హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Google: గూగుల్ యాప్స్‌లో కొత్త ఫీచర్లు.. మ్యాప్స్, సెర్చ్‌లో అద్భుతమైన అప్‌డేట్లు.. ఆ వివరాలివే...

Google: గూగుల్ యాప్స్‌లో కొత్త ఫీచర్లు.. మ్యాప్స్, సెర్చ్‌లో అద్భుతమైన అప్‌డేట్లు.. ఆ వివరాలివే...

Google: గూగుల్ యాప్స్‌లో కొత్త ఫీచర్లు.. మ్యాప్స్, సెర్చ్‌లో అద్భుతమైన అప్‌డేట్లు.. ఆ వివరాలివే...

Google: గూగుల్ యాప్స్‌లో కొత్త ఫీచర్లు.. మ్యాప్స్, సెర్చ్‌లో అద్భుతమైన అప్‌డేట్లు.. ఆ వివరాలివే...

Google: మ్యాప్స్ ద్వారా యూజర్లకు మరింత డిటైల్డ్ ఎక్స్‌పీరియన్స్ ఆఫర్ చేయడానికి గూగుల్ ప్లాన్ చేస్తోంది. మ్యాప్స్‌తో పాటు గూగుల్ సెర్చ్‌లో కూడా అదిరిపోయే ఫీచర్స్‌ తీసుకొస్తోంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

టెక్నాలజీ దిగ్గజం గూగుల్ (Google) తన మ్యాప్స్ (Maps), సెర్చ్ ప్లాట్‌ఫామ్‌లలో ఇప్పటికే ఎన్నో అద్భుతమైన ఫీచర్లను పరిచయం చేసింది. ప్రస్తుతానికి గూగుల్ మ్యాప్స్ ఎయిర్ క్వాలిటీ (Air Quality), స్ట్రీట్ వ్యూ, 3D వ్యూ, ట్రాఫిక్ లెవెల్ వంటి ఎన్నో వివరాలను చిటికెలో అందిస్తోంది. ఒక ప్లేస్‌కి వెళ్లగానే అక్కడ ఉన్న రెస్టారెంట్స్‌ రివ్యూస్ కూడా ఇది అందిస్తోంది. అయితే మ్యాప్స్ ద్వారా యూజర్లకు మరింత డిటైల్డ్ ఎక్స్‌పీరియన్స్ ఆఫర్ చేయడానికి గూగుల్ ప్లాన్ చేస్తోంది. అలానే మ్యాప్స్‌తో పాటు సెర్చ్‌లో కూడా అదిరిపోయే ఫీచర్స్‌ తీసుకొస్తోంది. కాగా ఇప్పుడు గూగుల్ ‘వైబ్ చెక్’, ‘విజువల్ ఫార్వర్డ్’, ఇమ్మర్సివ్ వ్యూ అనే అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు తీసుకొస్తున్నట్లు తన తాజా ఈవెంట్‌లో పేర్కొంది.

* లైవ్ వ్యూ

కొన్ని నెలల క్రితం ఇమ్మర్సివ్ వ్యూ (Immersive View) అనే అద్భుతమైన ఫీచర్‌ను గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రకటించారు. అదే ఫీచర్‌ను త్వరలో తీసుకొస్తున్నట్లు బుధవారం నాడు సెర్చ్ ఆన్ (Search On) ఈవెంట్‌లో గూగుల్ తెలిపింది. అలాగే తన సెర్చ్, మ్యాప్స్‌లో తీసుకొచ్చే ఫీచర్లను ప్రకటించింది. గూగుల్ మ్యాప్స్‌లో కొత్త 'Immersive View' ఫీచర్ యూజర్లకు సెర్చ్ చేసిన ప్రాంతానికి సంబంధించి 3D డ్రోన్ వ్యూ ఆఫర్ చేస్తుంది. అలానే వాతావరణం, ట్రాఫిక్, పర్సనల్ బిల్డింగ్స్ కూడా చెక్ చేయడానికి వీలు కల్పిస్తుంది.

అంతేకాకుండా, ఇమ్మర్సివ్ వ్యూ అనేది గూగుల్ మ్యాప్స్ యాప్‌లోని లైవ్ వ్యూ (Live View) టూల్‌ను ఇంప్రూవ్ చేస్తుంది. ప్రస్తుతానికి, లైవ్ వ్యూ అనేది డైరెక్షన్స్ చూపడానికి స్క్రీన్ పైన వాకింగ్ డైరెక్షన్స్ వంటి సమాచారాన్ని ఆగ్మెంటెడ్ రియాలిటీతో చూపిస్తుంది.

కొత్త ఇమ్మర్సివ్ వ్యూ ఫీచర్‌తో యూజర్లు తమ ఫోన్ స్క్రీన్‌పై ATMs, రెస్టారెంట్స్‌, షాప్స్ తదితర వాటన్నిటినీ చాలా క్లియర్‌గా చూడవచ్చు. దీనివల్ల వెళ్లే దారిలో ఏవి ఎక్కడున్నాయనేది ఈజీగా గుర్తుపట్టవచ్చు. గూగుల్ ప్రకారం, మరికొద్ది నెలల్లో లాస్ ఏంజిల్స్, న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో, టోక్యోలలో ఇమ్మర్సివ్ వ్యూ లాంచ్ అవుతుంది.

* వైబ్ చెక్

వైబ్ చెక్ లేదా 'నైబర్‌హుడ్ వైబ్' అనే కొత్త ఫీచర్ యూజర్లు తమ పరిసరాల్లోని ఆసక్తికర ప్రదేశాలను అర్థం చేసుకోవడానికి, కనుగొనడానికి హెల్ప్ అవుతుంది. ఇది పాపులర్, ట్రెండింగ్ ప్లేస్‌లను హైలైట్ చేస్తుంది. వాటి ఫొటోలు, రివ్యూల వంటి ఇతర సంబంధిత సమాచారాన్ని కూడా అందిస్తుంది.

ఇది కూడా చదవండి : వాట్సాప్, ఫైర్‌ఫాక్స్ యూజర్లకు అలర్ట్.. అలా చేయకపోతే డేంజర్ లో పడినట్టే!

* విజువల్ ఫార్వర్డ్

గూగుల్ తన సెర్చ్ ఇంజన్‌లో 'విజువల్ ఫార్వర్డ్ (Visual Forward)' ఫీచర్‌ను కూడా విడుదల చేస్తోంది. దీని సహాయంతో యూజర్లు ట్రావెల్ డెస్టినేషన్స్‌, హాలిడే స్పాట్‌లకు సంబంధించిన వివరాలతో పాటు ఫొటోలు కూడా చూడవచ్చు. ఈ ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్‌లోని ఫోటో స్టోరీల మాదిరిగానే కనిపిస్తాయి. ఈ ఫీచర్ సాయంతో యూజర్లు ఏదైనా డెస్టినేషన్ కోసం సెర్చ్ చేస్తే.. బ్రౌజర్ వారికి సంబంధిత లింక్స్‌, ట్రావెల్ సైట్స్‌, ఫొటోలతో గైడ్స్‌ను షో చేస్తుంది.

Published by:Sridhar Reddy
First published:

Tags: Google, Google Maps, Google search, New features, Tech news

ఉత్తమ కథలు