Google Maps: రూట్ మ్యాప్, నావిగేషన్ ఫీచర్లను అందిస్తున్న మ్యాప్స్‌కు గూగుల్(Google) కంపెనీ మరిన్ని హంగులు తీసుకొస్తోంది. లైవ్ వ్యూలో లొకేషన్లు సెర్చ్ చేసే ఫీచర్‌ను వినియోగదారులకు త్వరలో అందించే ప్రణాళికల్లో ఉంది. గూగుల్(Google) మ్యాప్స్‌లో అందరూ ఎదురుచూస్తున్న ఈ ఫీచర్ ఈ నెలాఖరు నాటికి రాబోతోంది. గత కొన్ని సంవత్సరాలుగా కంపెనీ ప్రకటిస్తున్న ప్రణాళికల్లో ఆగ్మెంటెడ్ రియాలిటీ(AR) కీలకంగా కనిపిస్తోంది. ప్రస్తుతం దీని ద్వారా గూగుల్ మ్యాప్స్ సేవలు అందించనుంది.
సెప్టెంబర్‌లో ప్రకటించిన గూగుల్
గూగుల్ మ్యాప్స్‌లో అందుబాటులో ఉన్న లైవ్ వ్యూ గురించి అందరికీ అవగాహన ఉంది. అయితే త్వరలో వినియోగదారులు గూగుల్ మ్యాప్స్‌లో ARలో లైవ్ వ్యూ సెర్చ్‌ని ఉపయోగించుకునే అవకాశం లభించనుంది. ఈ అప్డేట్ను కంపెనీ ఆకస్మికంగా అందించడం లేదు. ఈ సంవత్సరం ప్రారంభంలో Google I/O కీనోట్లో కూడా కంపెనీ ఈ ఇంటిగ్రేషన్ గురించి ప్రస్తావించింది. ఈ ఫీచర్ గురించి సెప్టెంబరులో వివరంగా తెలియజేసింది. ఇప్పుడు నవంబర్ చివరి నాటికి, ప్రపంచంలోని సెలక్టెడ్ ప్రాంతాల్లోని వినియోగదారులకు దాని ప్రయోజనాలను ఎక్స్పీరియన్స్ చేసే అవకాశం లభించనుంది.
రద్దీగా ఉండే వీధుల్లో ఉపయోగం
లైవ్ వ్యూ ఆప్షన్ ద్వారా సమీపంలోని రెస్టారెంట్లు, కేఫ్‌లు, ఇతర భవనాలను చూసే అవకాశాన్ని AR కల్పిస్తుంది. కెమెరాను చూపడం ద్వారా అన్ని వివరాలను పొందవచ్చు. ఈ ఫీచర్ లైవ్ వ్యూ తరహాలో పని చేస్తుంది. ఇది వినియోగదారులకు రియల్ టైమ్‌లో ఫోన్ కెమెరాను ఉపయోగించి నావిగేట్ చేయడంలో సహాయపడుతుంది. లైవ్ వ్యూ మోడ్ వినియోగదారు పరిసరాలపై యారోలను చూపిస్తూ.. వారు వెతుకుతున్న ల్యాండ్‌మార్క్‌లు లేదా ఇతర ప్రదేశాలను సూచిస్తుంది.
Kidney Disease: దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధికి అసలే కారణం అదే.. తేల్చిన తాజా అధ్యయనం
దీనితో దుకాణాల ముందు నిలబడకుండా వాటి గురించిన వివరాలను కూడా తెలుసుకోవచ్చు. రద్దీగా ఉండే వీధిలో ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ARలో లైవ్ వ్యూ సెర్చ్ ఫీచర్‌ని ఉపయోగించుకోవడానికి మ్యాప్స్‌కి ఫోన్ కెమెరా యాక్సెస్ అవసరం. గూగుల్ ప్రాథమికంగా స్ట్రీట్ వ్యూ ఇమేజెస్ ద్వారా సేకరించిన ఈ మొత్తం డేటాను పొందుతోంది. ఈ ప్రత్యేకమైన అనుభవాన్ని అందించడానికి దాని AI, AR టెక్నాలజీలను వినియోగిస్తోంది. కేఫ్‌లో రద్దీగా ఉండే సమయాలు, దాని రేటింగ్‌లు ఏమిటి, అది ఓపెన్ చేసి ఉందా? లేదా? వంటి లోతైన వివరాలను తెలుసుకొనే అవకాశం ఉంటుంది.
ప్రస్తుతానికి కొన్ని నగరాలకే..
ఈ లేటెస్ట్ అప్డేట్ గురించి గూగుల్ చేసిన బ్లాగ్ పోస్ట్‌లో.. కేఫ్‌లు, రెస్టారెంట్లు, బ్యాంకులు, ATMల వివరాలను సులువుగా పొందవచ్చని తెలిపింది. అయితే ప్రస్తుతానికి లాస్ ఏంజిల్స్, న్యూయార్క్, లండన్, పారిస్, టోక్యో తదితర నగరాలకు ARలో లైవ్ వ్యూ సెర్చ్ ఆప్షన్‌ను పరిమితం చేస్తున్నట్లు వివరించింది. ఈ ఫీచర్ గూగుల్ మ్యాప్స్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ వారంలో ఎప్పుడైనా అప్డేట్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అప్డేట్ లభించిన తర్వాత Maps ద్వారా కెమెరాను ఓపెన్ చేసి.. AR ఫీచర్‌ని ఉపయోగించి డిఫరెంట్‌గా సెర్చ్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Google Maps