హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Google Chrome Floc: గూగుల్‌ కొత్త టెక్నాలజీ కొంపలు ముంచేలా ఉందంటున్న నిపుణులు

Google Chrome Floc: గూగుల్‌ కొత్త టెక్నాలజీ కొంపలు ముంచేలా ఉందంటున్న నిపుణులు

Google Chrome Floc: గూగుల్‌ కొత్త టెక్నాలజీ కొంపలు ముంచేలా ఉందంటున్న నిపుణులు
(ప్రతీకాత్మక చిత్రం)

Google Chrome Floc: గూగుల్‌ కొత్త టెక్నాలజీ కొంపలు ముంచేలా ఉందంటున్న నిపుణులు (ప్రతీకాత్మక చిత్రం)

Google Chrome Floc | గూగుల్ మిమ్మల్ని ట్రాక్ చేయడానికి కొత్త పద్ధతి కనిపెట్టింది. ఫెడరేటడ్‌ లెర్నింగ్‌ కోహోట్‌-FLoC పేరుతో కొత్త టెక్నాలజీని పరీక్షిస్తోంది.

ఇంటర్నెట్‌లో ప్రైవసీ ఉంటుందా... అంటే ఏమో కష్టమే అంటుంటారు మన టెక్నాలజీ నిపుణులు. అందుకు తగ్గట్టే చాలా టెక్‌ దిగ్గజాలు డేటా లీకేజీ సమస్యలు ఎదుర్కొవడం మనకు తెలిసిందే. తాజాగా గూగుల్ క్రోమ్‌ చేస్తున్న ప్రయత్నం మరోసారి ప్రైవసీ టాపిక్‌ను చర్చకు తీసుకొచ్చింది. గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్‌ను వినియోగించినప్పుడు యూజర్‌ యూసేజ్‌ని ట్రాక్‌ చేస్తుందనే విషయం తెలిసిందే. దీనిపై చాలా రోజుల నుండి చర్చ జరుగుతూనే ఉంది. అయితే ఆ ఇబ్బంది తొలగిస్తాం అంటూ ఫెడరేటడ్‌ లెర్నింగ్‌ కోహోట్‌ (FLoC)అనే కొత్త టెక్నాలజీని తీసుకొస్తోంది. అయితే ట్రాకింగ్‌ కంటే ‘ఫ్లోక్‌’తోనే ఎక్కువ ఇబ్బంది అనేది టెక్‌ నిపుణుల మాట. అసలేంటీ ‘ఫ్లోక్‌’,ఈ టెక్నాలజీ మీ బ్రౌజర్‌లో యాక్టివేట్‌లో ఉందా, ఉంటే ఏం చేయాలి అనేది చూద్దాం.

గూగుల్‌ ఏం చెబుతోంది


మీరు బ్రౌజర్‌లో ఏయే వెబ్‌సైట్లు చూశారు అనేది తెలుసుకొని, ప్రకటనకర్తలు (యాడ్‌లు ఇచ్చేవారు)కు ఆ సమాచారం అందజేసి, మీ బ్రౌజర్‌లో వాటికి సంబంధించిన యాడ్స్‌ వచ్చేలా చేస్తుంటుంది. ఇదంతా ట్రాకింగ్‌ ద్వారానే సాధ్యమవుతోంది. ప్రస్తుతం వెబ్‌సైట్లు స్క్రిప్టుల ద్వారా యూజర్లను ట్రాక్‌ చేస్తున్నాయి. ‘ఫ్లోక్‌ ’టెక్నాలజీ అందుబాటులోకి వస్తే ఏ వెబ్‌సైట్లు కూడా యూజర్లను ట్రాక్‌ చేయవు అని గూగుల్‌ చెబుతోంది. ఇక్కడివరకు అంతా బాగుంది. అయితే ‘ఫ్లోక్‌’ ట్రాకింగ్‌కి మించి సమాచారాన్ని యూజర్ల నుంచి పొందుతోందట. దీనికి కారణం ‘ఫ్లోక్‌’ యూజర్‌ బ్రౌజింగ్‌ యాక్టివిటీ, హిస్టరీని యాక్సెస్‌ చేయగలగడమే. యూజర్‌ బ్రౌజ్‌ చేసిన సైట్స్‌ వివరాలను కంపార్టెమెంట్స్‌ / కోహెట్స్‌గా వర్గీకరించి ‘ఫ్లోక్‌’ సేవ్‌ చేస్తుంది.

Samsung Galaxy A32: ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.3,000 తగ్గింది... రూ.1,500 డిస్కౌంట్ కూడా

LG Wing: ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.40,000 తగ్గింది... లేటెస్ట్ రేట్ ఎంతంటే

ఈ కంటెంట్‌ కంపార్ట్‌మెంట్స్‌ సాయంతో గూగుల్‌ క్రోమ్‌ ఆ యూజర్‌ ఐడెంటిటీని యాక్సెస్‌ చేస్తుంది. అలాంటి ఐడెంటిటీ నే ఉన్న మరో యూజర్‌తో తొలి యూజర్‌ను గ్రూప్‌గా చేస్తుంది. అంటే ఒకే తరహా వెబ్‌సైట్లు చూసే వారందరినీ ఒక గ్రూపుగా మారుస్తుందన్నమాట. వారికి దానికి సంబంధించిన యాడ్స్‌ పంపిస్తుంటుంది. అయితే కంపార్ట్‌మెంట్స్‌/కోహెట్స్‌లో ఉండే సునిశిత (సెన్సెటివ్‌) సమాచారాన్ని ప్రకటనకర్తలతో పంచుకోం అని గూగుల్‌ చెబుతోంది. అలా పంచుకోని సమాచారంలో ఆరోగ్య పరిస్థితి తదితర అంశాలు ఉంటాయని తెలిపింది. అయితే ఆ సమాచారం సునిశితమైనదా కాదా అనేది గూగులే నిర్ణయిస్తుందట. ఇందులో వినియోగదారుడి ప్రమేయం ఏమీ ఉండదట. అంటే యూజర్‌ బ్రౌజింగ్ హిస్టరీ మొత్తాన్ని గూగుల్‌ పరిశీలిస్తుందనేది స్పష్టమైన విషయం. దీంతో ఫ్లోక్‌ సాంకేతిక సరైన విధానం కాదని టెక్‌ నిపుణులు చెబుతున్నారు.

Poco X3 Pro: రూ.18,999 విలువైన స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌తో రూ.2,499 ధరకే కొనండి ఇలా

WhatsApp: మీరు వాట్సప్ గ్రూప్ అడ్మిన్‌గా ఉన్నారా? ఈ కొత్త ఫీచర్ మీకోసమే

మరి తెలుసుకోవడం ఎలా?


గూగుల్‌ క్రోమ్‌ ‘ఫ్లోక్‌’ సాంకేతికతను ఇప్పటికే కొంతమంది వినియోగదారులకు ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకొచ్చేసిందట. ఈ విషయం ఆ వినియోగదారులకు కూడా తెలియదు అని సమాచారం. అయితే మొత్తం గూగుల్‌ క్రోమ్‌ వినియోగదారుల్లో ‘ఫ్లోక్‌’ యాక్టివ్‌ అయిన వినియోగదారులు 0.5 శాతం ఉంటారని తెలుస్తోంది. అంటే వారి సెర్చ్‌ హిస్టరీ, యాక్టివిటీపై గూగుల్‌ ఇప్పటికే ఓ కన్నేసిందన్నమాట. ఎవరి బ్రౌజర్‌లో ‘ఫ్లోక్‌’ యాక్టివ్‌ అయి ఉంది అనేది తెలుసుకోవడానికి ఈఎఫ్‌ఎఫ్‌ అనే వెబ్‌సైట్‌ ఓ ట్రాకింగ్‌ టూల్‌ని (https://amifloced.org/) సిద్ధం చేసింది. ఈ టూల్‌ను మీ బ్రౌజర్‌లో హిట్ చేస్తే (రన్‌ చేస్తే) ‘ఫ్లోక్‌’ యాక్టివ్‌ అయ్యిందా లేదా అనేది తెలుసుకోవచ్చు. ‘ఫ్లోక్‌’ తీసుకొచ్చినా అత్యాధునికమైన ప్రైవసీ కంట్రోల్స్‌ను బ్రౌజర్‌లో తీసుకొస్తామని గూగుల్‌ మరోవైపు చెబుతోంది. అయితే ‘ఫ్లోక్‌’ యాక్టివ్‌ అయిన బ్రౌజర్‌లో అలాంటి కంట్రోల్స్‌ లేవని నిపుణులు చెబుతున్నారు.

మరి మనమేం చేయాలి?


గూగుల్‌ ఇలా చెప్పా పెట్టకుండా ఫ్లోక్‌ లాంటి సాంకేతికతను తీసుకురావడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఈ ఇబ్బంది తొలగాలంటే బ్రౌజర్‌ వినియోగం మార్చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రైవసీకి పెద్ద పీట వేస్తుందనే పేరున్న మొజిల్లా ఫైర్‌ ఫాక్స్‌, గోస్ట్రీ, డక్‌డక్‌గో లాంటి బ్రౌజర్లు వాడటం మంచిదని సూచిస్తున్నారు. దీంతోపాటు డక్‌ డక్‌ గో కి చెందిన ఫ్లోక్‌ బ్రౌజర్‌ ప్లగిన్‌ను వాడటం ద్వారా కూడా ఈ ఇబ్బంది నుండి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. దీంతోపాటు వినియోగదారులు గూగుల్‌ క్రోమ్‌లో థర్డ్‌ పార్టీ కుకీస్‌ను కూడా ఆఫ్‌ చేసి కూడా ఈ ఇబ్బంది నుండి కొంతవరకు బయట పడొచ్చని నిపుణులు చెబుతున్నారు.

First published:

Tags: Google, Google news

ఉత్తమ కథలు