ్చని గూగుల్ సంస్థ తెలిపింది. హోస్ట్‌కు ఉన్న అన్ని కంట్రోల్స్ లను కో-హోస్ట్‌లు యాక్సెస్ చేయొచ్చని వివరించింది. మీటింగ్‌లో పాల్గొనే పార్టిసిపేంట్లను కో-హోస్ట్‌లుగా ఎంపిక చేయవచ్చు. వీరంతా మీటింగ్స్ సమర్థవంతంగా, సులభంగా నిర్వహించేందుకు హోస్ట్‌కు సహాయపడతారు. వీరు సేఫ్టీ ఫీచర్స్ కూడా వినియోగించగలరు. దీనివల్ల హోస్ట్‌లు.. మీటింగ్‌లో జాయిన్ అయ్యే వ్యక్తుల రిక్వెస్టులను ఈజీగా కంట్రోల్ చేయవచ్చు. సేఫ్టీ ఫీచర్స్.. గూగుల్ వర్క్ స్పేస్ వినియోగించే ఎడ్యుకేషన్ కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉండేవి. కానీ ఇప్పుడు ఇవి గూగుల్ మీట్ యూజర్లకు కూడా అందుబాటులోకి వస్తున్నాయి.

కో-హోస్ట్‌లు ప్రశ్నోత్తరాలు, పోల్స్‌ను నిర్వహించడం లాంటి పనులు చేయడంతో హోస్ట్‌కు చాలా టైం ఆదా అవుతుంది. దాంతో హోస్ట్ తన ప్రెజెంటేషన్‌లు సులభంగా చేసుకోవచ్చు. అలాగే, హోస్ట్‌కు సమావేశంలో చర్చ చేసేందుకు కూడా చాలా సమయం దొరుకుతుంది. క్విక్ యాక్సెస్ ఫీచర్ డిఫాల్ట్‌గా ఎనేబుల్ చేసి ఉంటుంది. ఈ ఫీచర్ ఎనేబుల్ చేయడం ద్వారా మీటింగ్‌లో పాల్గొనే పార్టిసిపెంట్‌లు హోస్ట్ డొమైన్ నుంచి ఆటోమేటిక్‌గా జాయిన్ అవ్వచ్చు. మొబైల్ లేదా డెస్క్‌టాప్ డివైజ్ నుంచి అయినా మీటింగ్‌లో చేరవచ్చు. అడ్మిన్‌ల కోసం హోస్ట్ మేనేజ్‌మెంట్ సెట్టింగ్‌లు డిఫాల్ట్‌గా ఆన్ లేదా ఆఫ్ చేసేందుకు వీలుగా ఓ సెట్టింగ్‌ను గూగుల్ పరిచయం చేసే అవకాశం ఉంది.
Published by:Nikhil Kumar S
First published:

Tags: Google, Videos share, Work From Home

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు