హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Google Wallet: కొత్త వాలెట్ యాప్‌ను లాంచ్ చేయనున్న గూగుల్.. దీని ప్రత్యేకతలు తెలుసుకోండి..

Google Wallet: కొత్త వాలెట్ యాప్‌ను లాంచ్ చేయనున్న గూగుల్.. దీని ప్రత్యేకతలు తెలుసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

టెక్ దిగ్గజం గూగుల్ (Google) ఎప్పటికప్పుడు సరికొత్త సేవలను పరిచయం చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. తాజాగా జరిగిన Google I/O యాన్యువల్ డెవలపర్ కాన్ఫరెన్స్‌లో కూడా ఈ ఏడాది చాలా కొత్త ప్రొడక్ట్స్ తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.

టెక్ దిగ్గజం గూగుల్ (Google) ఎప్పటికప్పుడు సరికొత్త సేవలను పరిచయం చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. తాజాగా జరిగిన Google I/O యాన్యువల్ డెవలపర్ కాన్ఫరెన్స్‌లో కూడా ఈ ఏడాది చాలా కొత్త ప్రొడక్ట్స్ తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. వాటిలో గూగుల్ వాలెట్ (Google Wallet) యాప్ అందరి దృష్టిని ఆకర్షించింది. కొత్తగా వస్తున్న గూగుల్ యాప్ ఒక డిజిటల్ వాలెట్ (Digital Wallet)గా పనిచేస్తుంది. దీనర్థం మీరు సాధారణంగా మీ వాలెట్ లేదా పర్స్‌లో తీసుకెళ్లే క్రెడిట్, డెబిట్ కార్డ్‌లు, ఈవెంట్ టిక్కెట్‌లు, ఎయిర్‌లైన్ బోర్డింగ్ పాస్‌లు, టీకా రికార్డులు, స్టూడెంట్ ఐడీ వంటి వాటిని గూగుల్ వాలెట్‌లో డిజిటల్ వెర్షన్లలో స్టోర్ చేసుకోవచ్చు. అలా మీరు క్రెడిట్, డెబిట్ కార్డ్స్, తదితర వాటి కోసం ప్రత్యేకంగా పర్సు తీసుకెళ్లాల్సిన అవసరం రాదు. ఈ యాప్ 40కి పైగా దేశాల్లో త్వరలోనే అందుబాటులోకి వస్తుందని గూగుల్ తెలిపింది. గూగుల్ వాలెట్ యాప్‌తో డిజిటల్ వరల్డ్ వైపు ముందడుగు పడినట్లేనని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

కరోనా కారణంగా చాలా మంది వ్యక్తులు ఇప్పటికే ఆన్‌లైన్‌లోనే పేమెంట్స్ చేసేందుకు అలవాటు పడ్డారు. వివిధ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఆహారం, ఇతర వస్తువులను ఆర్డర్ చేయడం ప్రారంభించారు. అయితే ఈ డిజిటల్ యుగంలో కొత్త వాలెట్ యాప్‌ని బ్యాంక్ కార్డ్‌లను స్టోర్ చేయడానికి ఉపయోగించవచ్చు, ఇది చాలా వేగంగా పేమెంట్స్ చేయడంలో యూజర్లకు హెల్ప్ చేస్తుంది. మీరు మీ కార్డ్‌లను ప్రతి చోటుకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. మీరు వాటిని సేఫ్‌గా ఇంట్లో ఉంచుకోవచ్చు. బ్యాంకు కార్డులే కాకుండా ఎలాంటి కార్డునైనా గూగుల్ వాలెట్‌లో స్టోర్ చేసుకోవచ్చు. భవిష్యత్తులో డిజిటల్ ఐడీలకు కూడా గూగుల్ వాలెట్ యాప్‌ సపోర్ట్ చేస్తుందని గూగుల్ ధ్రువీకరించింది.

Google IO 2022: గూగుల్ ఈవెంట్‌లో పాత ఫీచర్లకు కొత్త అప్‌డేట్స్.. గూగుల్ మ్యాప్స్‌లో రానున్న మార్పులు ఇవే..

ఈ యాప్‌లో ఫ్లైట్ బోర్డింగ్ పాస్‌ను కూడా సేవ్ చేసుకోవచ్చు. గూగుల్ వాలెట్‌లో బోర్డింగ్ పాస్‌ను యాడ్ చేసుకోవడం ద్వారా ఫ్లైట్ ఆలస్యాలు లేదా తేదీ మార్పుల గురించి అలర్ట్స్ పొందొచ్చు. మ్యూజికల్ కన్సర్ట్ కోసం కూడా ముందుగా అలర్ట్స్ పొందవచ్చు. కొత్త వాలెట్ యాప్ ఇతర గూగుల్ సేవలతో కూడా కలిసి పని చేస్తుందని కంపెనీ పేర్కొంది. యూజర్లు బస్సు లేదా రైల్లో ఒక ప్రదేశానికి వెళుతూ గూగుల్ మ్యాప్స్‌లో డైరెక్షన్స్ కోసం వెతుకుతున్నట్లయితే.. వారు మ్యాప్స్‌లో తమ ట్రాన్సిట్ కార్డ్‌తో పాటు కార్డ్‌లోని బ్యాలెన్స్‌ని కూడా చూడగలరు. వెళ్తున్న రూట్ ప్రయాణానికి ఛార్జీ ఎక్కువగా ఉన్నట్లయితే.. కార్డ్‌పై నొక్కి, మరిన్ని డబ్బులు యాడ్ చేసుకోవచ్చు.

Google: గూగుల్ లో ఈ విషయాల గురించి వెతికితే జైలుకే.. అవేంటంటే?

బోర్డింగ్ లేదా కోవిడ్ వ్యాక్సిన్ కార్డ్‌ని యాడ్ చేసుకునే ప్రక్రియ చాలా సులభం. మీరు చేయాల్సిందల్లా వాటిని స్క్రీన్‌షాట్ తీయండి, ఆపై మీరు గూగుల్ వాలెట్ యాప్‌కి యాడ్ చేసే ఆప్షన్ పై క్లిక్ చేయండి. ప్రతి వ్యక్తి ప్రైవేట్ సమాచారాన్ని ప్రొటెక్ట్ చేస్తామని కంపెనీ హామీ ఇస్తోంది. యూజర్లు డిజిటల్ ఆఫీసు, హోటల్ కీలను కూడా గూగుల్ వాలెట్‌లో స్టోర్ చేయవచ్చు. ఇందుకోసం గూగుల్ థర్డ్ పార్టీ సంస్థలతో పార్ట్‌నర్‌షిప్ కుదుర్చుకోనుంది. డెవలపర్‌లు ఏదైనా వస్తువును డిజిటల్ పాస్‌గా మార్చుకునే ఆప్షన్ ను కూడా పొందుతారు. గూగుల్ వాలెట్ యాప్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా గూగుల్ పే యాప్ సేవలు అందుబాటులోనే ఉంటాయని గూగుల్ స్పష్టం చేసింది.

Published by:Nikhil Kumar S
First published:

Tags: Apps, Google

ఉత్తమ కథలు