• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • GOOGLE IS GEARING UP TO RELEASE THE NEXT BIG ANDROID UPDATE THIS YEAR HERE FULL DETAILS NS GH

Android 12: అతి త్వరలో ఆండ్రాయిడ్ 12.. కొత్త ఫీచర్లు ఏముంటాయో తెలుసా?

Android 12: అతి త్వరలో ఆండ్రాయిడ్ 12.. కొత్త ఫీచర్లు ఏముంటాయో తెలుసా?

ప్రతీకాత్మక చిత్రం

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్.. టెక్ దిగ్గజం గూగుల్ తీసుకొచ్చిన ఈ ఓఎస్ తో ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ వినియోగంలో సమూల మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఏడాది చివరికల్లా ఆండ్రాయిడ్ 12 అప్‌డేట్‌ను విడుదల చేయడానికి గూగుల్ సన్నద్ధమవుతోంది.

  • Share this:
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్.. టెక్ దిగ్గజం గూగుల్ తీసుకొచ్చిన ఈ ఓఎస్ తో ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ వినియోగంలో సమూల మార్పులు చోటుచేసుకున్నాయి. యూజర్ అవసరాలకు తగ్గట్లు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ ప్రతి ఏడాది అప్డేటెడ్ వెర్షన్ ని విడుదల చేస్తుంది. ఇందులో భాగంగానే ఈ ఏడాది చివరికల్లా ఆండ్రాయిడ్ 12 అప్‌డేట్‌ను విడుదల చేయడానికి గూగుల్ సన్నద్ధమవుతోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆండ్రాయిడ్ 11లో నోటిఫికేషన్లు, చాట్ బబుల్స్, కన్వర్టేషన్ నోటిఫికేషన్స్, బిల్డ్ ఇన్ స్క్రీన్ రికార్డర్ వంటి కొత్త ఫీచర్లను జోడించింది. కాగా, నూతనంగా రాబోయే ఆండ్రాయిడ్ 12లో ఎటువంటి ఫీచర్లు చేర్చనున్నారనే విషయం ఆసక్తికరంగా మారింది. అయితే, ప్రివ్యూలో భాగంగా దీన్ని ప్రాథమికంగా కొన్ని ఫోన్లలో మాత్రమే అందుబాటులోకి తేనున్నారు. పిక్సెల్ 3 సిరీస్, పిక్సెల్ 3 ఎ సిరీస్, పిక్సెల్ 4 సిరీస్, పిక్సెల్ 4 ఎ సిరీస్, పిక్సెల్ 5 వంటి గూగుల్ పిక్సెల్ ఫోన్లలో తొలుత ఆండ్రాయిడ్ 12 అందుబాటులోకి రానుంది.

హైక్వాలిటీ వీడియో సపోర్ట్
హైక్వాలిటీ వీడియో HEVC సపోర్ట్ కోసం గూగుల్ ట్రాన్స్‌కోడింగ్‌ను జోడిస్తోంది. ఈ ఫీచర్ తో, HEVCకి సపోర్ట్ ఇవ్వని యాప్స్ ఫైల్‌ను AVCలోకి ఆటోమేటిక్ గా ట్రాన్స్‌కోడ్ చేయవచ్చు. తద్వారా ఆయా యాప్స్ మెరుగైన వీడియోలను షూట్ చేస్తాయని, దీనికోసం తక్కువ స్టోరేజ్ స్పేస్ ని వినియోగిస్తాయని చెప్పవచ్చు.

AVIF ఫార్మార్ట్ సపోర్ట్
మరింత క్వాలిటీ గల ఫోటోల కోసం Android 12లో AV1 ఇమేజ్ ఫైల్ ఫార్మాట్ (AVIF) సపోర్ట్ ని అందిచనున్నారు. ఇది JPEG వంటి పాత ఇమేజ్ ఫార్మాట్లతో పోల్చినప్పుడు మెరుగ్గా పనిచేస్తుంది. ఫోటో క్వాలిటీని మెరుగుపరుస్తుందని గూగుల్ పేర్కొంది.

యాప్స్ పనితీరు మెరుగుపర్చడం
మొబైల్ యాప్స్ పనితీరును మెరుగుపరచడానికి ఆండ్రాయిడ్ 12లో సరికొత్త ఫీచర్ ని చేర్చనున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా, గేమింగ్ మొదలైన భారీ యాప్స్  బ్యాక్ గ్రౌండ్ లో బ్లాక్ చేసి ప్రస్తుతం ఉపయోగిస్తున్న యాప్ పనితీరును మెరుగుపర్చనున్నారు.

హాప్టిక్-కపుల్డ్ ఆడియోతో మ్యూజిక్, గేమింగ్
Android 12లోని యాప్స్ ఫోన్, వైబ్రేటర్ ద్వారా ఆడియో-కపుల్డ్ హాప్టిక్ అభిప్రాయాన్ని అందించగలవు. తద్వారా మంచి గేమింగ్ అనుభవానికి పొందవచ్చు.

గూగుల్ నావిగేషన్
ఆండ్రాయిడ్ 12 లో వీడియో చూసేటప్పుడు, పుస్తకం చదివేటప్పుడు లేదా గేమ్స్ ఆడుతున్నప్పుడు గూగుల్ నావిగేషన్‌ను అందిస్తుంది. వినియోగదారులు తమ ఫోన్‌ను ఒకే స్వైప్‌తో నావిగేట్ చెయ్యడానికి డిఫాల్ట్‌ సెట్టింగ్ చేర్చనుంది.

వేగంగా నోటిఫికేషన్‌లు
కంటెంట్, ఐకాన్స్ అందంగా కనిపించడానికి గూగుల్ నోటిఫికేషన్ డిజైన్లకు రిఫ్రెష్ ఫీచర్  చేర్చింది. తద్వారా, నోటిఫికేషన్‌లు వేగంగా తెరుచుకుంటాయి. వినియోగదారులు నోటిఫికేషన్లపై క్లిక్ చేసిన వెంటనే వారు యాప్ లోకి వేగంగా వెళ్తారని గూగుల్ తెలిపింది.

సాఫ్ట్వేర్ సమస్యల పరిష్కారం
యాప్లకు మరింత స్థిరమైన, సురక్షితమైన వాతావరణాన్ని అందించడానికి గూగుల్ ప్లే సిస్టమ్ ప్రాజెక్ట్ మెయిన్‌లైన్‌పై దృష్టి సారించింది. దీనితో గూగుల్ సులభంగా సాఫ్ట్‌వేర్ సమస్యలను పరిష్కరించగలదు.

మరింత భద్రత
ట్రాకింగ్ కోసం ఉపయోగించే ఐడెంటిఫైయర్‌లపై గూగుల్ ప్రత్యేక శ్రద్ధ వహించింది. దీని కోసం గూగుల్ నూతన కంట్రోల్స్ జతచేసింది. ఆండ్రాయిడ్ 12లో మరిన్ని ప్రైవసీ, సెక్యూరిటీ ఫీచర్లను జోడించనుంది.

మరింత వేగంగా..
ఆండ్రాయిడ్ 12 నూతన అప్డేట్ తో టీవీలు, ఫోల్డబుల్ ఫోన్లు, టాబ్లెట్లు వేగంగా పనిచేస్తాయని గూగుల్ స్పష్టం చేసింది.
Published by:Nikhil Kumar S
First published:

అగ్ర కథనాలు