హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Google: అలర్ట్.. గూగుల్ తీసుకొచ్చిన ఆ సర్వీస్ మరికొద్ది రోజుల్లో ఉండదు.. మీరు చేయాల్సింది ఇదే!

Google: అలర్ట్.. గూగుల్ తీసుకొచ్చిన ఆ సర్వీస్ మరికొద్ది రోజుల్లో ఉండదు.. మీరు చేయాల్సింది ఇదే!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Google: 2017 నుంచే ఈ అప్లికేషన్‌లో కొత్త ఫీచర్లను అందించడం గూగుల్ మానేసింది. టెక్స్ట్, వాయిస్ లేదా వీడియో చాట్ వంటి బేసిక్ ఫీచర్లు తప్ప ఇందులో మిగతా ఫీచర్లు లేవీ యూజర్లకు అందుబాటులో లేవు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

టెక్ దిగ్గజం గూగుల్ (Google) కొన్నేళ్ల క్రితం తీసుకొచ్చిన ఇన్‌స్టంట్ మెసేజింగ్ సర్వీస్ హ్యాంగవుట్స్‌ (Hangouts) మరికొద్ది వారాలలో యూజర్లకు అందుబాటులో ఉండదు. ఈ మెసేజింగ్ సర్వీస్‌ను ఇతర వర్క్‌స్పేస్ ప్రొడక్ట్స్‌తో కాంబైన్‌ చేయడానికి, అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లను హ్యాంగవుట్స్‌ యూజర్లకు అందించడానికే దీనిని షట్ డౌన్ చేస్తున్నట్లు గూగుల్ 2020లోనే ప్రకటించింది. ప్రస్తుతానికి గూగుల్ హ్యాంగవుట్స్‌ వెబ్ పోర్టల్‌లో మాత్రమే పని చేస్తోంది. ఈ యూజర్లను కూడా గూగుల్ చాట్ (Google Chat)కి మారాలని కంపెనీ విజ్ఞప్తి చేస్తోంది. అలానే మరో నాలుగు నెలల్లో హ్యాంగవుట్స్‌ డేటా (Data)ను గూగుల్ పూర్తిగా తొలగించనుంది. ఈ నేపథ్యంలో యూజర్లు హ్యాంగవుట్స్‌లో ఉన్న తమ ఇంపార్టెంట్ ఓల్డ్ చాట్స్‌ డౌన్‌లోడ్ చేసుకోవాలి. లేదంటే ఆ డేటా ఎప్పటికీ పొందడం సాధ్యం కాదు.

షట్‌డౌన్‌కు రెండు నెలల ముందు (నవంబర్ 2, 2022) నుంచే హ్యాంగవుట్స్‌ ఓల్డ్ చాట్స్ ఎక్స్‌పోర్ట్ లేదా డౌన్‌లోడ్ చేసుకోవాలని యూజర్లకు ఈ-మెయిల్ ద్వారా గూగుల్ తెలియజేస్తోంది. ఆటోమేటిక్‌గా ఈ చాట్స్ గూగుల్ చాట్ యాప్‌కి ట్రాన్స్‌ఫర్ కాకపోతే వాటిని గూగుల్ టేక్ ఔట్ ద్వారా ఎక్స్‌పోర్ట్ చేయాల్సిందిగా గూగుల్ సూచిస్తోంది.

నవంబర్ ఒకటిన అన్ని ప్లాట్‌ఫామ్‌ల్లోని హ్యాంగవుట్స్‌ యూజర్లు స్టాండ్ అలోన్ యాప్ Google Chat/ చాట్ ఆన్ వెబ్‌కి అప్‌గ్రేడ్ అవుతారు. ఆ తర్వాత అంటే జనవరి 1, 2023 నాటికి యూజర్ల చాట్ డేటాను గూగుల్ శాశ్వతంగా డిలీట్ చేస్తుంది. మళ్లీ వాటిని యాక్సెస్‌ చేయడం కుదరదు. అందుకే ఇప్పటి నుంచే యూజర్లు తమ చాట్ డౌన్‌లోడ్ చేసుకోవడం మంచిది.

చాట్స్‌ను ఎలా డౌన్‌లోడ్ చేయాలి?

హ్యాంగవుట్స్‌ డేటాను గూగుల్ చాట్ యాప్‌కి మైగ్రేట్ చేయడానికి లేదా ఆ డేటాను డౌన్‌లోడ్ చేయడానికి యూజర్లు గూగుల్ టేక్ అవుట్(Google Takeout)ను ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ ఉపయోగించి చాట్స్ కాపీని 2023 జనవరి 1లోగా డౌన్‌లోడ్ చేసుకోవాలి. అయితే ఆసక్తి గల వెబ్ యూజర్లు మరో రెండు నెలల వరకు హ్యాంగవుట్స్‌ ఉపయోగించవచ్చు. అలాగే తమ ఓల్డ్ చాట్స్‌ యాక్సెస్ చేయవచ్చు.

ఇది కూడా చదవండి : ఒప్పో ఫ్యాన్స్‌‌కి ముఖ్య గమనిక.. ఇకపై ఫోన్లతో పాటు ఛార్జర్లు రావు.. ఎప్పటి నుంచంటే..

గూగుల్‌ చాట్‌కి ఎందుకు మారాలి ?

2017 నుంచే ఈ అప్లికేషన్‌లో కొత్త ఫీచర్లను అందించడం గూగుల్ మానేసింది. టెక్స్ట్, వాయిస్ లేదా వీడియో చాట్ వంటి బేసిక్ ఫీచర్లు తప్ప ఇందులో మిగతా ఫీచర్లు లేవీ యూజర్లకు అందుబాటులో లేవు. Google Workspace ప్రొడక్ట్ లో కూడా ఇది లేదు. దాంతో గిఫ్ పికర్ (Gif picker), స్పేసెస్ వంటి లేటెస్ట్ ఫీచర్లు ఉన్న తమ యాప్ గూగుల్ చాట్ కి మారాలని ఆ కంపెనీ కోరుతోంది. ఈ యాప్ గూగుల్ వర్క్‌ప్లేస్ (Google Workspace)లో కూడా ఉంది. దాంతో యూజర్లకు గూగుల్‌ చాట్‌కి మారడం వల్ల నష్టమేమీ ఉండదు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Google, Google Chat, Tech news, Technology

ఉత్తమ కథలు