హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Google: పిక్సెల్ 7 ఫోన్, గూగుల్ స్మార్ట్‌వాచ్ లాంచ్‌ కి ముహుర్తం ఫిక్స్.. కొత్త ప్రొడక్ట్స్ ఫీచర్లు, డిజైన్ వివరాలివే..

Google: పిక్సెల్ 7 ఫోన్, గూగుల్ స్మార్ట్‌వాచ్ లాంచ్‌ కి ముహుర్తం ఫిక్స్.. కొత్త ప్రొడక్ట్స్ ఫీచర్లు, డిజైన్ వివరాలివే..

Photo Credit : Google

Photo Credit : Google

Google: గూగుల్‌ ‘మేడ్‌ బై గూగుల్‌’ హార్డ్‌వేర్‌ ఈవెంట్‌ ద్వారా యాపిల్‌కు ధీటుగా కొన్ని ప్రొడక్టులను తీసుకువచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈవెంట్ గురించి వెల్లడిస్తూ గూగుల్‌ ఒక ట్వీట్ చేసింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

యాపిల్‌ (Apple) కంపెనీ బుధవారం ‘ఫార్‌ అవుట్‌’ (Farout) కార్యక్రమంలో కొత్త ప్రొడక్డులను లాంచ్‌ చేసింది. మార్కెట్‌ వర్గాల్లో యాపిల్‌ కొత్త డివైజ్‌లు, ఫీచర్ల(Features) గురించి చర్చ ముగియకముందే మరో టెక్ ఈవెంట్‌ గురించి వార్తలు వినిపిస్తున్నాయి. అదే గూగుల్‌(Google)కు చెందిన ‘మేడ్‌ బై గూగుల్‌’ హార్డ్‌వేర్‌ ఈవెంట్‌. దీని ద్వారా యాపిల్‌కు ధీటుగా గూగుల్‌ కొన్ని ప్రొడక్టులను తీసుకువచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈవెంట్ గురించి వెల్లడిస్తూ గూగుల్‌ ఒక ట్వీట్ చేసింది. ‘అన్ని కలిసి వస్తున్నాయి. అక్టోబర్ 6న MadeByGoogle లైవ్‌లో మాతో జాయిన్‌ అవ్వండి. అప్‌డేట్ల కోసం సైన్ అప్ చేయండి, మీ క్యాలెండర్‌కి యాడ్‌ చేయండి.’ అని పేర్కొంది.ఈ లాంచ్ ఈవెంట్ న్యూయార్క్‌లోని విలియమ్స్‌బర్గ్‌లో అక్టోబర్ 6న ఉదయం 10 గంటలకు ET (2 pm GMT)కి జరుగుతుంది. గూగుల్‌ మేలో జరిగిన I/O ఈవెంట్‌లో పిక్సెల్ 7 స్మార్ట్‌ఫోన్‌లు, పిక్సెల్ వాచ్‌లకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.
‘మేడ్‌ బై గూగుల్‌’ ఈవెంట్‌లో గూగుల్‌ పిక్సెల్ 7 స్మార్ట్‌ఫోన్‌తో పాటు మొదటి స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేయనుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో జరిగిన I/O డెవలపర్ కాన్ఫరెన్స్‌లో కంపెనీ అనౌన్స్ చేసిన కొత్త డివైజ్‌లను ఈవెంట్‌లో లాంచ్‌ చేయనుంది. తర్వాత ఇవి GoogleStore.comలో, న్యూయార్క్ నగరంలోని ఫిజికల్‌ స్టోర్‌లలో కొనుగోలుకు అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది.


* పిక్సెల్ వాచ్ స్పెసిఫికేషన్లు
గూగుల్ పిక్సెల్ వాచ్ సర్క్యులర్‌, డోమెడ్‌ డిజైన్‌తో వస్తుంది. టాక్టైల్‌ క్రౌన్‌, సైడ్‌ బటన్‌ ఉంటాయి. రీసైకిల్ చేసిన స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారు చేసిన ఈ వాచ్ Wear OS 3తో రన్ అవుతుంది. మెరుగైన నావిగేషన్, స్మార్ట్ నోటిఫికేషన్‌లతో “రిఫ్రెష్ చేసిన UI”ని అందిస్తుంది. ఈజీగా అటాచ్‌ చేసే కస్టమైజబుల్‌ బ్యాండ్‌లు దీని సొంతం.
ఇది కూడా చదవండి : బిగ్ బిలియన్ డేస్ డిస్కౌంట్ ధరల్ని ప్రకటించిన రియల్‌మీ
ఈ వాచ్‌తో కొత్త Wear OS by Googleను ఎక్స్‌పీరియన్స్‌ చేయవచ్చు. ఫిట్‌బిట్ అందించిన హెల్త్, ఫిట్‌నెస్ టూల్స్‌ను ఆస్వాదించవచ్చు. గూగుల్‌ Fitbit సంస్థను 2.1 బిలియన్ల డాలర్లకి కొనుగోలు చేసింది. ఫిట్‌బిట్ ఇంటిగ్రేషన్ వాచ్ ఫేస్‌లను కస్టమైజ్‌ చేయడానికి మించిన వాచ్‌ ఫేస్‌లను అందిస్తుంది.
* గూగుల్‌ పిక్సెల్ 7 సిరీస్
పిక్సెల్ 7 ఫోన్‌లు ఆండ్రాయిడ్ 13 ఓఎస్‌తో రన్ అవుతాయి. ఇవి టెన్సర్ అనే గూగుల్‌ కంపాటబుల్ మొబైల్ చిప్‌తో వస్తాయి. టెన్సర్‌ G2 చిప్‌ పిక్సెల్‌ 7, పిక్సెల్‌ 7 ప్రోలలో వస్తుంది. దీని ద్వారా ఫోటోలు, వీడియోలు, భద్రత, స్పీచ్‌ రికగ్నిషన్‌, హెల్ప్‌ఫుల్‌, పర్సలైజ్డ్‌ ఫీచర్లు అందుతాయి. గూగుల్‌ పిక్సెల్ 7 సిరీస్ ఫోన్లు సెకండ్‌ జనరేషన్‌ 'టెన్సర్ G2' చిప్‌తో వస్తాయని గూగుల్ ధ్రువీకరించింది.
టెన్సర్ చిప్‌ను శామ్‌సంగ్ భాగస్వామ్యంతో రూపొందించింది. గూగుల్‌ మెషిన్ లెర్నింగ్ ద్వారా Exynos-వంటి ప్రాసెసర్‌లను మెరుగుపరుస్తుంది. 9to5Google ప్రకారం, పిక్సెల్‌ 7 అప్‌డేట్ మ్యాగజైన్ పేజీలో.. ఇప్పుడు ‘Google Tensor G2’ చిప్‌సెట్‌కు సంబంధించిన వార్తలు వస్తున్నాయి. Tensor G2 చిప్ వచ్చే ఏడాది పిక్సెల్‌ 7aతో పాటు గూగల్‌ ఫోల్డబుల్ డివైజ్‌లలో కూడా వచ్చే అవకాశం ఉందని తెలిపింది.

Published by:Sridhar Reddy
First published:

Tags: Google, Smart watch, Smartphones, Tech news

ఉత్తమ కథలు