హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Google Meet నుంచి మరో సరికొత్త అప్డేట్.. అవాంతరాలు లేని ఆన్లైన్ క్లాసుల కోసం కొత్త ఫీచర్లు.. వివరాలివే

Google Meet నుంచి మరో సరికొత్త అప్డేట్.. అవాంతరాలు లేని ఆన్లైన్ క్లాసుల కోసం కొత్త ఫీచర్లు.. వివరాలివే

విద్యార్థుల కోసం గూగుల్ మీట్ ప్రత్యేకంగా కొత్త ఫీచర్లను విడుదల చేసింది. ఈ నూతన ఫీచర్ల సహాయంతో ఉపాధ్యాయులు ఇక నుంచి ఎటువంటి అవాంతరం లేకుండా క్లాసును నిర్వహించవచ్చని సంస్థ పేర్కొంది.

విద్యార్థుల కోసం గూగుల్ మీట్ ప్రత్యేకంగా కొత్త ఫీచర్లను విడుదల చేసింది. ఈ నూతన ఫీచర్ల సహాయంతో ఉపాధ్యాయులు ఇక నుంచి ఎటువంటి అవాంతరం లేకుండా క్లాసును నిర్వహించవచ్చని సంస్థ పేర్కొంది.

విద్యార్థుల కోసం గూగుల్ మీట్ ప్రత్యేకంగా కొత్త ఫీచర్లను విడుదల చేసింది. ఈ నూతన ఫీచర్ల సహాయంతో ఉపాధ్యాయులు ఇక నుంచి ఎటువంటి అవాంతరం లేకుండా క్లాసును నిర్వహించవచ్చని సంస్థ పేర్కొంది.

  ఆన్ లైన్ క్లాసులు పిల్లలకు ఎంత బుర్రకెక్కుతున్నాయో తెలియదు కానీ, అధ్యాపకుల పరిస్థితి మాత్రం కత్తిమీద సాములాగే తయారైంది. టీచర్ ఎదురుగా కనిపిస్తున్నా సరే వర్చువల్ అనే ధీమాతో కొంతమంది విద్యార్థులు అల్లరి చేష్టలు చేస్తున్నారు. ఇటువంటి కేసులు ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి. ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు ప్రముఖ వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ గూగుల్ మీట్ నడుం బిగించింది. ఉపాధ్యాయులు, విద్యార్థుల కోసం ప్రత్యేకంగా కొత్త ఫీచర్లను విడుదల చేసింది. ఈ నూతన ఫీచర్ల సహాయంతో ఉపాధ్యాయులు ఇక నుంచి ఎటువంటి అవాంతరం లేకుండా క్లాసును నిర్వహించవచ్చని పేర్కొంది. దీనిలో భాగంగా విద్యార్థులందరినీ ఒకేసారి మ్యూట్ చేయడం, మోడరేషన్ టూల్స్ జతచేయడం, ఒకేసారి మీటింగ్ ని ముగించడం వంటి కొత్త ఫీచర్లను చేర్చింది. అంతేకాక, ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా అడ్వాన్సుడ్ సెక్యూరిటీ కంట్రోల్స్ అందించనుంది. ఈ సెక్యూరిటీ కంట్రోల్స్ ద్వారా ఆన్ లైన్ క్లాసుల్లో విద్యార్థులు చేర్చే అధికారం ఉపాధ్యాయులకే ఉంటుంది. వారి అనుమతితోనే విద్యార్థులు ఆన్ లైన్ క్లాసులలో చేరాల్సి ఉంటుంది.

  ఈ ఫీచర్ ద్వారా తెలియని వ్యక్తులను క్లాసులో చేరకుండా నిరోధించవచ్చు. అంతేకాక, సెషన్ మధ్యలో ఎవరు సమాధానం చెప్పాలో వారిని మాత్రమే అన్ మ్యూట్ చేసే ఆప్షన్ ఉంటుంది. దీని కోసం అడ్వాన్డ్ సేఫ్టీ లాక్స్ ఫీచర్ ని అందుబాటులోకి తెచ్చింది గూగుల్ మీట్. అంతేకాక, ఆన్ లైన్ క్లాసు ముగిసిన తర్వాత ఒకేసారి మీటింగ్ ని ఎండ్ చేసే ఫీచర్ ని కూడా చేర్చింది. దీనితో ఉపాధ్యాయుడితో సహా విద్యార్థులంతా ఒకేసారి మీటింగ్ నుంచి లెఫ్ట్ అవ్వొచ్చు. కాగా, ప్రస్తుతం ఈ ఫీచర్ అందుబాటులో లేదు.

  ప్రస్తుతం ఉన్న ఫీచర్ ప్రకారం, టీచర్ సమావేశం నుండి లెఫ్ట్ అయిన తర్వాత కూడా విద్యార్థులు మీటింగ్ సెషన్ లేదా బ్రేక్ అవుట్ రూమ్ లో ఉండే అవకాశం ఉంది. ఈ నూతన ఫీచర్ తో ఒకేసారి అందరికీ మీటింగ్ ఎండ్ చేసే అధికారం ఉపాధ్యాయుడికి ఉంటుంది. ఏదేమైనా, ఈ కొత్త ఫీచర్లతో ఉపాధ్యాయులు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా ఆన్ లైన్ క్లాసులను నిర్వహించవచ్చు. ఆఫ్ లైన్ లో ఎలాగైతే తరగతి గది ఉపాధ్యాయుడి కంట్రోల్లో ఉంటుందో, అదేవిధంగా ఆన్ లైన్ లో కూడా క్లాస్ రూమ్ సెషన్ వారి కంట్రోల్లో ఉంటుంది.

  ఉపాధ్యాయులకు మరింత సౌలభ్యంగా..

  ఈ నూతన ఫీచర్లపై సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ తన బ్లాగ్ లో పేర్కొంటూ.. “ఆన్ లైన్ క్లాసుల్లో ఉపాధ్యాయులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాటికి చెక్ పెట్టేందుకు ఈ నూతన ఫీచర్లను అభివృద్ధి చేస్తున్నాం. సాధారణంగా క్లాసులు జరుగుతున్నప్పుడు విద్యార్థులందరినీ క్లాసులో లీనమయ్యేలా చేయడం కష్టంతో కూడుకున్న పని. క్లాసు మధ్యలో ఎవరైనా అవాంతరం కలిగిస్తే మరింత ఇబ్బందిగా అనిపిస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఉపాధ్యాయుల సౌలభ్యం కోసం, ఎటువంటి అవాంతరాలు లేకుండా క్లాసును కొనసాగించడానికి “మ్యూట్ ఆల్” అనే కొత్త ఆప్షన్ ని చేర్చాం. తద్వారా తరగతి మొత్తం ఉపాధ్యాయుడి కంట్రోల్లో ఉంటుంది. మ్యూట్ ఆల్ ఫీచర్ ఉపాధ్యాయులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

  వారు బోధించేటప్పుడు ఇది అన్ని శబ్దాలను అడ్డుకుంటుంది. క్లాసు మధ్యలో విద్యార్థుల నుంచి సమాధానం రాబట్టడానికి ఎవరిని అన్ మ్యూట్ చేయాలో కూడా టీచర్ నిర్ణయించుకోవచ్చు. ఇదిలా ఉంటే, టాబ్లెట్‌లు లేదా మొబైల్ ఫోన్‌ల ద్వారా భోధించే ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా కీ మోడరేషన్ కంట్రోల్ కూడా రూపొందించింది గూగుల్ మీట్. తద్వారా వారి iOS లేదా Android డివైజ్ ల నుండి నేరుగా ఆన్ లైన్ క్లాసులు నిర్వహించవచ్చు.

  First published:

  Tags: Google, Online classes

  ఉత్తమ కథలు