Android 12 Beta 2: ఆండ్రాయిడ్ 12 బీటా 2 వెర్షన్ లాంఛ్... సరికొత్త ఫీచర్లు ఇవే

Android 12 Beta 2: ఆండ్రాయిడ్ 12 బీటా 2 వెర్షన్ లాంఛ్... సరికొత్త ఫీచర్లు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

Android 12 Beta 2 | గూగుల్ ఆండ్రాయిడ్ 12 బీటా 2 వర్షన్ లాంఛ్ చేసింది. ఇందులో ఆకట్టుకునే ఫీచర్స్ ఏం ఉన్నాయో తెలుసుకోండి.

  • Share this:
టెక్ దిగ్గజం గూగుల్ ఎప్పటికప్పుడు ఆండ్రాయిడ్‌కు సంబంధించిన అప్డేట్స్‌ను విడుదల చేస్తుంది. ఇప్పటికే ఆండ్రాయిడ్12 మొదటి బీటా వెర్షన్ను ప్రవేశపెట్టిన గూగుల్.. ఇప్పుడు ఆండ్రాయిడ్ 12 బీటా రెండవ వెర్షన్ను లాంచ్ చేసింది. ఈ వెర్షన్లో అనేక కొత్త ఫీచర్లను జోడించింది. ఆండ్రాయిడ్ 12 బీటా 2 వెర్షన్లో ప్రైవసీ డాష్‌బోర్డ్, కొత్త ఇంటర్నెట్ ప్యానెల్, క్లిప్‌బోర్డ్ రీడ్ నోటిఫికేషన్ వంటి అద్భుతమైన ఫీచర్లను అందించింది. ఆండ్రాయిడ్ 12 మొదటి బీటా వెర్షన్ను గత నెలలో గూగుల్ ఐ/ ఓ కాన్ఫరెన్స్‌లో ప్రారంభించగా దీనికి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. కేవలం నెల రోజుల వ్యవధిలోనే గూగుల్ మరో వెర్షన్ను విడుదల చేయడం విశేషం. ఈ కొత్త వెర్షన్ను కేవలం గూగుల్ పిక్సెల్ ఫోన్లలోనే కాకుండా ఆండ్రాయిడ్ 12 సపోర్ట్ చేసే అన్ని మొబైల్స్లో డౌన్లోడ్ చేసుకొని ఫీచర్లను ఆస్వాదించవచ్చు.

Android 12 New Features: మీది ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోనా? ఈ 12 కొత్త ఫీచర్స్ వస్తున్నాయి

OnePlus Nord CE 5G vs OnePlus Nord: వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీ వచ్చేసింది... వన్‌ప్లస్ నార్డ్ కన్నా బెటరా? తెలుసుకోండి

మీరు కూడా ఈ ఫీచర్లను ప్రయత్నించాలనుకుంటే ముందుగా google.com/android/beta వెబ్సైట్లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. గూగుల్ ఏ కొత్త వెర్షన్ను విడుదల చేసినా మొదటగా తన గూగుల్ పిక్సెల్ ఫోన్లలో అందుబాటులోకి తెస్తుంది. ఈ మేరకు గూగుల్ సొంత ఫోన్స్ అయిన పిక్సెల్ 3, పిక్సెల్ 3 ఎక్స్, పిక్సెల్ 3 ఎక్స్ ఎల్, పిక్సెల్ 4, పిక్సెల్ 4 ఎ, పిక్సెల్ 4 ఎక్స్ఎల్, పిక్సెల్ 4ఏ 5జీ, పిక్సెల్ 5 స్మార్ట్ఫోన్లలోకి అందుబాటులోకి తెచ్చింది. అయితే, ఈ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ను ఆండ్రాయిడ్ 12 సపోర్ట్ చేసే ఇతర ఫోన్లలో కూడా డౌన్లోడ్ చేసుకొని దానిలోని ఫీచర్లను ఆస్వాదించవచ్చు. అయితే, ఎలాంటి స్మార్ట్‌ఫోన్లలో ఇది రోల్ అవుట్ అవుతుందనే విషయంపై గూగుల్ డెవలపర్స్ వెబ్‌సైట్‌లోని జాబితాలో తెలుసుకోవచ్చు.

Best 5G Smartphones: రూ.20,000 లోపు బెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్‌లు ఇవే

Jio Recharge via WhatsApp: వాట్సప్‌లో జియో సిమ్‌కు రీఛార్జ్ చేయండి ఇలా

నాన్ పిక్సెల్ మొబైల్స్‌లో సైతం అందుబాటులోకి...


ఈ సరికొత్త బీటా 2 వెర్షన్లో గూగుల్ కొత్త ప్రైవసీ డాష్‌బోర్డ్‌ను అందించారు. తద్వారా వినియోగదారులు తమ మైక్, కెమెరా, లొకేషన్ వంటి వివరాలను సులభంగా తెలుసుకునే అవకాశం కల్పిస్తుంది. అంతేకాక, రీసెంట్ యాప్స్‌ను కూడా సులభంగా తెలుసుకోవచ్చు. బీటాలోని ఇతర ఫీచర్ల విషయానికి వస్తే.. యాప్ యాక్సెస్ నిలిపేసినప్పుడు, బ్లాంక్ ఆడియో, కెమెరా ఫీడ్‌ వంటివి కనిపిస్తాయి. క్లిప్‌బోర్డ్ నుంచి యాప్ ఓపెన్ చేసినప్పుడు క్లిప్‌బోర్డ్ రీడ్ నోటిఫికేషన్‌ కూడా కనిపిస్తుంది. ఇక వీటితో పాటు ఇంటర్నెట్ ప్రొవైడర్లు, వై-ఫై నెట్‌వర్క్‌లు మొదలైన వాటి మధ్య మారడాన్ని ఈ కొత్త ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ సులభతరం చేస్తుంది. డెవలపర్లకు కూడా ఈ కొత్త వెర్షన్ అనుకూలంగా ఉంటుందని గూగుల్ చెబుతోంది. ఈ కొత్త వెర్షన్కు అనుగుణంగా డెవలపర్లు తమ యాప్స్, ఎస్‌డికెలు, లైబ్రరీల్లో మార్పులు చేర్పులు చేసుకోవచ్చు.
Published by:Santhosh Kumar S
First published: