Google Maps: 20 ఏళ్ల క్రితం కేసును ఛేదించిన గూగుల్ మ్యాప్‌

Google Maps (ప్రతీకాత్మక చిత్రం)

గూగుల్ మ్యాప్(Google Maps) అంటే లొకేషన్ సెట్ చేస్తే అదే దారి చూపుతూ. . మార్గ మ‌ధ్య‌లో త‌ప్పిపోతే హెచ్చ‌రిస్తుంది. అని మాత్రమే మనకు తెలుసు అటువంటి గూగుల్ మ్యాప్ 20 ఏళ్ల క్రితం త‌ప్పిపోయిన ఓ వ్య‌క్తి మిస్సింగ్ కేసు(Missing Case) ఛేదించడానికి ఉప‌యోగ‌ప‌డింది.

  • Share this:
    గూగుల్ మ్యాప్(Google Maps) అంటే మ‌న‌కు తెలిసింది ఒక్క‌టే.. మ‌నం ఎక్క‌డికైనా వెళ్లాలంటే దారి తెలియ‌కుంటే మ్యాప్‌లో మ‌నం వెళ్లాల్సిన లొకేష‌న్‌(Location)ను సెట్ చేస్తే అదే దారి చూపుతూ. . మార్గ మ‌ధ్య‌లో త‌ప్పిపోతే హెచ్చ‌రిస్తుంది. అటువంటి గూగుల్ మ్యాప్ 20 ఏళ్ల క్రితం త‌ప్పిపోయిన ఓ వ్య‌క్తి మిస్సింగ్ కేసు(Missing Case) ఛేదించడానికి ఉప‌యోగ‌ప‌డింది.
    20 ఏళ్ల క్రితం.. యూఎస్‌లోని ఫ్లొరిడా(Florida)లో ఓ వ్య‌క్తి మిస్ అయ్యాడు. 1997 న‌వంబ‌ర్ 8న విలియం మోల్ట్ అనే వ్య‌క్తి త‌ప్పిపోయాడు. అప్ప‌టి నుంచి ఆ వ్య‌క్తి కేసు ఒక మిస్ట‌రీగానే ఉండిపోయింది. పోలీసుల‌కు అత‌డి స‌మాచారం దొర‌క‌లేదు. తాజాగా అత‌డి బాడీని నీళ్ల‌లో మునిగిపోయిన ఓ కారు(Car)లో గుర్తించారు పోలీసులు.

    Hyperloop Train: "హైప‌ర్" టెక్నాల‌జీ.. గంట‌న్న‌ర‌లో ఢిల్లీ నుంచి ముంబైకి వెళ్లొచ్చు




    అది కూడా 20 ఏళ్ల త‌ర్వాత అత‌డి బాడీ దొరికింది. 2019లో హౌసింగ్ డెవ‌లప్‌మెంట్(Development) ఆర్గ‌నైజేష‌న్ మేనేజ‌ర్.. ఒక కొల‌నులో మునిగిపోయిన కారును గూగుల్ మ్యాప్స్ ద్వారా గుర్తించి.. వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం అందించాడు.వెంట‌నే పోలీసులు రంగంలోకి దిగి.. ఆ కారును బ‌య‌టికి తీయ‌గా.. అందులో 20 ఏళ్ల క్రితం త‌ప్పిపోయిన విలియ‌మ్ బాడీ దొరికింది. గూగుల్ ఎర్త్ శాటిలైట్ ఇమేజ్ ద్వారా కొల‌నులో మునిగిపోయి ఉన్న కారును గూగుల్ గుర్తించ‌గ‌లిగి.. గూగుల్ మ్యాప్స్‌లో లొకేష‌న్ ను చూపించింది.
    కేవలం లోకేష‌న్‌లు
    మ‌న‌కు తెలిసినంత వ‌ర‌కు గూగుల్ మ్యాప్‌లు కేవ‌లం లోకేష‌న్ ట్రాక్ మాత్ర‌మే ఉప‌యోగ‌ప‌డ‌డం చూశాం. కానీ ఫ్లోరిడాలో జరిగిన ఘ‌ట‌న‌తో గూగుల్ మ్యాప్స్(Maps) ప‌నితీరు, ఎర్త్ శాటిలైట్ ఇమేజ్ సామ‌ర్థ్యం బ‌య‌ట ప‌డ్డాయి.
    Published by:Sharath Chandra
    First published: