భారతీయులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అత్యంత చవకైన ‘జియో ఫోన్ నెక్ట్స్ (Jio Phone Next)’ విడుదలకు సిద్ధమవుతోంది. నవంబర్ 4 దీపావళి పర్వదినాన ఈ ఫోన్ అమ్మకానికి రానుంది. ఇది అన్ని రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంటుందని జియో (Jio), గూగుల్ (Google)సంయుక్తంగా ప్రకటించాయి. ఇది కేవలం రూ. 6,499 ధరకు లభిస్తుంది. అయితే కస్టమర్లు కేవలం రూ. 1,999 చెల్లించి దీన్ని సొంతం చేసుకోవచ్చు. మిగిలిన మొత్తాన్ని 18 నెలలు లేదంటే 24 నెలల కాల వ్యవధిలో చెల్లించవచ్చు. ప్రతి భారతీయుడికి డిజిటల్ టెక్నాలజీని చేరువ చేయాలనే ఏకైక లక్ష్యంతో రిలయన్స్ జియో దీన్ని ఆవిష్కరించింది. కొన్ని సులభమైన స్టెప్స్‌తో జియో ఫోన్ నెక్ట్స్‌ను ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌ను ఎలా కొనుగోలు చేయాలో చూద్దాం.
జియో ఫోన్ నెక్ట్స్‌ను ఇలా కొనుగోలు చేయండి..
జియో ఫోన్ నెక్ట్స్ కోసం మీ పేరును ముందుగా నమోదు చేసుకోవాలి. ఇందుకోసం మీ సమీపంలోని జియో మార్ట్ (Jio Mart)డిజిటల్ రిటైలర్ను సందర్శించండి. లేదా www.jio.com/next వెబ్సైట్లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఆ తర్వాత 70182-70182 వాట్సాప్ నంబర్‌కు ‘హాయ్’ అని మెసేజ్ పంపించండి. దీంతో వెంటనే మీ జియో ఫోన్ రిక్వెస్ట్ కన్ఫర్మ్ అవుతుంది. మీ మొబైల్‌కు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. ఆ తర్వాత మీ సమీపంలోని జియో మార్ట్ డిజిటల్ స్టోర్‌ను సంప్రదించి ఈ మెసేజ్‌ను చూపించండి. అంతే, అందుబాటులో ఉన్న ఈఎంఐ ఆప్షన్లలో లేదా మొత్తం ఒకేసారి చెల్లించి జియో ఫోన్ నెక్ట్స్‌ను దక్కించుకోవచ్చు.
నవంబర్ 9న లావా అగ్ని 5జీ స్మార్ట్‌ఫోన్ లాంచ్.. బడ్జెట్ ధరలోనే అదిరిపోయే ఫీచర్లు!
ఇది దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జియో మార్ట్ డిజిటల్ రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది. రిలయన్స్ తన జియో నెక్ట్స్ ఫోన్ కోసం టెక్ దిగ్గజం గూగుల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ రెండు సంస్థలు కలిసి జియో ఫోన్‌ను డిజైన్ చేశాయి. దీని లాంచింగ్‌పై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మాట్లాడుతూ “భారతదేశంలో, కరోనా మహమ్మారి తర్వాత మొబైల్ వినియోగం బాగా పెరిగింది. అయితే, అనేక గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఇంకా ఇంటర్నెట్కు దూరంగా ఉన్నారు. వారందరినీ డిజిటల్ విప్లవంలో భాగస్వామ్యం చేసేందుకు రిలయన్స్‌తో జత కట్టాం. అతి చవకైన ధరలోనే సరికొత్త ఫోన్‌ను లాంచ్ చేస్తున్నాం." అని అన్నారు.
ఇలా చేస్తే మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది.. ఈ టిప్స్ పాటించండి
జియో ఫోన్ నెక్ట్స్‌పై ఎన్నో అంచనాలున్నాయి. ధర కూడా తక్కువగా ఉండడంతో పాటు అద్భుతమైన ఫీచర్లు ఉండడంతో భారీగా డిమాండ్ ఉంటుందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొబైల్ ఫోన్ రంగంలో సంచలనంగా మారుతుందని చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jio phone, JioPhone Next, Latest Technology, Smart phone, Technology