హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Google Play Store: ప్లే స్టోర్ నుంచి యాప్ పర్మిషన్స్ లిస్ట్‌ తొలగిస్తోన్న గూగుల్.. యూజర్లపై పడే ప్రభావం ఇదే..!

Google Play Store: ప్లే స్టోర్ నుంచి యాప్ పర్మిషన్స్ లిస్ట్‌ తొలగిస్తోన్న గూగుల్.. యూజర్లపై పడే ప్రభావం ఇదే..!

ప్లే స్టోర్ యాప్

ప్లే స్టోర్ యాప్

గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్ పర్మిషన్స్ (App Permissions) లిస్ట్‌ను తొలగిస్తోంది. ఇప్పటికే ప్లే స్టోర్ యాప్‌లో చాలామంది యూజర్లకు యాప్ పర్మిషన్స్ లిస్ట్‌ కనిపించడం లేదు. దాని స్థానంలో డేటా సేఫ్టీ (Data Safety) అనే కొత్త సెక్షన్ కనిపిస్తోంది.

ఇంకా చదవండి ...

గూగుల్ ప్లే స్టోర్ (Google Play Store)లో ఏదైనా యాప్ డౌన్‌లోడ్ చేసుకునే ముందు యూజర్లు ఆ యాప్ ఏ పర్మిషన్లను అడుగుతుందో చెక్ చేస్తారు. గూగుల్ ప్లే స్టోర్ ప్రతి యాప్‌కి సంబంధించిన డిటైల్డ్ పర్మిషన్స్‌ను ఒక జాబితాగా చూపిస్తుంది. అయితే ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్ పర్మిషన్స్ (App Permissions) లిస్ట్‌ను తొలగిస్తోంది. ఇప్పటికే ప్లే స్టోర్ యాప్‌లో చాలామంది యూజర్లకు యాప్ పర్మిషన్స్ లిస్ట్‌ కనిపించడం లేదు. దాని స్థానంలో డేటా సేఫ్టీ (Data Safety) అనే కొత్త సెక్షన్ కనిపిస్తోంది. ఈ సెక్షన్ ఓపెన్ చేస్తే డేటా షేర్డ్ (Data Shared), డేటా కలెక్టెడ్ (Data Collected) వంటి కొత్త సబ్-సెక్షన్స్ కనిపిస్తున్నాయి. వీటిలో ఒక యాప్ అనేది యూజర్ల నుంచి ఎలాంటి డేటా కలెక్ట్ చేస్తుంది, ఏ డేటా షేర్ చేస్తుందనే విషయాలు డిస్‌ప్లే అవుతున్నాయి. యాప్ పర్మిషన్స్ కంటే డేటా సేఫ్టీ సెక్షన్ ద్వారానే యూజర్లు ఒక యాప్ గురించి ఎక్కువగా తెలుసుకోగలుగుతారని గూగుల్ తెలుపుతోంది. అయితే యాప్ పర్మిషన్స్ లిస్ట్‌ను తొలగించడం వల్ల యూజర్ల పడే ప్రభావం ఏంటి? అనేది తెలుసుకుందాం.

ప్రతి యాప్‌కి అవసరమైన అన్ని పర్మిషన్స్ గురించి వివరించే 'పర్మిషన్స్' లిస్ట్‌ గూగుల్ శాశ్వతంగా తీసేయబోతుందన్న నిజం కొందరి యూజర్లలో ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే ఈ ముఖ్యమైన లిస్ట్‌ అనేది వారి డివైజ్‌లో ఇన్‌స్టాల్ చేయకుండానే నిర్దిష్ట యాప్‌కి అవసరమైన అన్ని పర్మిషన్స్‌ను చెక్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ప్రైవసీ అవగాహన ఉన్న యూజర్లకు ఇది ఉపయోగపడుతుంది. ఒక టెక్ సంస్థ లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం, గూగుల్ ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టిన “డేటా సేఫ్టీ” సెక్షన్‌ను హైలైట్ చేయడానికి ప్లే స్టోర్‌లో యాప్ పర్మిషన్స్‌ లిస్ట్‌ను తొలగిస్తోంది.

ఇదీ చదవండి: మోదీ వ్యక్తి కాదు.. ఓ శక్తి ! ప్రజల మనస్సులు మార్చే శాస్త్రం ఆయన సొంతం: సీనియర్‌ జర్నలిస్ట్‌ అజయ్‌ సింగ్‌


ప్రస్తుతం ప్లే స్టోర్‌లో పేటీఎం, గూగుల్ పే వంటి చాలా యాప్స్ కింద యాప్ పర్మిషన్స్‌కి బదులు డేటా సేఫ్టీ అనే సెక్షన్ కనిపిస్తోంది. మిగతా కొన్ని యాప్స్‌కి డేటా సేఫ్టీ సెక్షన్‌లో 'నో ఇన్ఫర్మేషన్ అవైలబుల్' అని కనిపిస్తోంది. దీంతో అటు యాప్ పర్మిషన్స్ కనిపించక ఇటు డేటా సేఫ్టీ ఇన్ఫర్మేషన్ తెలియక యూజర్లు ఇబ్బంది పడుతున్నారు. కాగా త్వరలోనే అన్ని యాప్స్‌కి డేటా సెక్షన్‌లో ఇన్ఫర్మేషన్ అందించే అవకాశం ఉంది. గూగుల్ ఈ కొత్త సెక్షన్‌కు సంబంధించి స్క్రీన్‌షాట్‌లు కూడా షేర్ చేసింది. ఈ స్క్రీన్‌షాట్‌లో యాప్‌ను ఇన్‌స్టాల్ చేసే ముందు వినియోగదారులు పర్మిషన్స్ చెక్ చేయడానికి యాప్ పర్మిషన్స్‌ జాబితా కనిపించదు.

గూగుల్ నిర్ణయానికి కారణం

యాప్ పర్మిషన్స్ కంటే డేటా సేఫ్టీ సెక్షన్ యూజర్లకు బాగా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో గూగుల్ దీన్ని తీసుకొచ్చింది. ఒక యాప్ అనేది యూజర్లకు సంబంధించి ఏ డేటా కలెక్ట్ చేస్తుంది? ఆ డేటాను ఏ ఉపయోగం కోసం కలెక్ట్ చేస్తుంది? థర్డ్ పార్టీ యాప్స్‌తో యూజర్ల డేటా షేర్ చేస్తుందా? యాప్ ఉపయోగిస్తున్నప్పుడు యూజర్లకు ఎంత సెక్యూరిటీ ఉంటుంది? అనే అన్ని విషయాలను డేటా సేఫ్టీ సెక్షన్ యూజర్‌కి అందిస్తుంది. ఈ సమాచారమంతా తెలుసుకున్న తర్వాత యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవాలా వద్దా అనేది యూజర్లు ఈజీగా నిర్ణయించుకోవచ్చు.

https://youtu.be/62T6agNWpRI

డేటా సేఫ్టీ సెక్షన్‌కి ప్రత్యామ్నాయం

డేటా సేఫ్టీ సెక్షన్‌ వద్దు యాప్ పర్మిషన్స్‌ కావాలనుకునే యూజర్లు అరోరా స్టోర్ (Aurora Store), FOSS Google Play క్లయింట్‌ని యూజ్ చేసి యాప్ పర్మిషన్స్‌ తెలుసుకోవచ్చు.

First published:

Tags: Apps, Google, Playstore, Users

ఉత్తమ కథలు