Home /News /technology /

GOOGLE LAUNCHED YOUTUBE TRANSCRIPTION FEATURE FOR VIDEOS HERE DETAILS NS GH

Youtube New Feature: యూట్యూబ్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. మరో క్రేజీ అప్ డేట్.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మోస్ట్ సక్సెస్‌ఫుల్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో యూట్యూబ్ ముందు వరుసలో ఉంటుంది. వీడియో స్ట్రీమింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను అప్‌డేట్ చేస్తూ కొత్తగా ట్రాన్స్‌క్రిప్షన్ ఫీచర్‌ను తీసుకురానుంది.

మోస్ట్ సక్సెస్‌ఫుల్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో యూట్యూబ్ ముందు వరుసలో ఉంటుంది. యూట్యూబ్ కోసం గూగుల్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ అందుబాటులోకి తెస్తూ మంచి యూజర్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందిస్తోంది. 2022 సంవత్సరం కోసం యూట్యూబ్ తన రోడ్ మ్యాప్‌ను డిజైన్ చేసుకుంది. దీన్ని బట్టి ఈ ఏడాది యూట్యూబ్‌లో ఎన్నో కొత్త ఫీచర్లు రానున్నట్టు తెలుస్తుంది. యూట్యూబ్ కొలాబొరేటివ్ లైవ్ స్ట్రీమింగ్ ఫీచర్ ద్వారా యూట్యూబ్ క్రియేటర్లు తమ ఆడియన్స్‌తో మరింత కనెక్టెడ్‌గా ఉండేలా ఓ కొత్త ఫీచర్‌ను డిజైన్ చేసింది. దీంతోపాటు వీడియో స్ట్రీమింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను అప్‌డేట్ చేస్తూ కొత్తగా ట్రాన్స్‌క్రిప్షన్ ఫీచర్‌ను తీసుకురానుంది.

ఈ కొత్త ఫీచర్‌ అందుబాటులోకి వస్తే.. యూట్యూబ్‌లో వీడియోలు చూసేటప్పుడు సులభంగా కంటెంట్‌ను అర్థం చేసుకునేందుకు వీలుగా వీడియో కింద ట్రాన్స్‌క్రిప్షన్ కనిపిస్తుంది. అంటే.. విడియోలో ప్లే అయ్యే కంటెంట్ టెక్స్ట్ రూపంలో డిస్‌ప్లే అవుతుందన్న మాట. లాంగ్ వీడియోస్ చూసేటప్పుడు ఈ ఫీచర్ ఎక్కువగా ఉపయోగపడుతుంది.
Android Bug: ఆండ్రాయిడ్ యూజర్లకు అలర్ట్​.. బయటపడ్డ భయంకరమైన బగ్.. ముప్పు ఇదే..

యూట్యూబ్ వీడియోల ట్రాన్స్‌క్రిప్షన్ చదవడం కోసం గతంలో యూజర్లు ఇతర వెబ్‌సైట్లను ఉపయోగించాల్సి వచ్చేది. ఇప్పుడు ఒక చిన్న బటన్‌తో ట్రాన్స్‌క్రిప్షన్‌ను ఈజీగా పొందొచ్చు. ఇకపై యూట్యూబ్ వీడియోస్ క్రింద 'షో ట్రాన్స్ క్రిప్ట్' అనే బటన్ కనిపిస్తుంది. ఆ బటన్ క్లిక్ చేయగానే యూట్యూబ్ వీడియోలో ప్లే అవుతున్న కంటెంట్ అంతా చదవడానికి వీలుగా టెక్స్ట్ రూపంలో కనిపిస్తుంది. డైలాగ్స్, స్పీచ్, ఇంటర్వ్యూ, పాటలు ఇలా కంటెంట్ ఏదైనా అందులోని విషయాన్ని సింపుల్‌గా అర్థం చేసుకోవచ్చు.

యూట్యూబ్‌లో మీరు క్రియేట్ చేసే వీడియోస్‌కు ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేయాలంటే వీడియో అప్‌లోడ్ చేసే ముందు 'షో ట్రాన్స్ క్రిప్ట్' ను సెలక్ట్ చేసుకోవాలి. ప్రస్తుతం యూట్యూబ్ వెబ్ వెర్షన్ కోసం ఈ ఫీచర్‌ను డెవలప్ చేస్తున్నారు. త్వరలోనే యూట్యూబ్ యాప్‌లో కూడా ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.

ఇకపోతే రీసెంట్‌గా యూట్యూబ్ టీవీ కోసం పిక్చర్‌ ఇన్‌ పిక్చర్‌(PiP) ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పింది. అలాగే లైవ్ స్ట్రీమింగ్ కోసం థంబ్‌నెయిల్‌పై రింగ్ కనిపించే విధంగా మరో ఫీచర్ అప్‌డేట్ చేసింది. వీటితో పాటు సరౌండ్‌ సౌండ్‌ లాంటి మరికొన్ని లేటెస్ట్ ఫీచర్స్ తీసుకొచ్చేందుకు కూడా యూట్యూబ్‌ పని చేస్తోంది. యూట్యూబ్ వెబ్, యూట్యూబ్ యాప్ తో పాటు యూట్యూబ్ టీవీ యూజర్ల కోసం మరిన్ని ఫీచర్లు తీసుకొచ్చేందుకు సెపరేట్‌గా పనిచేస్తున్నట్టు కంపెనీ ఇటీవల ప్రకటించింది. అలాగే యూట్యూబ్ షార్ట్స్, యూట్యూబ్ లైవ్ యూజర్ల కోసం కూడా సెపరేట్‌గా ఫీచర్లు అప్‌డేట్ చేసే పనిలో పడింది.
Published by:Nikhil Kumar S
First published:

Tags: Google, Youtube

తదుపరి వార్తలు