మైక్రోసాఫ్ట్ సహకారంతో OpenAI కంపెనీ ChatGPTని డెవలప్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చాట్‌బాట్ సృష్టిస్తున్న సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను మైక్రోసాఫ్ట్ కంపెనీకి చెందిన బింగ్ సెర్చ్(Bing Search) ఇంజిన్‌కు యాడ్ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. వాస్తవానికి ChatGPT అరంగేట్రంతో చాలా కంపెనీలు, ప్రత్యేకించి సెర్చ్‌లో ఉన్నవారు ఈ టెక్నాలజీలను చాలా సీరియస్‌గా తీసుకుంటున్నారు. ఇదే ధోరణి గూగుల్ సీఈవో వ్యాఖ్యలో కనిపించింది. గూగుల్ కంపెనీ గురువారం నాలుగో త్రైమాసికం ఆదాయాలను ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రజలు నేరుగా కమ్యూనికేట్ అవ్వగల AI- వంటి సెర్చ్ ఆప్షన్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ చెప్పారు.
కొత్త ప్రొడక్టులపై పని చేస్తున్న గూగుల్
కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో నడిచే చాట్ ప్రొడక్టులను గూగుల్ టెస్ట్ చేస్తోంది. కొత్త చాట్‌బాట్‌ను సెర్చ్ ఇంజిన్‌కు అనుసంధానించే అవకాశం ఉంది. గూగుల్ కంపెనీ తన క్లౌడ్ యూనిట్ పరిధిలో ‘అట్లాస్’ అనే ప్రాజెక్టును చేపడుతోంది. ChatGPTని ఎదుర్కోవడానికి కంపెనీ ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకొంది. గూగుల్ అప్రెంటిస్ బార్డ్ అనే చాట్‌బాట్‌ను కూడా టెస్ట్ చేస్తోంది. దీన్ని ఉద్యోగులు ప్రశ్నలు అడగవచ్చు, ChatGPT మాదిరిగానే వివరణాత్మక సమాధానాలను పొందవచ్చు. మరొక ప్రొడక్ట్ యూనిట్ కొత్త సెర్చ్ డెస్క్‌టాప్ డిజైన్‌ను పరీక్షిస్తోంది, అది ప్రశ్న-జవాబు రూపంలో ఉండనుంది.
అప్రెంటిస్ బార్డ్
అప్రెంటిస్ బార్డ్ అనే చాట్‌బాట్, గూగుల్ కన్వర్జేషన్ టెక్నాలజీ LaMDAని ఉపయోగిస్తుంది. లేదా డైలాగ్ అప్లికేషన్‌ల కోసం లాంగ్వేజ్ మోడల్‌ని ఉపయోగిస్తుంది. అప్రెంటిస్ బార్డ్ ChatGPTని పోలి ఉంటుంది. ఉద్యోగులు డైలాగ్ బాక్స్‌లో ప్రశ్నను ఎంటర్ చేసిన తర్వాత, టెక్ట్స్ రూపంలో సమాధానాన్ని పొందవచ్చు. ఆపై ప్రతిస్పందనపై అభిప్రాయాన్ని తెలియజేయవచ్చు.
ఆరేళ్ల క్రితమే ఏఐ ప్లాన్స్
సుందర్ పిచాయ్ మాట్లాడుతూ.. రాబోయే వారాలు, నెలల్లో, మేము LaMDAతో ప్రారంభించి, ఈ లాంగ్వేజ్ మోడల్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. దీంతో ప్రజల ఫ్యీడ్‌బ్యాక్ పొందడానికి, టెస్ట్ చేయడానికి, మరింత సురక్షితంగా మార్చడానికి అవకాశం ఉంటుందన్నారు. ఈ మోడల్స్ కంపోజింగ్, కన్‌స్ట్రక్టింగ్, సమ్మరైజింగ్‌కి ప్రత్యేకంగా అద్భుతమైనవని తెలిపారు. ప్రజలు ఎప్పటికప్పుడు వాస్తవిక సమాచారాన్ని అందించడం వల్ల అవి ప్రజలకు మరింత ఉపయోగకరంగా మారుతాయని అభిప్రాయపడ్డారు. ఆరేళ్ల క్రితం గూగుల్ ఏఐ-ఫస్ట్ కంపెనీ అని మాట్లాడినట్లు గుర్తు చేశారు. గత సంవత్సరం ప్రారంభం నుంచి ఈ క్షణం కోసం సిద్ధమవుతున్నామని, రాబోయే కొద్ది నెలల్లో మూడు పెద్ద ఆపర్చునిటీస్‌ని చూడబోతున్నారని పేర్కొన్నారు. మొదటగా లార్జ్ మోడల్స్ పేర్కొనాలని, ఇప్పటికే LaMDA, PoN గురించి విస్తృతంగా ప్రచురించామన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Google