Home /News /technology /

Google Drive: గూగుల్ డ్రైవ్‌లో కొత్త ఫీచర్.. ఫైల్స్‌ను త్వరగా గుర్తించనున్న సెర్చ్ చిప్స్ ఆప్షన్

Google Drive: గూగుల్ డ్రైవ్‌లో కొత్త ఫీచర్.. ఫైల్స్‌ను త్వరగా గుర్తించనున్న సెర్చ్ చిప్స్ ఆప్షన్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

గూగుల్ డ్రైవ్‌లో ఓ సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు సంస్థ సన్నాహాలు చేస్తోంది. సెర్చ్ చిప్స్‌ (Search Chips) పేరుతో ఈ ఫీచర్‌ను పరిచయం చేయనున్నట్లు గూగుల్ తాజాగా ప్రకటించింది.

ఫైల్ షేరింగ్, క్లౌడ్ సేవల కోసం గూగుల్ డ్రైవ్ (Google Drive) యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది గూగుల్. ఈ యాప్‌లో 15 జీబీ వరకు ఉచితంగా డేటాను స్టోర్ చేసుకోవచ్చు. అయితే ఇందులో స్టోర్ అయిన ఫైల్స్‌ను సులభంగా, వేగంగా సెర్చ్ (search)  చేసేందుకు వీలుగా ఎలాంటి ఫీచర్స్ అందుబాటులో లేవు. దీంతో యూజర్లు తమకు కావాల్సిన ఫైల్స్ కనిపెట్టడానికి ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సమస్యకు చెక్ పెట్టాలని గూగుల్ నిర్ణయించింది. గూగుల్ డ్రైవ్‌లో ఓ సరికొత్త ఫీచర్‌ (new feature)ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. సెర్చ్ చిప్స్‌ (Search Chips) పేరుతో ఈ ఫీచర్‌ను పరిచయం చేయనున్నట్లు గూగుల్ తాజాగా ప్రకటించింది.

ఈ ఫీచర్‌ సాయంతో యూజర్లు తమ సెర్చ్ ను మాడి (modify)ఫై చేసుకోవచ్చు. డ్రైవ్ ప్లాట్‌ఫామ్‌లో ఫైల్స్‌ను వేగంగా కూడా గుర్తించొచ్చు. ఈ ఫీచర్ 2021, సెప్టెంబర్‌లో జీమెయిల్‌ (Gmail)లో అందుబాటులోకి వచ్చిన సెర్చ్ ఫిల్టర్‌ లాగానే పనిచేస్తుంది. ఈ ఫీచర్‌తో ఫైల్స్ కోసం సెర్చ్ చేసేటప్పుడు యూజర్లు సజెస్టెడ్ ఫిల్టర్ల లిస్ట్ నుంచి ఫైల్స్ సెలక్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం, సెర్చ్ చిప్స్‌ ఫీచర్ (search chips feature) గూగుల్ డ్రైవ్ బీటా వెర్షన్‌లో అందుబాటులో ఉంది. మిగతా యూజర్లందరికీ త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

మెరుగైన సెర్చ్ ఫీచర్‌..

గూగుల్ డ్రైవ్‌ (google drive)లో మెరుగైన సెర్చ్ ఫీచర్‌ను యాడ్ చేసినట్లు గూగుల్ బ్లాగ్ పోస్ట్ ద్వారా ప్రకటించింది. తాజా అప్‌డేట్‌తో యూజర్లు క్వేరీ (query) నమోదు చేసినప్పుడు.. టాప్ బటన్‌ల వరుసలో రిజల్ట్స్ కనిపిస్తాయని గూగుల్ తెలిపింది. ఈ ఇంటరాక్టివ్ ఫిల్టర్‌లను ఐటెమ్‌లను క్యూరేట్/ఆర్గనైజ్ చేయడానికి.. మీరు వెతుకుతున్న నిర్దిష్ట ఫైల్‌ (wanted file)ను కనుగొనడానికి ఉపయోగించవచ్చు. త్వరగా సెర్చ్ చేసేందుకు వీలుగా గూగుల్ డ్రైవ్ యూజర్ల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా సెర్చ్ టర్మ్స్ లను సూచిస్తుంది.

అత్యంత త్వరగా ఫైల్స్ షేర్..

ఫైల్ టైప్ (file type), పీపుల్, లోకేషన్, లాస్ట్ మాడిఫైడ్ డేట్, టాస్క్‌స్, ఫైల్ టైటిల్స్ వంటి మరిన్ని ఫిల్టర్‌ల ద్వారా యూజర్లు అత్యంత త్వరగా ఫైల్స్ షేర్ (files share) చేయొచ్చు. ఈ అన్ని ఫిల్టర్‌లను ఒకేసారి కలిపి వాడొచ్చు. తద్వారా క్షణాల వ్యవధిలోనే యూజర్లు తమకు కావాల్సిన ఫైల్ కనుగొనవచ్చు.

సెర్చ్ చిప్స్ ఫీచర్ బీటా వెర్షన్‌ (beta version)లో ఉంది. ఈ ఫీచర్ యూజ్ చేయాలనే ఆసక్తిగల యూజర్లు గూగుల్ ఫారమ్‌లో బీటా ప్రోగ్రామ్‌లో సైన్ అప్ చేయవచ్చు. ఇది గూగుల్ వర్క్ స్పేస్, జీ సూట్ బేసిక్, బిజినెస్ కస్టమర్‌లందరికీ అందుబాటులో ఉంటుంది. సెప్టెంబరులో కావాల్సిన ఈ-మెయిల్‌లను మరింత సులభంగా కనుగొనడంలో యూజర్లకు సహాయం చేయడానికి ఆండ్రాయిడ్ డివైజ్(Android device) ల కోసం జీమెయిల్ సెర్చ్ ఫిల్టర్‌ల ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురావడం ప్రారంభించింది.

ఈ ఫీచర్ యూజర్లు తమ మొబైల్ లలో ఈ-మెయిల్ సెర్చ్ ఫలితాలను త్వరగా, సులభంగా ఫిల్టర్ చేయడానికి అనుమతిస్తుంది. సెర్చ్ ఫిల్టర్ ఒక పేరు లేదా నిర్దిష్ట కాలపరిమితి కావచ్చు. సెండర్స్ (senders) ఈ-మెయిల్‌ల కోసం సెర్చ్ చేసేటప్పుడు, యూజర్లు సజెస్టెడ్ సెండర్స్ లిస్ట్ (suggested senders list) నుంచి ఈ-మెయిల్స్ ఎంచుకోవచ్చు. లేదా మల్టీపుల్ సెండర్స్ నుంచి ఈ-మెయిల్‌ల కోసం సెర్చ్ చేయొచ్చు.

ఈ ఫీచర్‌ సాయంతో సెర్చ్ ని మెరుగుపరచడానికి జీమెయిల్.. కాంటాక్ట్స్ (contacts), లేబుల్‌లు (labels), మెసేజెస్ (messages) వంటి సెర్చ్ పదాలను సూచిస్తుంది. రిజల్ట్స్ లో స్పామ్ లేదా ట్రాష్‌లో ఉన్నవి మినహా అన్ని మెసేజెస్ కనిపిస్తాయి. గూగుల్ డ్రైవ్ (google drive) లోని సెర్చ్ చిప్స్ ఫీచర్ వలె, జీమెయిల్ ఆండ్రాయిడ్ వెర్షన్ లోని సెర్చ్ ఫిల్టర్ గూగుల్ వర్క్ స్పేస్, జీ సూట్ బేసిక్, బిజినెస్ యూజర్ల కోసం మాత్రమే అందుబాటులో ఉంటుంది.
Published by:Prabhakar Vaddi
First published:

Tags: GMAIL, Google, Google search, Latest Technology

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు