GOOGLE IS PLANNING TO KEEP YOUR OLD ANDROID SMARTPHONES SAFE HOW IS THAT KNOW HERE GH VB
Google: మీ పాత ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లను సేఫ్‌గా ఉంచడానికి ప్లాన్ చేస్తున్న గూగుల్.. అదెలాగంటే..
(ప్రతీకాత్మక చిత్రం)
టెక్ దిగ్గజం గూగుల్ (Google) ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను ఇంట్రడ్యూస్ చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా మరొక ఫీచర్ లాంచ్ చేసేందుకు గూగుల్ సిద్ధమైంది.
టెక్ దిగ్గజం గూగుల్ (Google) ఆండ్రాయిడ్స్మార్ట్ఫోన్ యూజర్లు కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను ఇంట్రడ్యూస్ చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా మరొక ఫీచర్ లాంచ్ చేసేందుకు గూగుల్ సిద్ధమైంది. ఉపయోగించని యాప్స్ (Unused Apps) నుంచి ఆండ్రాయిడ్ యూజర్లను సేఫ్‌గా ఉంచేలా ఈ ఫీచర్ సహాయపడుతుంది. క్రోమ్ అన్‌బాక్స్‌డ్ నివేదిక కూడా గూగుల్ అప్-కమింగ్ ఫీచర్ గురించి వివరించింది. త్వరలో అందుబాటులోకి వచ్చే గూగుల్ ప్లే ప్రొటెక్ట్ అప్డేట్ (Google Play Protect Update) కొంత కాలంగా ఉపయోగించని యాప్‌లకు పర్మిషన్ గ్రాంటెడ్ తీసివేస్తుందని క్రోమ్ అన్‌బాక్స్‌డ్ నివేదిక పేర్కొంది. ఈ ఫీచర్ ఇప్పటికే ఆండ్రాయిడ్ 11, తర్వాతి వెర్షన్లకు అందుబాటులో ఉంది. కానీ గూగుల్ ప్లే ప్రొటెక్ట్(Google Play Protect) అప్డేట్తో, పాత ఆండ్రాయిడ్(Android) స్మార్ట్ఫోన్లకు కూడా ఈ ఫీచర్ అందుబాటులో రానుంది.
యాప్ పర్మిషన్స్ ఏంటి
కొన్ని ఫంక్షన్స్ ఫర్ఫామ్ చేయాలంటే, సెన్సిటివ్ డీటెయిల్స్ యాక్సెస్ చేయడానికి యాప్స్ మీ పర్మిషన్ కోరతాయి. ఈ పర్మిషన్స్ లో బ్లూటూత్, కాంటాక్ట్స్, కెమెరా, మైక్రోఫోన్, లోకేషన్ కి సంబంధించినవి ఉంటాయి. పర్మిషన్ లేకుండా యాప్‌లు సరిగ్గా పని చేయలేవు కాబట్టి, యాప్‌లోని ఫీచర్లను యాక్సెస్ చేయడానికి చాలా మంది తమ సెన్సిటివ్ డీటెయిల్స్ కు యాక్సెస్‌ను గ్రాంట్ చేస్తారు. అయితే కొన్ని యాప్‌లు ఎక్కువగా ఉపయోగించినప్పటికీ వాటికి మీరు పర్మిషన్ గ్రాంట్ చేసినందున అవి ఇప్పటికీ మీ సెన్సిటివ్ డీటెయిల్స్ యాక్సెస్ చేయగలవు. అయితే ఇది ప్రైవసీకి కాస్త రిస్క్ కాబట్టి వీటికి యాక్సెస్ తీసేయడం బెటర్. ఇందుకోసం మీరు సెట్టింగ్స్> యాప్స్ & నోటిఫికేషన్లకు వెళ్లడం ద్వారా నిర్దిష్ట యాప్‌ల పర్మిషన్స్ మార్చడానికి గూగుల్ మిమ్మల్ని అనుమతిస్తుంది.
స్టాటిస్టా నివేదిక ప్రకారం, డౌన్లోడ్ చేసిన యాప్‌లలో 25% యాప్స్ ని యూజర్లు ఒక్కసారి మాత్రమే వినియోగిస్తారు. దీనర్థం ఏమిటంటే, మీ స్మార్ట్ఫోన్లలో చాలా వరకు అనేక యాప్స్ ఉంటూ అవి మీ సున్నితమైన సమాచారాన్ని యాక్సెస్ చేయగలవు. ఇది లాంగ్ టర్మ్ లో సెక్యూరిటీ రిస్కు కావచ్చు. అయితే త్వరలో రానున్న గూగుల్ ప్లే ప్రొటెక్ట్ అప్డేట్తో, టెక్ దిగ్గజం ఉపయోగించని యాప్స్ మీ డీటెయిల్స్ సేకరించకుండా ఆటోమేటిక్ గా వాటి యాక్సెస్ ని బ్లాక్ చేస్తుంది.
గూగుల్ ప్లే ప్రొటెక్ట్ అంటే ఏంటి?
గూగుల్ ప్లే ప్రొటెక్ట్ అనేది ఆండ్రాయిడ్ డివైజ్ లను హానికరమైన యాప్స్, మాల్వేర్ల నుంచి రక్షించే ఒక ఫీచర్. ఇది మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేస్తున్న యాప్‌లపై సేఫ్టీ చెక్ రన్ చేస్తుంది. ఏవైనా పొటెన్షియల్ రిస్కీ యాప్‌ల గురించి కూడా ఇది మిమ్మల్ని హెచ్చరిస్తుంది. మీ డివైజ్ నుంచి తెలిసిన హానికరమైన యాప్స్ తీసివేస్తుంది. ఫీచర్ డిఫాల్ట్‌గా ఆన్‌లో ఉంది, కానీ మీరు దాన్ని ఆఫ్ చేయవచ్చు. సేఫ్టీ కోసం, మీరు ఎల్లప్పుడూ గూగుల్ ప్లే ప్రొటెక్ట్ ను ఆన్‌లో ఎంచుకోవడం శ్రేయస్కరం.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.