Google: గూగుల్ నుంచి త్వరలోనే కొత్త యాప్​.. ఆ యాప్ ఉపయోగమేంటో తెలిస్తే పండగ చేసుకుంటారు..

ప్రతీకాత్మక చిత్రం

యాపిల్‌ ఐఫోన్లు ఐఓఎస్​, ఇతర అన్ని స్మార్ట్​ఫోన్లు ఆండ్రాయిడ్​ ఆపరేటింగ్​ సిస్టమ్​తో పనిచేస్తాయన్న విషయం తెలిసిందే. అయితే ఒక ఆండ్రాయిడ్​ ఫోన్​ నుంచి మరో ఆండ్రాయిడ్​ ఫోన్​కు డేటా బదిలీ చేయాలంటే ‘షేర్​ ఇట్​’ వంటి అనేక యాప్స్​ అందుబాటులో ఉన్నాయి. మరి ఐఫోన్​ యూజర్లు ఆండ్రాయిడ్​ ఫోన్లకు డేటా బదిలీ చేయాలనుకుంటే ఏం చేయాలి?

  • Share this:
యాపిల్‌ ఐఫోన్లు ఐఓఎస్​, ఇతర అన్ని స్మార్ట్​ఫోన్లు ఆండ్రాయిడ్​ ఆపరేటింగ్​ సిస్టమ్​తో పనిచేస్తాయన్న విషయం తెలిసిందే. అయితే ఒక ఆండ్రాయిడ్​ ఫోన్​ నుంచి మరో ఆండ్రాయిడ్​ ఫోన్​కు డేటా బదిలీ చేయాలంటే ‘షేర్​ ఇట్​’ వంటి అనేక యాప్స్​ అందుబాటులో ఉన్నాయి. మరి ఐఫోన్​ యూజర్లు ఆండ్రాయిడ్​ ఫోన్లకు డేటా బదిలీ చేయాలనుకుంటే ఏం చేయాలి? ఇటువంటి సందేహాలకు పరిష్కారం చూపే దిశగా అడుగుల వేస్తోంది గూగుల్​. ఐఓఎస్​ యూజర్లు ఆండ్రాయిడ్​ స్మార్ట్​ఫోన్లకు సులభంగా డేటా ట్రాన్స్​ఫర్​ చేసుకునేలా సరికొత్త యాప్​ను రూపొందించే పనిలో పడింది గూగుల్​. ‘స్విచ్​ టు ఆండ్రాయిడ్​’ పేరుతో త్వరలోనే దీన్ని అందుబాటులోకి తేనుంది. ఈ కొత్త యాప్ సహాయంతో యూజర్లు తమ ఐఓఎస్​ ఫోన్​లోని డేటాను ఆండ్రాయిడ్​ ఫోన్​లోకి సులభంగా ట్రాన్స్​ఫర్​ చేసుకోవచ్చు. పెద్ద మొత్తంలో డేటాను కూడా క్షణాల్లో ట్రాన్స్​ఫర్​ చేసుకునే విధంగా ఈ యాప్​ను రూపొందిస్తుంది.

ఆండ్రాయిడ్ డేటా రీస్టోర్ APK టియర్‌డౌన్‌ టూల్ ద్వారా ఇది సాధ్యం కానుంది. కాగా, ప్రస్తుతం ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్ ఫోన్‌కు డేటా ట్రాన్స్​ఫర్​ చేసుకోవాలంటే గూగుల్​ డ్రైవ్​ ఒక్కటే మార్గం. ఆండ్రాయిడ్​ ఫోన్​లోని గూగుల్ డ్రైవ్‌లో మీ డేటా బ్యాకప్ చేసుకోని, ఆ తర్వాత ఐఫోన్​లో డేటాను డౌన్‌లోడ్ చేసుకోవాలి. అయితే ఈ విధానంలో మీ అతి ముఖ్యమైన డేటా, ఫోటోలను మాత్రమే ట్రాన్స్​ఫర్​ చేసుకోవచ్చు. అంతేకాదు, గూగుల్​ డ్రైవ్​లో 15జీబీకి మించి డేటా స్టోర్​ చేసుకోవాలంటే డేటా బ్యాకప్​ కొనుగోలు చేయాలి. ​అందువల్ల, ఈ సమస్యలన్నింటికీ చెక్​ పెట్టేలా కొత్త యాప్​ను అభివృద్ధి చేస్తోంది టెక్​ దిగ్గజం గూగుల్​.



‘స్విచ్​ టు ఆండ్రాయిడ్’​ పేరుతో కొత్త యాప్​..

ఈ మేరకు గూగుల్ తన ఆండ్రాయిడ్ అధికారిక డేటా రీస్టోర్​ టూల్​​లో 1.0.382048734 కోడ్‌ వెర్షన్​తో కూడిన ‘స్విచ్​ టు ఆండ్రాయిడ్‌’ యాప్​ను రిజిస్టర్​ చేసుకుంది. గతంలో యాపిల్‌ ప్రవేశపెట్టిన ‘స్విచ్​ టు ఐఓఎస్​’ యాప్​కు ప్రతిరూపంగా ఈ కొత్త యాప్​ ఉండబోతుంది. ఈ యాప్​ ద్వారా డేటా ట్రాన్స్​ఫర్ చేసుకునేందుకు మీ ఆండ్రాయిడ్​ ఫోన్‌ను లోకల్​ వైఫై నెట్​వర్క్​తో కనెక్ట్​ చేసుకోవాలి. ఇక ఐఫోన్‌లో కొత్త నెట్‌వర్క్‌కు కనెక్ట్ అవ్వాలి. రెండు ఫోన్లలోనూ ఈ యాప్​ను ముందుగా డౌన్​లోడ్​ చేసుకోవాలి. అయితే, ఈ యాప్​ ఫీచర్లు అద్భుతంగా ఉన్నప్పటికీ, ఇది సరిగ్గా ఎలా పనిచేస్తుందనే విషయంపై ఇంకా స్పష్టత లేదు.
Published by:Sambasiva Reddy
First published: