Google Maps: గూగుల్ మ్యాప్స్‌లో రెస్టారెంట్లపై 25% వరకు డిస్కౌంట్... పొందండి ఇలా

Google Maps | ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరు, ముంబై, చెన్నై, ఢిల్లీ, పూణె, కోల్‌కతా, గోవా, అహ్మదాబాద్, జైపూర్, చండీగఢ్ పట్టణాల్లో గల రెస్టారెంట్లల్లో 25 శాతం వరకు డిస్కౌంట్ ఆఫర్స్ అందిస్తోంది గూగుల్.

news18-telugu
Updated: July 12, 2019, 2:47 PM IST
Google Maps: గూగుల్ మ్యాప్స్‌లో రెస్టారెంట్లపై 25% వరకు డిస్కౌంట్... పొందండి ఇలా
Google Maps: గూగుల్ మ్యాప్స్‌లో రెస్టారెంట్లపై 25% వరకు డిస్కౌంట్... పొందండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
మీరు తరచూ గూగుల్ మ్యాప్స్ వాడుతుంటారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఇన్నాళ్లూ రూట్ మ్యాప్స్ సేవలు అందించిన గూగుల్ మ్యాప్స్... ఇప్పుడు రెస్టారెంట్లల్లో ఆఫర్లు కూడా అందించబోతోంది. గూగుల్ మ్యాప్స్‌లో కొత్తగా 3 ఫీచర్లు వచ్చాయి. అందులో రెస్టారెంట్స్‌లో డీల్స్ గురించి తెలిపే ఫీచర్ కూడా ఒకటి. మీకు దగ్గర్లో రెస్టారెంట్స్ ఎక్కడ ఉన్నాయో గూగుల్ మ్యాప్స్‌లో తెలుసుకోవడం సులువు. ఇకపై అలాంటి రెస్టారెంట్లల్లో డిస్కౌంట్లు పొందేందుకు గూగుల్ మ్యాప్స్ ఉపయోగపడుతుంది. గూగుల్ మ్యాప్స్ అందించే డైనింగ్ ఆఫర్స్ మీ అభిరుచులకు తగ్గట్టుగానే ఉంటాయి. మీ టేస్ట్‌కు తగ్గ రెస్టారెంట్లను సూచించే గూగుల్ మ్యాప్స్... ఆ రెస్టారెంట్లల్లో ఎంత వరకు డిస్కౌంట్ పొందొచ్చో వివరిస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరు, ముంబై, చెన్నై, ఢిల్లీ, పూణె, కోల్‌కతా, గోవా, అహ్మదాబాద్, జైపూర్, చండీగఢ్ పట్టణాల్లో గల రెస్టారెంట్లల్లో 25 శాతం వరకు డిస్కౌంట్ ఆఫర్స్ అందిస్తోంది గూగుల్. ఇందుకోసం EazyDiner ప్లాట్‌ఫామ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. లాంఛింగ్ ఆఫర్‌లో భాగంగా యూజర్లు ఈజీడైనర్ ప్రైమ్ ఆఫర్లను 15 రోజులపాటు ఉచితంగా పొందొచ్చు.




Google Maps: రెస్టారెంట్లపై డిస్కౌంట్ పొందండి ఇలా


మీ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేయగానే రెస్టారెంట్స్, కాఫీ, హోటల్స్, పార్క్స్, పెట్రోల్ లాంటి షార్ట్‌కర్ట్స్ కనిపిస్తాయి. అందులోనే Offers పేరుతో షార్ట్ కట్ ఉంటుంది. Offers పైన క్లిక్ చేస్తే మీకు దగ్గర్లో ఉన్న రెస్టారెంట్ల వివరాలు కనిపిస్తాయి. ఏఏ రెస్టారెంట్లలో ఎంత శాతం వరకు డిస్కౌంట్ పొందొచ్చో డీల్ కనిపిస్తుంది. మీరు రెస్టారెంట్ వెబ్‌సైట్‌కి వెళ్లాల్సిన అవసరం లేకుండా నేరుగా గూగుల్ మ్యాప్స్ నుంచే టేబుల్ బుక్ చేసుకోవచ్చు. డిస్కౌంట్ పొందొచ్చు. ఈ డిస్కౌంట్ 25% వరకు ఉంటుంది. ఇక దీంతో పాటు For You పేరుతో మరో ట్యాబ్ యాడ్ చేసింది గూగుల్. ఇందులో మీ అభిరుచులకు తగ్గట్టుగా ప్లేసెస్, రెస్టారెంట్స్, దగ్గర్లో చూడదగ్గ ప్రదేశాలను గూగుల్ మ్యాప్స్ సజెస్ట్ చేస్తుంది. పర్సనలైజ్ రికమండేషన్స్ కోసం మెషీన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తున్నట్టు గూగుల్ చెబుతోంది.

Realme C2: బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ సీ2... ధర రూ.5,999 మాత్రమే


ఇవి కూడా చదవండి:

Amazon Prime: అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌... యూత్‌కు రూ.499 మాత్రమే

Amazon Prime Day Sale: అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో అదిరిపోయే ఆఫర్లు

PAN-Aadhaar Link: ఆధార్‌తో లింక్ చేయకపోతే పాన్ కార్డు చెల్లదు... ఆగస్ట్ 31 డెడ్‌లైన్
Published by: Santhosh Kumar S
First published: July 12, 2019, 2:47 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading