Google Meet: గూగుల్ మీట్‌లో ఒకేసారి 16 మందితో వీడియో కాల్

Google Meet | గతంలో గూగుల్ మీట్‌లో ఒకేసారి నలుగురితో మాట్లాడే అవకాశం మాత్రమే ఉండేది. ఆ సంఖ్యను 16 కి పెంచుతూ అప్‌డేట్స్ రిలీజ్ చేస్తోంది గూగుల్ మీట్. అంటే గూగుల్ మీట్‌లో ఒకేసారి 16 మంది వీడియో కాన్ఫరెన్స్ చేయొచ్చు.

news18-telugu
Updated: April 23, 2020, 6:27 PM IST
Google Meet: గూగుల్ మీట్‌లో ఒకేసారి 16 మందితో వీడియో కాల్
Google Meet: గూగుల్ మీట్‌లో ఒకేసారి 16 మందితో వీడియో కాల్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
లాక్‌డౌన్ కారణంగా ఎక్కడివారక్కడే ఉండిపోయారు. ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. దీంతో వీడియో కాల్స్, వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్స్‌కు డిమాండ్ పెరిగిపోయింది. అయితే ఒకేసారి ఎక్కువ మందితో మాట్లాడగలిగే వీలున్న యాప్స్‌ వైపే మొగ్గు చూపుతున్నారు యూజర్లు. అందుకే జూమ్ యాప్ బాగా క్రేజ్ సంపాదించుకుంది. అయితే జూమ్ యాప్ ఉపయోగించకూడదని కేంద్ర ప్రభుత్వం చెప్పడంతో ఇతర యాప్స్‌పై దృష్టిపెట్టారు యూజర్లు. ఇప్పటికే గూగుల్‌కు చెందిన మీట్ యాప్ అందుబాటులో ఉంది. గతంలో ఉన్న హ్యాంగ్ అవుట్ యాప్‌ను గూగుల్ మీట్‌గా మార్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు గూగుల్ మీట్ యాప్‌లో సరికొత్త ఫీచర్స్ అందుబాటులోకి వచ్చాయి.

గతంలో గూగుల్ మీట్‌లో ఒకేసారి నలుగురితో మాట్లాడే అవకాశం మాత్రమే ఉండేది. ఆ సంఖ్యను 16 కి పెంచుతూ అప్‌డేట్స్ రిలీజ్ చేస్తోంది గూగుల్ మీట్. అంటే గూగుల్ మీట్‌లో ఒకేసారి 16 మంది వీడియో కాన్ఫరెన్స్ చేయొచ్చు. అంతేకాదు... ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో గూగుల్ మీట్‌ను యూజర్లకు మరింత ఉపయోగపడేలా రూపొందించడం విశేషం. వెలుతురు సరిగ్గా లేకపోయినా ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్ సాయంతో లైటింగ్ అడ్జెస్ట్ అవుతుంది. కాబట్టి అవతలివాళ్లకు సరిగ్గా కనిపించట్లేదన్న టెన్షన్ ఉండదు. ఇక యూజర్లు తమ విండో, స్క్రీన్ మాత్రమే కాదు క్రోమ్ ట్యాబ్‌ని కూడా షేర్ చేసే ఆప్షన్ కూడా వచ్చేసింది. ప్రస్తుతానికి ఈ ఫీచర్స్ మొబైల్ యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. త్వరలో వెబ్ యూజర్లకు కూడా రానున్నాయి.

ఇవి కూడా చదవండి:

WhatsApp: వాట్సప్ యూజర్లకు గుడ్ న్యూస్... ఆ ఫీచర్ వచ్చేసింది

Prepaid Plans: రోజూ 1.5 జీబీ డేటా... జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ప్లాన్స్ ఇవే

JioPOS Lite App: ఈ జియో యాప్‌తో డబ్బు సంపాదించండి ఇలా
First published: April 23, 2020, 6:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading