Home /News /technology /

GOOGLE MAPS LAUNCHES STREET VIEW FEATURE IN INDIA KNOW HOW IT WORKS SS

Google Maps: ఇండియాలో స్ట్రీట్ వ్యూ ఫీచర్ రిలీజ్ చేసిన గూగుల్ మ్యాప్స్... మీరు ఉపయోగించండి ఇలా

Google Maps: ఇండియాలో స్ట్రీట్ వ్యూ ఫీచర్ రిలీజ్ చేసిన గూగుల్ మ్యాప్స్... మీరు ఉపయోగించండి ఇలా
(ప్రతీకాత్మక చిత్రం)

Google Maps: ఇండియాలో స్ట్రీట్ వ్యూ ఫీచర్ రిలీజ్ చేసిన గూగుల్ మ్యాప్స్... మీరు ఉపయోగించండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

Google Maps | గూగుల్ మ్యాప్స్ యూజర్లకు గుడ్ న్యూస్. ఇండియాలో గూగుల్ మ్యాప్స్ స్ట్రీట్ వ్యూ ఫీచర్ (Google Maps Street View) రిలీజైంది. ఈ ఫీచర్ సాయంతో స్ట్రీట్స్ ఎలా ఉన్నాయో మ్యాప్స్‌లో చూడొచ్చు.

గూగుల్ మ్యాప్స్ (Google Maps) యూజర్లకు గుడ్ న్యూస్. యూజర్లు చాలాకాలంగా ఎదురుచూస్తున్న స్ట్రీట్ వ్యూ ఫీచర్ (Google Maps Street View) ఇండియాకు వచ్చేసింది. ఇండియాలో గూగుల్ మ్యాప్స్ సేవలు ప్రారంభమై చాలా ఏళ్లైనా ఇప్పటివరకు స్ట్రీట్ వ్యూ ఫీచర్ అందుబాటులో లేదు. గూగుల్ మ్యాప్స్ అందిస్తున్న పాపులర్ ఫీచర్స్‌లో ఇది కూడా ఒకటి. మొత్తానికి ఇండియాలో స్ట్రీట్ వ్యూ ఫీచర్ లాంఛ్ చేస్తున్నట్టు గూగుల్ ప్రకటించింది. ఇండియాలో ఈ ఫీచర్ అందించేందుకు మ్యాపింగ్ సొల్యూషన్స్ కంపెనీ అయిన జెనిసిస్ ఇంటర్నేషనల్, టెక్ మహీంద్రా సహకారం తీసుకుంటోంది గూగుల్.

స్ట్రీట్ వ్యూ ఫీచర్‌తో ఉపయోగమేంటీ?


ప్రస్తుతం గూగుల్ మ్యాప్స్ ద్వారా లొకేషన్స్ తెలుసుకోగలుగుతన్నారు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి దూరం తెలుసుకోవచ్చు. ఎక్కడ ట్రాఫిక్ ఎలా ఉందో చూడొచ్చు. జీపీఎస్ సాయంతో రూట్ ఫాలో కావొచ్చు. రెస్టారెంట్లు, పెట్రోల్ బంకులు ఇలా తాము వెళ్లాలనుకున్న ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయో మ్యాప్‌లో చూడొచ్చు. స్ట్రీట్ వ్యూ విషయానికి వస్తే ఒక రోడ్డులో ఓ వీధి ఎలా ఉంది? ఆ వీధిలో ఏఏ షాపులు ఉన్నాయి? లాంటి వివరాలన్నీ తెలుసుకోవచ్చు. ఉదాహరణకు హైదరాబాద్‌లో స్ట్రీట్ వ్యూ ఫీచర్ ఉపయోగిస్తే ఏ ప్రాంతం ఎలా ఉందో మ్యాప్‌లో చూడొచ్చు. లక్డీకాపూల్ నుంచి మెహదీపట్నం వెళ్లాలనుకుంటే రూట్ మాత్రమే కాదు, ఆ రూట్‌లో ఏమేం ఉన్నాయో చూడొచ్చు.

Smart Speaker Free: ఈ ఆఫర్ మళ్లీ రాదు... స్మార్ట్‌ఫోన్ కొంటే రూ.4,999 విలువైన స్మార్ట్ స్పీకర్ ఉచితం

ప్రస్తుతం గూగుల్ స్ట్రీట్ వ్యూ ఫీచర్ బెంగళూరు వరకే అందుబాటులోకి వచ్చింది. త్వరలో హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ, ముంబై, పూణె, నాసిక్, వడోదర, అహ్మద్‌నగర్, అమృత్‌సర్‌లో స్ట్రీట్ వ్యూ ఫీచర్ అందుబాటులోకి రానుంది. మొత్తం 1,50,000 కిలోమీటర్ల దూరాన్ని స్ట్రీట్ వ్యూ కవర్ చేయనుంది. 2022 చివరి నాటికి 50 నగరాల్లో స్ట్రీట్ వ్యూ ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు గూగుల్ ప్రణాళికలు రూపొందిస్తోంది.

Smartphone Offer: ఒకసారి ఛార్జింగ్ చేస్తే మూడు రోజుల బ్యాటరీ లైఫ్... ఆఫర్ ధర రూ.10,000 లోపే


గూగుల్ స్ట్రీట్ వ్యూ ఉపయోగించండి ఇలా


ముందుగా గూగుల్ మ్యాప్స్‌లో లొకేషన్ సెర్చ్ చేయాలి.
ఉదాహరణకు Lakdikapool అని సెర్చ్ చేస్తే ఆ ఏరియా మ్యాప్ కనిపిస్తుంది.
మీరు చూడాలనుకుంటున్న ఏరియా పిన్ చేయాలి.
ఆ ఏరియాలో స్ట్రీట్ వ్యూ ఫీచర్ కనిపిస్తే ఆ ఐకాన్ డ్రాగ్ చేసి డ్రాప్ చేయాలి.
ఆ తర్వాత ఆ ఏరియా స్ట్రీట్ వ్యూలో కనిపిస్తుంది. ముందుకు వెనక్కి డ్రాగ్ చేస్తూ మ్యాప్ చూడొచ్చు.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Google, Google Maps

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు