Google Maps: కరోనా అలర్ట్.. గూగుల్ మ్యాప్స్‌లో కొత్త ఫీచర్

Google Maps: గూగుల్ మ్యాప్స్ పనిచేసే 220 దేశాలు, రాష్ట్రాలు, ప్రావిన్స్‌లు, కౌంటీలు, డేటా అందుబాటులో ఉన్న అన్ని నగరాల్లో ఈ సేవలు అందిస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది.

news18-telugu
Updated: September 24, 2020, 9:23 PM IST
Google Maps: కరోనా అలర్ట్.. గూగుల్ మ్యాప్స్‌లో కొత్త ఫీచర్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
గూగుల్ మ్యాప్స్ మరో కొత్త ఫీచర్‌ అప్డేట్ను విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి ఉన్న నేపథ్యంలో ఏయే ప్రదేశాల్లో కేసులు ఎక్కువగా ఉన్నాయి అనే వివరాలు వినియోగదారులకు తెలిసేలా కొత్త ఆప్షన్ను అభివృద్ధి చేసింది. ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్లాలనుకునేవారు దీని ద్వారా కరోనా కేసుల సమాచారం తెలుసుకోవచ్చు. ప్రాంతాలవారీగా COVID-19 కేసుల సంఖ్యను వినియోగదారులకు తెలియజేసేందుకు ఈ ఆప్షన్ ఉపయోగపడుతుందని గూగుల్ చెబుతోంది. మీరు ఎంచుకున్న ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోందా, తగ్గుతోందా, కేసుల డెన్సిటీ ఎలా ఉందనే పూర్తి వివరాలను గూగుల్ మ్యాప్స్ వినియోగదారులకు అందిస్తుంది.

ఎలా పనిచేస్తుంది?

మ్యాప్స్లో ‘COVID-19 info’ అనే లేయర్ టూల్ ద్వారా ఈ ఫీచర్ను యాక్సెస్ చేయవచ్చు. ఈ ఫీచర్ పనితీరు గురించి గూగుల్ మ్యాప్స్ ప్రొడక్ట్ మేనేజర్ సుజోయ్ బెనర్జీ కంపెనీ బ్లాగులో రాశారు. వినియోగదారులు గూగుల్ మ్యాప్స్ యాప్ ఓపెన్ చేసిన తరువాత అప్పర్ రైట్ కార్నర్లో ఉండే లేయర్ టాబ్‌లో ‘COVID-19 info’ ఆప్షన్పై క్లిక్ చేసి వాడుకోవచ్చు. ముందు ఏదైనా ఒక ప్రాంతాన్ని ఎంచుకొని, కొవిడ్-19 ఇన్ఫో ఆప్షన్ను సెలక్ట్ చేసుకోవాలి. ఆ ప్రాంతంలో గత వారం రోజులుగా ప్రతి లక్ష మందిలో నమోదైన సగటు COVID కేసులను వినియోగదారులకు చూపుతుంది.

పాజిటివ్ కేసుల డెన్సిటీతో పాటు మొత్తం కేసుల్లో పెరుగుదల ఉందా, తగ్గుదల ఉందా అనే వివరాలనూ మ్యాప్ పక్కన ఉన్న లేబుల్ సూచిస్తుంది. కలర్ కోడింగ్ ద్వారా కొత్త కేసుల సాంద్రతను తెలుసుకోవచ్చు. ఎక్కువ కేసులు నమోదవుతూ, ముప్పు ఎక్కువ ఉన్న ప్రాంతాలను ఎరుపు రంగులో చూపిస్తుంది. ప్రమాత తీవత్ర మధ్యస్థంగా ఉంటే నారింజ, నామమాత్రంగా పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలను పసుపు రంగులలో చూపిస్తుంది.

దాదాపు అన్ని దేశాల్లోనూ పనిచేస్తుంది
గూగుల్ మ్యాప్స్ పనిచేసే 220 దేశాలు, రాష్ట్రాలు, ప్రావిన్స్లు, కౌంటీలు, డేటా అందుబాటులో ఉన్న అన్ని నగరాల్లో ఈ సేవలు అందిస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. దీంతోపాటు దేశం మొత్తం నమోదవుతున్న కేసుల డేటా కూడా కనిపిస్తుంది. మనదేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ ఈ ఫీచర్ పనిచేస్తుందని ప్రొడక్ట్ మేనేజర్ సుజోయ్ బెనర్జీ బ్లాగ్‌లో తెలిపారు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న లేదా తగ్గుతున్న కేసుల సంఖ్యను కలర్ కోడిండ్ ద్వారా ఆయన బ్లాగ్‌లో వివరించారు.

సమాచారం ఎలా వస్తుంది?ప్రాంతాల వారీగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్యను ట్రస్టెడ్ సోర్సుల ద్వారా సేకరిస్తామని గూగుల్ పేర్కొంది. సాధారణంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రభుత్వ ఆరోగ్య శాఖలతో పాటు రాష్ట్ర, స్థానిక ఆరోగ్య సంస్థలు, ఆసుపత్రుల నుంచి ప్రాంతాల వారీగా కేసుల సంఖ్యను వార్తా సంస్థలు, వికీపీడియా సేకరిస్తాయి. ఈ డేటానే వార్తా సంస్థలు, వికీపీడియా నుంచి గూగుల్ సేకరిస్తుంది. ఇలాంటి నమ్మదగిన సోర్సుల ద్వారా కరోనా పాజిటివ్ కేసుల వివరాలు తెలుసుకోవడం వల్ల తమ వినియోగదారులకు వందశాతం కచ్చితత్త్వంతో సేవలు అందిచగలమని గూగుల్ చెబుతోంది. ఒకవేళ ప్రాంతాల వారీగా కేసుల సంఖ్యను గూగుల్ సెర్చ్లో వెతికినా, సమాచారం ఇచ్చే సోర్స్లు ఇవే కావడం విశేషం.
Published by: Kishore Akkaladevi
First published: September 24, 2020, 9:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading