గూగుల్‌లోనే ఫ్లిప్‌కార్ట్, పేటీఎం, స్నాప్‌డీల్ 'షాపింగ్ ట్యాబ్స్'

యూజర్లు యాప్‌లోకి వెళ్లకుండా 'షాపింగ్ ట్యాబ్స్' ద్వారానే లావాదేవీలు చేసుకునే అవకాశం లభిస్తుంది. కావాల్సిన వస్తువుల్ని సెర్చ్ చేయడం దగ్గర్నుంచి ఆర్డర్ ప్లేస్ చేసే వరకు అన్నీ షాపింగ్ ట్యాబ్‌లోనే జరిగిపోతాయి.

news18-telugu
Updated: October 16, 2018, 12:36 PM IST
గూగుల్‌లోనే ఫ్లిప్‌కార్ట్, పేటీఎం, స్నాప్‌డీల్ 'షాపింగ్ ట్యాబ్స్'
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: October 16, 2018, 12:36 PM IST
మీరు తరచూ ఆన్‌లైన్ షాపింగ్ చేస్తుంటారా? మీ ఫోన్‌లో ఫ్లిప్‌కార్ట్, పేటీఎం, స్నాప్‌డీల్ లాంటి యాప్స్ తరచూ ఉపయోగిస్తారా? ఇకపై అన్ని యాప్స్ మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే... ఈ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌కు చెందిన షాపింగ్ ట్యాబ్స్ అన్నీ ఇకపై గూగుల్‌లోనే కనిపించనున్నాయి. త్వరలో ప్రయోగాత్మకంగా షాపింగ్ ట్యాబ్స్ ఏర్పాటు చేయనున్న గూగుల్... ఈ ఏడాది చివరినాటికి ఫైనల్ రోల్ అవుట్ రిలీజ్ చేయనుంది.

గూగుల్ ఇప్పటికే ఇండియాలోని ఇ-కామర్స్ దిగ్గజాలతో సంప్రదింపులు జరుపుతోంది. యూజర్లు యాప్‌లోకి వెళ్లకుండా 'షాపింగ్ ట్యాబ్స్' ద్వారానే లావాదేవీలు చేసుకునే అవకాశం లభిస్తుంది. కావాల్సిన వస్తువుల్ని సెర్చ్ చేయడం దగ్గర్నుంచి ఆర్డర్ ప్లేస్ చేసే వరకు అన్నీ షాపింగ్ ట్యాబ్‌లోనే జరిగిపోతాయి. అంతేకాదు... చిన్న చిన్న కిరాణా షాపులు, హ్యాండీక్రాఫ్ట్ స్టోర్స్ లాంటివాటినీ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌తో భాగస్వామ్యం చేసుకునే గూగుల్ ప్రోత్సహించనుంది.

అయితే మొదట షాపింగ్ ట్యాబ్ ఫీచర్‌ తీసుకొచ్చి, ఆ తర్వాత ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌గా ఎదిగేందుకు గూగుల్ ప్రయత్నిస్తుందా అన్న వాదన కూడా ఉంది. ఎందుకంటే మొదట అమెజాన్ కూడా ప్రైస్ కంపేరింగ్ వెబ్‌సైట్ junglee.com ప్రారంభించి ఆ తర్వాత సొంత ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ప్రారంభించింది. ఇప్పుడు గూగుల్ కూడా మార్కెట్‌ను విశ్లేషించి ఇ-కామర్స్ రంగంలోకి అడుగుపెడుతుందని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:



ఏసుస్ నుంచి మరో రెండు ఫోన్లు!

ఆఫ్‌లైన్ స్టోర్లల్లో షావోమీ పోకో ఎఫ్1 సేల్!

త్వరలో ఇండియాలో రెడ్‌మీ నోట్ 6 ప్రో రిలీజ్!
Loading...
ఎస్‌బీఐ కస్టమర్లకు శుభవార్త!

నిజాయితీగా ట్యాక్స్ కడితే కేంద్రం సత్కారాలు!

ఇంటర్నెట్ బ్యాంకింగ్ బ్లాక్ చేయనున్న ఎస్‌బీఐ!

ఇన్‌స్టాగ్రామ్ చూస్తే అసూయా? ఇలా తగ్గించుకోండి!

First published: October 16, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...