హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Google: భారత్‌లో గూగుల్ యాంటీట్రస్ట్​ ఇన్వెస్టిగేషన్‌ను ఎదుర్కొనే అవకాశం.. అసలు ఏం జరిగిందంటే..

Google: భారత్‌లో గూగుల్ యాంటీట్రస్ట్​ ఇన్వెస్టిగేషన్‌ను ఎదుర్కొనే అవకాశం.. అసలు ఏం జరిగిందంటే..

 గూగుల్​పై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) యాంటీ టెస్ట్​ దర్యాప్తుకు ఆదేశించింది. క్షితిజ్ ఆర్య, పురుషోత్తం ఆనంద్ అనే ఇద్దరు న్యాయవాదులు గూగుల్​కు వ్యతిరేకంగా కేసు వేయడంతో ఈ చర్యలు తీసుకుంది.

గూగుల్​పై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) యాంటీ టెస్ట్​ దర్యాప్తుకు ఆదేశించింది. క్షితిజ్ ఆర్య, పురుషోత్తం ఆనంద్ అనే ఇద్దరు న్యాయవాదులు గూగుల్​కు వ్యతిరేకంగా కేసు వేయడంతో ఈ చర్యలు తీసుకుంది.

గూగుల్​పై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) యాంటీ టెస్ట్​ దర్యాప్తుకు ఆదేశించింది. క్షితిజ్ ఆర్య, పురుషోత్తం ఆనంద్ అనే ఇద్దరు న్యాయవాదులు గూగుల్​కు వ్యతిరేకంగా కేసు వేయడంతో ఈ చర్యలు తీసుకుంది.

  భారత స్మార్ట్ టీవీ మార్కెట్లో ఆండ్రాయిడ్​ టీవీలదే అగ్రస్థానం. టెక్​ దిగ్గజం గూగుల్​ ఈ ఆండ్రాయిడ్​ సర్వీసులను అందిస్తోంది. అయితే, తాజాగా గూగుల్​పై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) యాంటీ టెస్ట్​ దర్యాప్తుకు ఆదేశించింది. తన సర్వీసులను దుర్వినియోగం చేసి ఇతర సంస్థలు ఎదగడానికి విఘాతం కలిగిస్తుందన్న ఆరోపణలపై విచారణకు ఆదేశించింది. క్షితిజ్ ఆర్య, పురుషోత్తం ఆనంద్ అనే ఇద్దరు న్యాయవాదులు గూగుల్​కు వ్యతిరేకంగా కేసు వేయడంతో ఈ చర్యలు తీసుకుంది. 60 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని డైరెక్టర్​ జనరల్​ను కోరింది. ఇటీవల ఆన్‌లైన్ అడ్వర్టైజింగ్​ మార్కెట్​లో గూగుల్ పాత్రపై యూరోపియన్ యూనియన్ యాంటీట్రస్ట్ అధికారులు కూడా దర్యాప్తుకు ఆదేశించారు. ఇప్పడు అదే సంస్థపై భారత్​లోనూ విచారణ ప్రారంభం కావడం ఆసక్తికరంగా మారింది.

  భారత మార్కెట్​లో ఆండ్రాయిడ్ టీవీలను ఎక్కువగా విక్రయిస్తున్న షియోమి, టిసిఎల్‌ వంటి కంపెనీలతో యాంటీ-కంప్లీటివ్ ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా గూగుల్ ఆండ్రాయిడ్ టివి మార్కెట్లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వస్తోంది. అయితే, స్మార్ట్​ టీవీతో పాటే ఇన్​బిల్ట్​గా కొన్ని యాప్స్​ అందివ్వడం, వాటిని తప్పనిసరి చేయడం ద్వారా సర్వీసులను దుర్వినియోగం చేస్తుందనే ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ కారణంగా, అమెజాన్ వంటి గూగుల్​కు పోటీ సంస్థలు స్మార్ట్​ టీవీలకు ఆపరేటింగ్ సిస్టమ్‌లకు లైసెన్స్ ఇవ్వలేకపోతున్నామని వాపోతున్నాయి.

  ఇది ACC (ఆండ్రాయిడ్ కంపాటెబిలిటీ కమిట్​మెంట్స్​) నిబంధనలకు విరుద్ధమని ఆయా సంస్థలు ఆరోపిస్తున్నాయి. గూగుల్​ తన ప్రత్యర్థి సంస్థలను ఎదగనీయకుండా చేస్తుందని, ఆండ్రాయిడ్​ డివైజెస్​ తయారీ యాజమాన్యాలకు గూగుల్​ చర్యలు నష్టాన్ని కలుగజేస్తున్నాయని పేర్కొన్నాయి. ఈ చర్యలతో ప్రజలకు కొత్త టెక్నాలజీ అందుబాటులోకి రాకుండా చేయడమేనని అభిప్రాయపడుతున్నాయి.

  సెక్షన్ 4 (2) (సి) ఉల్లంఘన..

  ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఇతర డివైజెస్​ను తయారు చేయడం/ పంపిణీ చేయడం/ అమ్మడం వంటి చర్యలకు గూగుల్ అడ్డుకట్ట వేస్తోందని ఏసీసీ పేర్కొంది. అందువల్ల, స్మార్ట్ టీవీ మార్కెట్లలో గూగుల్ ఆధిపత్యాన్ని తగ్గించేందుకు యాంటీ ట్రస్ట్​ దర్యాప్తుకు ఆదేశించినట్లు స్పష్టం చేసింది. గూగుల్ చర్యల వల్ల ఇతర ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ డెవలపర్లు తీవ్రంగా నష్టపోతున్నారని, వారు మార్కెట్​లో తమ ప్రొడక్ట్స్, సర్వీసులను అందించలేకపోతున్నారని పేర్కొంది. ఇది సెక్షన్ 4 (2) (సి) ఉల్లంఘన కిందికే వస్తుందని స్పష్టం చేసింది.

  ఏదేమైనా గూగుల్ మాత్రం దీనికి భిన్నమైన వాదన వినిపిస్తోంది. తమ స్మార్ట్ టీవీ లైసెన్సింగ్ పద్ధతులన్నీ చట్టాలకు లోబడే ఉన్నాయని ప్రకటించింది. ఇదిలా ఉంటే, కౌంటర్ పాయింట్ రీసెర్చ్ డేటా ప్రకారం, భారతదేశంలో 8 మిలియన్లకు పైగా స్మార్ట్ టీవీలు ఉన్నాయి. వీటిలో 60 శాతానికి పైగా స్మార్ట్​టీవీలు గూగుల్ ఆండ్రాయిడ్​తో పనిచేస్తున్నాయి.

  First published:

  Tags: Android TV, Google

  ఉత్తమ కథలు