ప్రస్తుత డిజిటల్(Digital) యుగంలో కొత్త ప్రదేశాలకు వెళ్లేందుకు చాలామంది గూగుల్ మ్యాప్స్ (Google Maps) యాప్‌పైనే ఆధారపడుతున్నారు. గూగుల్ మ్యాప్స్ రియల్-టైమ్ ట్రాఫిక్ అప్‌డేట్‌లను(Google Maps Real Time Traffic Update) కూడా అందిస్తుంది కాబట్టి వాహనదారులకు ఎంతో సమయం(Time) ఆదా అవుతోంది. అంతేకాదు ఈ యాప్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అప్‌డేట్స్ వంటి మరిన్ని అద్భుతమైన ఫీచర్లను (Features) అందిస్తుంది. అయితే తాజాగా గూగుల్ గాలి నాణ్యత (Air Quality)ను తెలిపే కొత్త ఫీచర్‌ను మ్యాప్స్‌లో ఇంట్రడ్యూస్(Introduce) చేసింది. ఈ ఫీచర్ సాయంతో సిటీల్లో లేదా దేశంలోని ఇతర ప్రాంతాలలో ఎయిర్ క్వాలిటీ(Air Quality) ఎలా ఉందనేది యూజర్లు ఈజీగా తెలుసుకోవచ్చు. ఎయిర్ క్వాలిటీని చూపించే ఈ ఫీచర్ ఇప్పుడు ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్లకు రిలీజ్ అవుతోంది. భారతీయ యూజర్లు యాప్‌ను అప్‌డేట్ (Update) చేసుకోవడం ద్వారా ఈ ఫీచర్‌ని పొందవచ్చు. ప్రస్తుతానికి ఈ ఫీచర్ ఇండియా(India), ఆస్ట్రేలియా, అమెరికా దేశాల్లో అందుబాటులో ఉంది.
మ్యాప్స్‌లో ఎయిర్ క్వాలిటీ సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి.. గూగుల్ మ్యాప్స్ యాప్ ఓపెన్ చేసి, మీకు కావాల్సిన ప్రాంతాన్ని ఎంచుకోవాలి. తర్వాత టాప్ రైట్ కార్నర్‌లో సెర్చ్ బార్ కింద ఉన్న లేయర్‌ల ఐకాన్‌పై క్లిక్ చేసి ఎయిర్ క్వాలిటీ (Air Quality) ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. తద్వారా నిర్దిష్ట ప్రాంతంలో గాలి స్వచ్ఛమైనదా కాదా అనేది తెలుసుకోవచ్చు. గాలి క్వాలిటీ తక్కువగా ఉంటే ఆ ప్రాంతంలో బయట తిరగకుండా జాగ్రత్త పడాలని మ్యాప్స్ మీకు సలహా ఇస్తుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) అనేది గాలి నాణ్యతను కొలిచే ప్రమాణం కాగా మ్యాప్స్ యాప్ మీ నగరంలో AQI స్థాయిల గురించి మీకు వివరాలను అందిస్తుంది.
* గూగుల్ మ్యాప్స్‌లో గాలి నాణ్యత వివరాలను ఎలా పొందాలి?
- మీ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ మ్యాప్స్ యాప్ ఓపెన్ చేయాలి.
- హోమ్ పేజీలో కుడివైపున ఉన్న బాక్స్ ఐకాన్‌పై క్లిక్ చేయాలి.
- మ్యాప్స్‌లో గాలి నాణ్యత తెలుసుకోవడానికి ఎయిర్ క్వాలిటీపై క్లిక్ చేయాలి.
- నగరం/ప్రాంతంలోని పూర్తి గాలి నాణ్యత డేటాను పొందడానికి ఏదైనా AQI బబుల్‌పై ట్యాప్ చేస్తే సరిపోతుంది.
భారతదేశంలోని అనేక ప్రాంతాలలో గాలి కాలుష్యం తీవ్రమైన సమస్యగా మారింది. ఈ క్రమంలో గూగుల్(Google) తీసుకొచ్చిన ఈ ఫీచర్ బాగా హెల్ప్ అవుతుంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) అందించిన నేషనల్ ఏక్యూఐ (AQI) రీడర్ నుంచి డేటాను ఉపయోగిస్తూ గూగుల్ ఎయిర్ క్వాలిటీ వివరాలను యూజర్లకు అందిస్తోంది. ఈ ఫీచర్ ఏక్యూఐ స్థాయిలను 0 నుంచి 500 వరకు డిస్‌ప్లే వస్తుంది. ఈ లెవెల్స్‌ను ఆకుపచ్చ రంగు నుంచి ముదురు ఎరుపు వరకు కొలుస్తారు. ఈ లెవెల్స్, కలర్స్ గాలిలో కాలుష్య తీవ్రతను తెలియజేస్తాయి. లెవెల్స్ ఎక్కువగా ఉంటే ఆ ప్రాంతంలో గాలి నాణ్యత చాలా తక్కువగా ఉందని అర్థం చేసుకోవాలి.
ప్రస్తుతం, మ్యాప్స్ ఏక్యూఐ (AQI) రీడింగ్స్‌తో పాటు బయటికి వెళ్తే ప్రమాదం ఉందా లేదా అనేది తెలియజేస్తుంది. అయితే ప్రభుత్వం అందించే డేటా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అందుబాటులో ఉంది కాబట్టి గూగుల్ మరిన్ని ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ డీటెయిల్స్ అందించేందుకు ప్రజల నుంచి ఇన్‌పుట్స్ సేకరించే అవకాశముంది. తద్వారా మారుమూల ప్రాంతాల్లో కూడా ఎయిర్ క్వాలిటీ వివరాలు తెలుసుకోవడం సాధ్యమవుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Google, Google news, New feature