హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Passkeys: ఇక నో పాస్‌వర్డ్‌? క్రోమ్‌లో పాస్‌కీస్‌ను లాంఛ్ చేసిన గూగుల్‌... ఎలా పనిచేస్తుందంటే

Passkeys: ఇక నో పాస్‌వర్డ్‌? క్రోమ్‌లో పాస్‌కీస్‌ను లాంఛ్ చేసిన గూగుల్‌... ఎలా పనిచేస్తుందంటే

Passkeys: ఇక నో పాస్‌వర్డ్‌? క్రోమ్‌లో పాస్‌కీస్‌ను లాంఛ్ చేసిన గూగుల్‌... ఎలా పనిచేస్తుందంటే
(ప్రతీకాత్మక చిత్రం)

Passkeys: ఇక నో పాస్‌వర్డ్‌? క్రోమ్‌లో పాస్‌కీస్‌ను లాంఛ్ చేసిన గూగుల్‌... ఎలా పనిచేస్తుందంటే (ప్రతీకాత్మక చిత్రం)

Passkeys | హ్యాకర్ల ముప్పు నుంచి రక్షణ కల్పించేందుకు గూగుల్ పాస్‌వర్డ్స్ బదులు కొత్తగా పాస్‌కీస్ ఫీచర్ (Google Passkeys Feature) తీసుకొచ్చింది. గూగుల్ క్రోమ్‌లో పాస్‌కీస్ ఫీచర్ ఉపయోగించుకోవచ్చు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

ప్రస్తుతం అన్ని రకాల సేవలు మొబైల్‌ అప్లికేషన్‌లు, వెబ్‌సైట్‌ల రూపంలో అందుతున్నాయి. వీటన్నింటిలో యూజర్‌లకు భద్రత కల్పించేది పాస్‌వర్డ్‌లే. అయితే చాలా సందర్భాల్లో పాస్‌వర్డ్‌లు హ్యాకింగ్‌కు గురవుతున్నాయి. చాలా మంది స్ట్రాంగ్‌ పాస్‌వర్డ్‌లు సెట్‌ చేసుకోకుండా ఉండటంతో.. ఫిషింగ్‌కు అనుకూలంగా మారుతున్నాయి. ఈ సమస్యలకు చెక్‌ పెట్టేలా గూగుల్‌ కంపెనీ తమ క్రోమ్ యూజర్‌ల కోసం సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. అక్టోబర్‌లో టెస్టింగ్ పూర్తవడంతో.. ఈ వారంలో లేటెస్ట్‌ ఫీచర్‌ ‘పాస్‌కీస్‌’ను లాంచ్‌ చేసింది. పాస్‌వర్డ్‌లు, ఇతర ఫిషబుల్‌ అథెంటికేషన్‌ ఫ్యాక్టర్స్‌కు సురక్షితమైన ప్రత్యామ్నాయంగా పాస్‌కీస్‌ను గూగుల్‌ డెవలప్‌ చేసింది.

పాస్‌కీస్‌(Passkeys) అంటే ఏంటీ?

హ్యాకింగ్‌, ఫిషింగ్‌ సమస్యలను గుర్తించిన గూగుల్‌ 2-స్టెప్‌ వెరిఫికేషన్‌, గూగుల్‌ పాస్‌వర్డ్ మేనేజర్ వంటి డిఫెన్స్‌లను తీసుకొచ్చింది. అయితే సెక్యూరిటీ థ్రెట్స్‌ను పరిష్కరించడానికి, కంపెనీ పాస్‌వర్డ్ రహిత అథెంటికేషన్‌ వైపు వెళ్లాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే పాస్‌కీస్‌ డెవలప్‌ చేసింది. పాస్‌కీస్‌ను రీయూజ్‌ చేయలేరు. సర్వర్‌పై దాడులు చేసినప్పుడు లీక్‌ కావు, ఫిషింగ్ దాడుల నుంచి యూజర్‌లకు రక్షణ కల్పిస్తాయి. పాస్‌కీస్‌ను ఇండస్ట్రీ స్టాండర్డ్స్‌ ఆధారంగా డెవలప్‌ చేశారు. వివిధ ఆపరేటింగ్ సిస్టమ్‌లు, బ్రౌజర్‌లలో పని చేస్తాయి. వెబ్‌సైట్‌లు, యాప్‌లు రెండింటిలోనూ ఉపయోగించవచ్చు.

WhatsApp Meta Avatar: వాట్సప్‌‌లో మెటా అవతార్‌ క్రియేట్ చేయండి ఇలా

పాస్‌కీస్‌ను ఎలా ఉపయోగించవచ్చు?

పాస్‌కీస్‌ను వెబ్‌సైట్‌ లేదా యాప్‌లలో సైన్ ఇన్ చేయడానికి ఉపయోగించవచ్చు. పాస్‌కీస్‌తో సైన్ ఇన్ అవుతున్నప్పుడు డివైజ్‌ను అన్‌లాక్‌ చేసిన విధంగానే యూజర్‌ తమను తాము అథెంటికేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. క్రోమ్‌ ప్రస్తుతం Windows 11, macOS, Androidలో పాస్‌కీస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్‌లో పాస్‌కీస్‌ గూగుల్‌ పాస్‌వర్డ్ మేనేజర్ ద్వారా సురక్షితంగా సింక్రనైజ్‌ అవుతాయి. డివైజ్‌లో పాస్‌కీని సేవ్ చేసిన తర్వాత, మరింత సురక్షితంగా ఉండటానికి సైన్ ఇన్ చేస్తున్నప్పుడు ఆటోఫిల్‌ ఆప్షన్‌ చూపుతుంది. డెస్క్‌టాప్‌లో, సమీపంలోని మొబైల్ డివైజ్‌ నుంచి పాస్‌కీస్‌ ఉపయోగించే అవకాశం ఉంటుంది. ఇలా సైన్ ఇన్ చేస్తున్నప్పుడు పాస్‌కీస్‌ వల్ల మొబైల్‌కి ఎలాంటి రిస్క్‌ ఉండదు. సురక్షితంగా జనరేట్‌ చేసిన కోడ్ మాత్రమే వెబ్‌సైట్‌తో ఎక్స్ఛేంజ్‌ అవుతుంది. పాస్‌వర్డ్‌లా లీక్‌ అయ్యే ప్రమాదం ఏదీ ఉండదు.

పాస్‌కీస్‌పై వినియోగదారులకు నియంత్రణను అందించడానికి Chrome M108 నుంచి Windows, macOSలో Chrome నుంచి పాస్‌కీస్‌ను మేనేజ్‌ చేసే అవకాశం ఉంది. Google వినియోగదారులు తమ పాస్‌కీస్‌ను Android నుంచి ఇతర డివైజ్‌లతో సింక్రనైజ్‌ చేసుకోవచ్చు. ఇందుకు గూగుల్ కంపెనీ పాస్‌వర్డ్‌ మేనేజర్‌ ఉపయోగించవచ్చు లేదా సురక్షిత మైన 1Password లేదా Dashlane వంటి థర్డ్‌పార్టీ పాస్‌వర్డ్ మేనేజర్‌ని ఉపయోగించవచ్చు.

Jio New Plan: జియో కొత్త ప్లాన్... ఒక్క రీఛార్జ్‌తో 50జీబీ డేటా

మెమొరీ సేవర్‌, ఎనర్జీ సేవర్‌ మోడ్స్‌

ప్రత్యేకంగా డెస్క్‌టాప్ వెబ్ బ్రౌజర్ కోసం Chrome ఇటీవల రెండు కొత్త మోడ్స్‌.. మెమరీ సేవర్, ఎనర్జీ సేవర్ లాంచ్‌ చేసింది. ఇవి బ్యాటరీ లైఫ్‌ను పెంచుతాయి. మెమరీని ఖాళీ చేస్తాయి. ఈ కొత్త మోడ్‌లు క్రోమ్ మెమరీ వినియోగాన్ని 30% వరకు తగ్గించడానికి, డివైజ్‌ పవర్ తక్కువగా ఉన్నప్పుడు బ్యాటరీ లైఫ్‌ పొడిగించడానికి ఉపయోగపడుతాయని Google పేర్కొంది. ప్రస్తుతం ఈ రెండు మోడ్‌లు Chrome డెస్క్‌టాప్ (m108)లో అందుబాటులో ఉన్నాయి.

First published:

Tags: Google, Google accounts, Google new feature

ఉత్తమ కథలు