Google Pixel: పిక్సెల్ 5, పిక్సెల్ 4A 5G త్వరలో లాంచ్?... ఫీచర్లు ఇవేనా?

Google Pixel: మొదటిసారిగా గూగుల్ నుంచి 5జీ మొబైల్ రాబతోంది. మరి దాని ఫీచర్లు ఎలా ఉండే అవకాశం ఉందో తెలుసుకుందాం.

news18-telugu
Updated: September 6, 2020, 9:45 AM IST
Google Pixel: పిక్సెల్ 5, పిక్సెల్ 4A 5G త్వరలో లాంచ్?... ఫీచర్లు ఇవేనా?
Google Pixel: పిక్సెల్ 5, పిక్సెల్ 4A 5G త్వరలో లాంచ్?... ఫీచర్లు ఇవేనా?
  • Share this:
Google Pixel: కరోనా వైరస్ బలహీనపడుతున్న సమయంలో... గూగుల్ పిక్సెల్ 5, పిక్సెల్ 4A 5Gలను సెప్టెంబర్ 25న జర్మనీలో లాంచ్ కాబోతున్నట్లు వొడాఫోన్ జర్మనీ బ్రాంచ్ అంతర్గత డాక్యుమెంట్ ద్వారా తెలిసింది. అదే నిజమైతే... త్వరలోనే ప్రపంచ దేశాలకు పిక్సెల్ 5, పిక్సెల్ 4A 5G లభిస్తాయి. రెండింటినీ ఒకే రోజు లాంచ్ చేస్తారని తెలిసింది. యాపిల్ ఇన్‌సైడర్, సీరియల్ లీక్‌స్టర్... జాన్ ప్రొస్సెర్ ప్రకారం... పిక్సెల్ 5జీ... బ్లాక్, గ్రీన్ కలర్‌లో ఉంటుందని తెలిసింది. పిక్సెల్ 4A 5G... బ్లాక్ కలర్‌లో మాత్రమే ఉంటుందని తెలిసింది. గూగుల్ పిక్సెల్ 5 ఈమధ్యే... AI బెంచ్‌మార్క్‌పై కనిపించింది. ఇది SD765G SoC పవర్‌తో పనిచేస్తుందని స్పష్టత వచ్చింది. SD765G ఉంది కాబట్టి... 5జీతో వస్తున్న తొలి మొబైల్ ఇదే కావచ్చు.

8జీబీ ర్యామ్‌తో వస్తున్న మొదటి పిక్సెల్ ఫోన్ ఇది. ఐతే... AI బెంచ్‌మార్క్‌ ఇతర ఫీచర్లు, వివరాల్ని తెలపలేదు. త్వరలో వచ్చే పిక్సెల్ 5 కూడా 6.67 ఇంచులు, 120Hz ఓలెడ్ ప్యానెల్‌తో రావచ్చని తెలుస్తోంది.

నెక్ట్స్ వచ్చే పిక్సెల్ మొబైల్... 6.67 ఇంచెస్ డిస్‌ప్లే కలిగి ఉంటుందనీ... దాన్ని శాంసంగ్, BOE దీన్ని సప్లై చేస్తాయనీ... డిస్‌ప్లే అనలిస్ట్ రాస్ యంగ్ ఈ నెలలోనే అన్నారు. స్క్రీన్ 120Hz రీఫ్రెష్ రేటుతో సపోర్ట్ చేస్తుందన్నారు. 8GB ర్యామ్‌తో వస్తున్న మొదటి పిక్సెల్ ఫోన్ ఇదే అవుతుంది.

పిక్సెల్ 4aకి ఉన్నట్లే ఈ స్మార్ట్‌ఫోన్‌లో కూడా మోడ్రన్ పంచ్-హోల్ డిస్‌ప్లే ఫీచర్ ఉండే అవకాశముంది. కొత్త హ్యాండ్ సెట్‌లో ఎక్కువ ప్రీమియం ఫీచర్లు ఉంటాయనే అంచనా ఉంది. IP వాటర్ రేటింగ్, వైర్‌లెస్ చార్జింగ్ సపోర్ట్ ఉంటాయని తెలిసింది. ఈమధ్యే ప్రకటించిన గూగుల్ పిక్సెల్ 4ఏ... 5.81 అంగుళాల ఓ లెడ్ డిస్‌ప్లే ఫీచర్‌తోపాటు... స్నాప్‌డ్రాగన్ 730 మొబైల్ ప్లాట్‌ఫామ్‌తో రాబోతోందని తెలిసింది. ఈ ఫోన్‌కి 6GB ర్యామ్, 128GB స్టోరేజ్‌తో రాబోతోందని తెలిసింది.
Published by: Krishna Kumar N
First published: September 6, 2020, 9:45 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading