హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Google AI Chips: గూగుల్ కొత్త టెక్నాలజీ.. మనిషి కన్నా వేగంగా ఆలోచించగలిగే చిప్స్ ఆవిష్కరణ

Google AI Chips: గూగుల్ కొత్త టెక్నాలజీ.. మనిషి కన్నా వేగంగా ఆలోచించగలిగే చిప్స్ ఆవిష్కరణ

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

టెక్ దిగ్గజం గూగుల్ కొత్త టెక్నాలజీని రూపొందిస్తోంది. మనిషి నెల రోజుల్లో చేసే పనిని.. కేవలం గంటల్లో పూర్తి చేసేలా గూగుల్‌ కొత్త టెక్నాలజీ పని చేయనుంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత చిప్స్‌ను గూగుల్‌ తయారు చేస్తోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంకా చదవండి ...

మనిషి నెల రోజుల్లో చేసే పనిని.. కేవలం గంటల్లో పూర్తి చేసేలా గూగుల్‌ కొత్త టెక్నాలజీని కనిపెడుతోంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత చిప్స్‌ను గూగుల్‌ రూపొందిస్తోంది. మెషీన్‌ లెర్నింగ్‌ ఆధారంగా వీటిని తయారు చేస్తున్నారు. ఇంతకీ ఏంటా సాంకేతికత? మనిషి కంటే ఆ ఏఐ చిప్స్‌ ఎంత వేగంగా పని చేస్తాయో చూద్దాం మెషీన్‌ లెర్నింగ్‌ ఆధారంగా గూగుల్‌ గత కొన్నేళ్లుగా చిప్స్‌ తయారు చేస్తూనే ఉంది. ఇటీవల తొలిసారిగా కమర్షియల్‌ ఉత్పత్తి కోసం పరిశోధన ప్రారంభించింది. కంప్యూటేషన్‌ ఆప్టిమైజేషన్‌ కోసం గూగుల్‌కు వినియోగించే టెన్సార్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ (టీపీయూ)కు ఈ కొత్త సాంకేతికతను తీసుకొస్తున్నారు. ఇది ఏఐ డెవలప్‌మెంట్‌ కోసం బాగా ఉపకరిస్తుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. చిప్స్‌ మీద ట్రాన్సిస్టర్ల సంఖ్యను పెంచుకుంటూ వెళ్లకుండా వాటి పనితనం పెంచేలా ఈ ప్రయోగాలు చేస్తోంది గూగుల్‌ టీమ్‌. గూగుల్‌ అల్గారిథమ్స్‌ ఎక్కువగా ఫ్లోర్‌ ప్లానింగ్‌ను టాకిల్‌ చేస్తూ ఉంటాయి. చిప్‌ సబ్‌ సిస్టమ్స్‌ కోసం సిలికాన్‌ డైలోని లే అవుట్‌ వెతకడానికి హ్యూమన్‌ డిజైనర్లు సిస్టమ్స్‌ వాడుతుంటారు. దీని కోసం సీపీయూ, జీపీయూ, మెమొరీ కోర్స్‌ ఉంటాయి.

Amazon special sale: విద్యార్థుల కోసం అమెజాన్ స్పెషల్ సేల్.. రూ.10 వేలలోపు లభించే ఈ గాడ్జెట్లపై ఓ లుక్కేయండి

వీటిని కిలోమీటర్ల పొడవున్న మైనుస్క్యూల్‌ వైరింగ్‌ ఉంటుంది. ఈ క్రమంలో ఏ కాంపోనెంట్‌ను ఎక్కడ ప్లేస్‌ చేయాలని డిజైనర్లు చూసుకుంటారు. ఆ ప్లేస్‌మెంట్‌ వల్లే చిప్‌ వేగం పెరుగుతుంది. ఈ ఫ్లోర్‌ డిజైనింగ్‌ను మనుషులు చేయడానికి ఎక్కువ సమయం పడుతోందని గూగుల్‌ టీమ్‌ గుర్తించింది. అయితే మెషీన్‌ లెర్నింగ్‌ ద్వారా ఈ పనిలో వేగం పెంచొచ్చని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే మనుషుల్ని మించి పనితనం చూపిస్తుందంటూ ఏఐ గురించి చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయని శాస్త్రవేత్తలు చెబుతూనే ఉన్నారు. చెస్‌ లాంటి ఆటల్లో ఏఐ పనితనం మనిషిని మించింది అని తెలిసిందే.

ఈ లెక్కన ఫ్లోర్‌ ప్లానింగ్‌ను కూడా ఏఐ చక్కగా చేసిపెడుతుందని, అందులోనూ వేగంగా చేసిపెడుతుందని గూగుల్‌ టీమ్ భావిస్తోంది. ఇందులో భాగంగా లెర్నింగ్‌ అల్గారిథమ్‌కు పదివేల చిప్స్‌ ఉన్న ఫ్లోర్‌ ట్రైనింగ్‌ ఇచ్చారట. ఈ క్రమంలో గుడ్‌, బ్యాడ్‌ ఫ్లోర్‌ ప్లాన్స్‌ను అల్గారిథమ్‌ నిర్ణయించుకునేలా శిక్షణ ఇచ్చారు. ఏఐ సిస్టమ్స్‌ మనుషుల్లా ఆలోచించవు అని బోర్డు గేమ్స్‌ ఆడే క్రమంలోనే తెలిసిపోయింది.

ఒక్కోసారి తెలిసిన, సులభమైన ఎత్తును కూడా తమకు సాధ్యమైన సరికొత్త ఆలోచనతో ఏఐ ముందుకొచ్చేది. అలాగే ఫ్లోర్‌ ప్లాన్స్‌ విషయంలోనూ గూగుల్‌ ఏఐ ప్రవర్తిస్తుందట. మనుషులు చేసే ఫ్లోర్‌ డిజైన్లు, ఏఐతో సిద్ధం చేసిన ఫ్లోర్‌ డిజైన్‌లో చాలా తేడాలు కనిపించాయట. దీని వల్ల కచ్చితంగా వేగంలో మార్పు ఉంటుందని గూగుల్‌ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముందుగా చెప్పుకున్నట్లు మనిషి నెలల్లో చేసే పనిని, ఏఐ చిప్‌ ఆరు గంటల్లో పూర్తి చేస్తుందట.

First published:

Tags: Google, Google news, Latest Technology

ఉత్తమ కథలు