'స్టే సేఫర్' పేరుతో ఇండియాలో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది గూగుల్ మ్యాప్స్. ముఖ్యంగా మహిళల భద్రతకు ఉపయోగపడే ఫీచర్ ఇది. ఎక్కడికైనా వెళ్లాలంటే గూగుల్ మ్యాప్స్‌లో రూట్ చెక్ చేసుకోవడం చాలామందికి అలవాటు. గూగుల్ మ్యాప్స్‌లో మీరు వెళ్లాల్సిన ప్రాంతానికి రూట్స్ చూపిస్తుంటాయి. మీరు ఏదైనా రూట్ సెలెక్ట్ చేసుకొని వెళ్తుంటే... మ్యాప్‌లో బ్లూ డాట్ కూడా రూట్‌ని ట్రాక్ చేస్తుంది. అయితే మీరు వెళ్లాల్సిన రూట్లో కాకుండా మరో దారిలో వెళ్లారంటే వెంటనే గూగుల్ మ్యాప్స్ అలర్ట్ చేస్తుంది. ఇందుకోసం మీరు 'స్టే సేఫర్' ఫీచర్ యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫీచర్ ఎలా పనిచేస్తుందో ఇక్కడ చూడండి.
'స్టే సేఫర్' ఫీచర్లో షేర్ లైవ్ ట్రిప్, గెట్ ఆఫ్ రూట్ అలర్ట్స్ పేరుతో మీకు రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. షేర్ లైవ్ ట్రిప్‌లో మీ కుటుంబసభ్యులు, స్నేహితులతో కాంటాక్ట్ ఎంచుకోవాల్సి ఉంటుంది. వారికి మీ ట్రిప్ షేర్ అవుతుంది. మీరు ఎక్కడ ఉన్నారో వాళ్లు తెలుసుకోవచ్చు. ఇక గెట్ ఆఫ్ రూట్ అలర్ట్స్ ఎంచుకుంటే మీరు మరో రూట్లో వెళ్తుంటే గూగుల్ మ్యాప్స్ నుంచి అలర్ట్స్ వస్తాయి. మీరు వెళ్లాల్సిన రూట్లో కాకుండా మరో దారిలో 0.5 దూరం వెళ్లగానే అలర్ట్ నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ పైన క్లిక్ చేస్తే మీరు ఏ రూట్లో ఉన్నారో తెలుస్తుంది. కొత్త రూట్లల్లో వెళ్లేవారికి, మహిళలకు 'స్టే సేఫర్' ఫీచర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆటోలు, క్యాబ్ డ్రైవర్లు రాంగ్ రూట్లో తీసుకెళ్లకుండా జాగ్రత్తపడొచ్చు.
Motorola One Vision: మోటోరోలా వన్ విజన్... ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
WhatsApp: వాట్సప్‌లో స్టేటస్ నచ్చలేదా? ఈ ఫీచర్ వాడుకోవచ్చు
E-passport: త్వరలో ఇ-పాస్‌పోర్టులు... ఫీచర్లు ఎలా ఉంటాయో తెలుసా?
Free Wifi: రైల్వే స్టేషన్లో ఫ్రీ వైఫై వాడుకోండి ఇలాPublished by:Santhosh Kumar S
First published:June 27, 2019, 13:20 pm