• Home
  • »
  • News
  • »
  • technology
  • »
  • GOOGLE IS GOING TO STOP BOOKMARKS SERVICES WHICH MAY BE DIFFICULT FOR GOOGLE MAP USERS AK GH

Google: వినియోగదారులకు అలర్ట్.. గూగుల్ కీలక నిర్ణయం.. ఆ రోజు నుంచి ఆ సేవలు బంద్

ప్రతీకాత్మకచిత్రం

Google: గూగుల్‌ ఈ సర్వీస్‌ను తొలగించడం ద్వారా గూగుల్‌ మ్యాప్స్‌లోని స్టార్‌డ్‌ లొకేషన్‌ ఫీచర్‌ కూడా ఇబ్బంది పడుతుంది.

  • Share this:
పాత సర్వీసుల్ని, పెద్దగా వాడటం లేదనిపించే సర్వీసుల్ని గూగుల్‌ మూసేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా గూగుల్‌ తన ‘బుక్‌మార్క్స్’ సేవలకు గుడ్‌బై చెప్పేస్తోంది. సెప్టెంబరు 30 నుంచి గూగుల్‌ బుక్‌మార్క్స్‌ను మూసేస్తున్నట్లు ప్రకటించింది. అలా 16ఏళ్ల చరిత్ర ఉన్న గూగుల్‌ బుక్‌ మార్క్స్‌ ఆగిపోతోందన్నమాట. ‘సెప్టెంబరు 30 నుంచి గూగుల్‌ బుక్‌మార్క్స్ పని చేయదు’ అంటూ ఆ పేజీలో గూగుల్‌ ఓ బ్యానర్‌ను ఉంచింది. సెప్టెంబరు 30లోపు వినియోగదారులు బుక్‌మార్క్స్ ను ఎక్స్‌పోర్ట్‌ చేసుకోవచ్చు. దీని కోసం ఎక్స్‌పోర్ట్‌ బుక్ మార్క్స్‌ అనే ఆప్షన్‌ను ఇచ్చింది. అది క్లిక్‌ చేసి మొత్తం బుక్‌మార్క్స్‌ను హెచ్‌టీఎంఎల్‌ పేజీ రూపంలో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఆ తర్వాత వాటిని బ్రౌజర్‌లో బుక్‌మార్క్స్‌గా పెట్టుకోవచ్చు. లేదంటే డిలీట్‌ ఆల్‌ ఆప్షన్‌ ద్వారా డిలీట్‌ చేసుకోవచ్చు.

గూగుల్‌ ఈ సర్వీస్‌ను తొలగించడం ద్వారా గూగుల్‌ మ్యాప్స్‌లోని స్టార్‌డ్‌ లొకేషన్‌ ఫీచర్‌ కూడా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే ఈ ఫీచర్‌ బుక్‌ మార్క్స్‌ ఆధారంగా పని చేస్తుంది. ఈ రెండూ సింక్‌ అవ్వడం వల్లే పని చేస్తాయట. ఒకవేళ బుక్‌మార్క్స్‌ డిలీట్‌ చేస్తే... స్టార్‌డ్‌ లొకేషన్లు కూడా డిలీట్‌ అయిపోతాయి. అయితే ఇప్పుడు ఈ రెండింటి సింక్‌ను గూగుల్ నిలిపేసి... కేవలం బుక్‌మార్క్స్ మాత్రమే డిలీట్‌ అయ్యేలా చూస్తారేమో చూడాలి.

సేవ్‌ ప్లేస్‌ డేటాను సిస్టమ్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే... తొలుత సిస్టమ్‌లో గూగుల్‌ మ్యాప్స్‌ ఓపెన్‌ చేయాలి. ఆ తర్వాత సెర్చ్‌, బిజినెస్‌, ప్లేస్‌ లాంటి వివరాలతో సెర్చ్‌చేయాలి. ఆ తర్వాత మీకు కావాల్సిన ప్రాంతాన్ని సేవ్‌ చేసి... లిస్ట్‌లో పెట్టుకోవాలి. అలా సేవ్‌ చేసిన ప్రాంతాలు మీకు మాత్రమే కనిపిస్తాయి. ఏదైనా వెబ్‌సైట్‌లో మ్యాప్‌ను ఎంబెడ్‌ చేసుకుంటే... దానిని కూడా సేవ్‌ చేసుకోవాలి.

దీని కోసం ఎంబెడెడ్‌ అయిన గూగుల్‌ మ్యాప్స్‌ ఓపెన్‌ చేయాలి. మ్యాప్‌లో ఏదైనా ప్రాంతం మీద క్లిక్‌ చేయాలి. ఆ తర్వాత సేవ్‌ చేసి లిస్ట్‌ చేసుకోవాలి. అలా స్టార్‌ చేసిన వెబ్‌సైట్‌ పేరు, మీ డెస్క్‌టాప్‌, మొబైల్‌ గూగుల్‌ మ్యాప్స్‌లో కనిపిస్తుంది. ఇటీవల గూగుల్‌ మళ్లీ వరుసగా సర్వీసులు క్లోజ్‌ చేసుకుంటా వస్తోంది. ఇటీవల గూగుల్‌ బ్యాకప్‌ అండ్‌ సింక్‌ సర్వీసును కూడా ఇలానే మూసేసిన విషయం తెలిసిందే.
Published by:Kishore Akkaladevi
First published: