GOOGLE LAUNCHES NEW COOKIES OPTIONS MORE PROTECTION FOR GOOGLE SEARCH AND YOUTUBE BROWSING GH VB
Google Cookies: గూగుల్ కొత్త కుకీస్ ఆప్షన్స్ లాంచ్.. గూగుల్ సెర్చ్, యూట్యూబ్ బ్రౌజింగ్‌కు మరింత రక్షణ..
(ప్రతీకాత్మక చిత్రం)
టెక్ దిగ్గజం గూగుల్ (Google) కొత్త కుకీస్ (Cookies) ఆప్షన్స్ పాలసీని లాంచ్ చేసింది. గ్లోబల్ మార్కెట్లో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు కొత్త పాలసీ డిసీజన్స్ తీసుకుంది.
టెక్ దిగ్గజం గూగుల్ (Google) కొత్త కుకీస్ (Cookies) ఆప్షన్స్ పాలసీని లాంచ్ చేసింది. గ్లోబల్ మార్కెట్లో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు కొత్త పాలసీ డిసీజన్స్ తీసుకుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో యూరోపియన్ రెగ్యులేటర్(European Regulators)ల ఆదేశాలతో 150 మిలియన్ యూరోలను గూగుల్ చెల్లించింది. ఆ తర్వాత యూరప్‌లో ‘రిజెక్ట్ ఆల్ కుకీస్’(Reject All Cookies) బటన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. యూరప్‌లో సైన్ అవుట్ చేసినప్పుడు లేదా ఇన్‌కాగ్నిటో మోడ్‌లో ఉన్నప్పుడు గూగుల్, యూట్యూబ్‌ను ఓపన్ చేస్తే అప్డేటెడ్ కుకీస్ డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. రిజెక్ట్, యాక్సెప్ట్ ఆల్ బటన్లు ఉంటాయి.
కుకీస్ అంటే ఏంటి?
యూజర్ కంప్యూటర్లో వినియోగించే వెబ్ బ్రౌజర్లో స్టోర్ అయ్యే చిన్న డేటాను కుకీ అంటారు. దీని ద్వారా ఆయా వెబ్సైట్లను యూజర్ ముందే వినియోగించారా? ఎలాంటి ఆప్షన్స్ ఎంచుకొన్నారు? ఎలాంటి విషయాల కోసం ఉపయోగించారు? వంటి వివరాలు స్టోర్ అవుతాయి. దీని ద్వారా యూజర్‌కు మెరుగైన సేవలు అందించే అవకాశం ఉంటుంది. ఓ వెబ్‌సైట్‌ను ఓపన్ చేయగానే దానికి సంబంధించి స్టోర్ అయి ఉన్న కుకీ కూడా సంబంధిత సైట్‌కు సెండ్ అవుతుంది. అందులోని సమాచారం ఆధారంగా వెబ్సైట్లో ఆప్షన్లు మారుతాయి. ఉదాహరణకు గూగుల్ పేజీలో ల్యాంగ్వేజ్ ఆప్షన్ ఉంటుంది. గూగుల్ వెబ్సైట్ ఓపెన్ చేయగానే దానికి సంబంధించిన కుకీ ద్వారా ల్యాంగ్వేజ్ ఆప్షన్ తెలుస్తుంది. యూజర్ మళ్లీ కావాల్సిన ల్యాంగ్వేజ్‌ను సెలక్ట్ చేసుకొనే అవసరం లేకుండా.. కుకీ ఆధారంగా సైట్లో ల్యాంగ్వేజ్ మారుతుంది.
* సులువుగా గుర్తించేలా బటన్లు..
ఇంతకు ముందు ఈ ప్రక్రియ యాక్సెప్ట్, పెర్సనలైజ్ బటన్లతో కొంచెం ఎక్కువ సమయం తీసుకొనేది. ప్రస్తుతం యూజర్లు కేవలం ఒక బటన్‌తో అన్ని కుకీస్‌ను అంగీకరించే అవకాశం ఉంది. అదే రిజెక్ట్ చేయాలంటే చాలా ఆప్షన్లను ఎంచుకోవాలి. అన్ని అనవసరమైన కుకీస్‌ను రిజెక్ట్ చేయాలంటే యూజర్లు చాలా ఆప్షన్లను నమోదు చేయాలి. ప్రస్తుతం యూజర్లకు గూగుల్, యూట్యూబ్‌లో మూడు స్పష్టమైన బటన్లు అందుబాటులోకి వచ్చాయి. అవి యాక్సెప్ట్ ఆల్, రిజెక్ట్ ఆల్, మోర్ ఆప్షన్స్. అన్ని కుకీస్‌ను కేవలం ఒక బటన్ క్లిక్‌తో నియంత్రించవచ్చు.
యాక్సెప్ట్ ఆల్, రిజెక్ట్ ఆల్ బటన్లు రెండూ కొత్త బ్యానర్లో ప్రముఖంగా కనిపిస్తాయి. గందరగోళాన్ని నివారించడానికి లేదా యూజర్లు పొరపాటున యాక్సెప్ట్ బటన్‌ను క్లిక్ చేయకుండా నిరోధించడానికి ఒకే పరిమాణం, రంగులోనే బటన్లు ఉంటాయి. “మోర్ ఆప్షన్స్” బటన్ వేరే రంగులో ఉంటుంది. ఈ అప్డేట్ వివరాలపై గూగుల్ ప్రోడక్ట్ మేనేజర్ సమ్మిత్ ఆది ఒక బ్లాగ్ పోస్ట్‌లో అభిప్రాయాలు తెలిపారు. ‘యూట్యూబ్‌లో ఈ నెల ప్రారంభంలో ఈ కొత్త అప్డేట్ అందుబాటులోకి వచ్చింది. ప్రెఫర్డ్ ల్యాంగ్వేజ్ ఫస్ట్ స్క్రీన్‌లో యాక్సెప్ట్ ఆల్, రిజెక్ట్ ఆల్ బటన్లు కనిపిస్తాయి’ అని పేర్కొన్నారు.
నిబంధనలు పాటించకపోతే భారీ జరిమానా
యూరప్‌లోని పెద్ద టెక్ కంపెనీలపై నిబంధనలు కఠినతరం చేసే నిర్ణయం.. యూరప్ న్యూ డిజిటల్ సర్వీసెస్ యాక్ట్ రూల్‌కు ముందే వెలువడింది. డిజిటల్ సర్వీసెస్ యాక్ట్ లేదా DSA టెక్ దిగ్గజాలను తమ ప్లాట్‌ఫారమ్‌లలో కనిపించే కంటెంట్‌పై బాధ్యత వహించాలని పేర్కొటోంది. కొత్త నిబంధనలలో చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను మరింత త్వరగా తొలగించడం, వినియోగదారులు, పరిశోధకులకు వారి అల్గారిథమ్‌లు ఎలా పని చేస్తాయో వివరించడం, తప్పుడు సమాచారం వ్యాప్తిపై మరింత కఠిన చర్యలు తీసుకోవడం వంటివి ఉన్నాయి. కొత్త చట్టాలను పాటించనందుకు కంపెనీలపై వాటి మొత్తం వార్షిక టర్నోవర్‌లో 6 శాతం వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.