కిడ్నీ వ్యాధి బాధితుల కోసం గూగుల్ సరికొత్త యాప్...

కిడ్నీ వ్యాధుల బారిన పడకుండా గూగుల్‌ కంపెనీ ‘అక్యూట్‌ కిడ్నీ ఇంజూరి’ని 14 నిమిషాల్లో గుర్తించే విధంగా ఓ మొబైల్‌ యాప్‌ను తీసుకొచ్చింది. ‘స్ట్రీమ్స్‌’గా పిలిచే ఈ యాప్‌ను గూగుల్స్‌ డీప్‌మైండ్‌ అని పిలుస్తున్నారు.

news18-telugu
Updated: November 13, 2019, 10:45 PM IST
కిడ్నీ వ్యాధి బాధితుల కోసం గూగుల్ సరికొత్త యాప్...
Google (ప్రతీకాత్మక చిత్రం, image: AP)
  • Share this:
ప్రపంచ వ్యాప్తంగా కిడ్నీ సమస్యలతో ఏటా లక్షలాది మంది మరణిస్తున్నారు. సకాలంలో వారి సమస్యను గుర్తించక పోవడం వల్లనే ఎక్కువ మంది మరణిస్తున్నారని లండన్‌లోని రాయల్‌ ఫ్రీ ఆస్పత్రికి చెందిన వైద్యులు తెలియజేస్తున్నారు. సకాలంలో గుర్తించినట్లయితే డయాలసిస్‌ లేదా కిడ్నీ ఆపరేషన్ల వరకు వెళ్లకుండా రోగులను రక్షించే అవకాశం ఉంటుందని వారంటున్నారు. అయితే కిడ్నీ వ్యాధుల బారిన పడకుండా గూగుల్‌ కంపెనీ ‘అక్యూట్‌ కిడ్నీ ఇంజూరి’ని 14 నిమిషాల్లో గుర్తించే విధంగా ఓ మొబైల్‌ యాప్‌ను తీసుకొచ్చింది. ‘స్ట్రీమ్స్‌’గా పిలిచే ఈ యాప్‌ను గూగుల్స్‌ డీప్‌మైండ్‌ అని పిలుస్తున్నారు. గూగుల్‌ యాప్‌ ద్వారా 96 శాతం ఎమర్జెన్సీ కేసులను గుర్తించగలుగుతున్నారట. ఆస్పత్రుల్లో ఉంటే ఐటీ టెక్నాలజీని ఉపయోగించి ఓ రోగికి సంబంధించిన సమస్త డేటాను ఈ యాప్‌ సేకరిస్తుంది. గుండె కొట్టుకునే రేటు, రక్తపోటు, రక్త పరీక్షల వివరాలు సేకరించి ఒక చోట నమోదు చేస్తుంది. రోగి రక్తంలో క్రియాటినిన్‌ ఎక్కువ మోతాదులో ఉన్నట్లయితే సదరు వైద్యుడికి వెంటనే సందేశం పంపిస్తుంది. ఈ ‘స్ట్రీమ్స్‌’ యాప్‌ ఫలితాలు అద్భుతంగా ఉన్నాయని వైద్యులు పేర్కొంటున్నారు.

First published: November 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...