Google: ఇక పాస్‌వర్డ్ అవసరం లేదు... లాగిన్ కోసం ఫింగర్ ప్రింట్ చాలు

Google Fingerprint Authentication | బ్యాంకింగ్ యాప్స్ ఆథెంటికేషన్, వెరిఫికేషన్ కోసం ఫింగర్‌ప్రింట్ ఉపయోగిస్తున్నాయి. ఇప్పుడు గూగుల్ కూడా అదే టెక్నాలజీని ఉపయోగించుకుంటోంది.

news18-telugu
Updated: August 16, 2019, 10:46 AM IST
Google: ఇక పాస్‌వర్డ్ అవసరం లేదు... లాగిన్ కోసం ఫింగర్ ప్రింట్ చాలు
Google: ఇక పాస్‌వర్డ్ అవసరం లేదు... లాగిన్ కోసం ఫింగర్ ప్రింట్ చాలు (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: August 16, 2019, 10:46 AM IST
పాస్‌వర్డ్ సెట్ చేసుకోవడం ఎంత కష్టమో... గుర్తుంచుకోవడం కూడా అంత కష్టం. రకరకాల యాప్స్ వాడుతుండటం, ఒక్కో యాప్‌లో ఒక్కో పాస్‌వర్డ్ సెట్ చేసుకోవడంతో గుర్తుంచుకోవడం కష్టమవుతుంది యూజర్లకు. అందుకే గూగుల్ ఈ సమస్యకు పరిష్కారం కనుగొంది. ఇకపై గూగుల్ వెబ్‌సైట్స్‌లో లాగిన్ చేయడానికి పాస్‌వర్డ్‌ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. మీ ఫింగర్ ప్రింట్ చాలు. పాస్‌వర్డ్ కన్నా ఫింగర్‌ప్రింట్ బేస్డ్ వెరిఫికేషన్ బెటర్ అని గూగుల్ భావిస్తోంది. అందుకే గూగుల్ ప్లాట్‌ఫామ్స్‌లో లాగిన్ కావడానికి పాస్‌వర్డ్ కన్నా ఫింగర్‌ప్రింట్ మేలని అనుకుంటోంది. గూగుల్ ప్లే సర్వీసెస్ అప్‌డేట్ ద్వారా ఆండ్రాయిడ్ 7 కన్నా ఎక్కువ ఉన్న ఫోన్లకు త్వరలో ఈ సర్వీస్ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే పిక్సెల్ డివైజ్‌లకు అందుబాటులోకి వచ్చింది.

ఇప్పటికే ఫింగర్‌ప్రింట్ ఆథెంటికేషన్‌ను చాలా వెబ్‌సైట్స్, యాప్స్ ఉపయోగిస్తున్నాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ యాప్స్ ఆథెంటికేషన్, వెరిఫికేషన్ కోసం ఫింగర్‌ప్రింట్ ఉపయోగిస్తున్నాయి. ఇప్పుడు గూగుల్ కూడా అదే టెక్నాలజీని ఉపయోగించుకుంటోంది. ఇది గూగుల్ సర్వీసులకు మాత్రమే. అంటే జీమెయిల్, గూగుల్ ఫోటోస్, గూగుల్ మ్యాప్స్ లాంటి గూగుల్ ప్లాట్‌ఫామ్స్‌లో లాగిన్ కావాలంటే ఫింగర్ ప్రింట్ ఉపయోగించుకోవచ్చు. గూగుల్ యాప్స్‌తో పాటు వెబ్‌సైట్స్‌లోనూ ఫింగర్ ప్రింట్ ఆథెంటికేషన్ పనిచేస్తుంది. ఫింగర్‌ప్రింట్ ఆథెంటికేషన్ ఉంటే యూజర్ పాస్‌వర్డ్ మర్చిపోయినప్పుడు వేలిముద్ర ద్వారా లాగిన్ కావడం సులువు అవుతోంది.

HTC Wildfire X: 'హెచ్‌టీసీ వైల్డ్‌ఫైర్ ఎక్స్' రిలీజ్... ఎలా ఉందో చూడండి




ఇవి కూడా చదవండి:

Tata Sky: టాటా స్కై ఫ్లెక్సీ ప్లాన్‌తో క్యాష్‌బ్యాక్ ఆఫర్

IT Jobs: ఇండియాలో ఎక్కువ జీతం వచ్చే 5 సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలివే
Loading...
Free ATM Transactions: ఫ్రీ ఏటీఎం ట్రాన్సాక్షన్స్‌పై క్లారిటీ ఇచ్చిన ఆర్‌బీఐ
First published: August 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...