ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆన్‌లైన్ మోసాలు (Online Frauds) ఎక్కువగా జరుగుతున్నాయి. మోసపూరిత లింక్‌ల ద్వారా యూజర్‌ల సమాచారాన్ని సేకరించి, నగదు దొంగిలించడం, బెదిరింపులకు పాల్పడటం వంటివి చేస్తున్నారు. దీంతో అనుమానాస్పద లింక్‌లను ఓపన్ చేసి ముప్పు ఎదుర్కోకుండా యూజర్‌లను అప్రమత్తం చేసేందుకు గూగుల్ (Google) ఒక కొత్త ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది. త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మొబైల్, డెస్క్‌టాప్ గూగుల్ చాట్ వెర్షన్‌లకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇతర గూగుల్ సూట్ సర్వీసులలోనే ఈ ప్రత్యేక ఫీచర్ కనిపిస్తుంది.
ఫిషింగ్(Fishing), మాల్వేర్(Malware) దాడులకు కారణమయ్యే అనుమానాస్పద లింక్(Suspicious Links )లకు సంబంధించి యూజర్‌లను అప్రమత్తం చేయడానికి గూగుల్ చాట్‌కి బ్రైట్ రెడ్ వార్నింగ్ బ్యానర్(Bright Red Warning Banners)లను గూగుల్ సంస్థ యాడ్ చేయనుంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికీ అందుబాటులోకి రాని యూజర్‌లకు కొన్ని వారాల్లో గూగుల్ చాట్ మొబైల్, డెస్క్‌టాప్ వెర్షన్‌లలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. చాట్‌కి హానికరమైన మెసేజ్ లేదా లింక్ వచ్చినప్పుడల్లా.. గూగుల్ బ్రైట్ రెడ్ బాక్స్‌లో మెసేజ్ ద్వారా అప్రమత్తం చేస్తుంది. ఈ ఇన్విటేషన్ లింక్ అనుమానాస్పదంగా ఉందని, ఈ చాట్ పెర్సనల్ ఇన్‌ఫర్మేషన్‌ను సేకరించేందుకు ప్రయత్నించే ఫిషింగ్ సైట్‌లకు చెందిన లింక్ అని, వీటికి మీరు ‘బ్లాక్’ లేదా ‘యాక్సెప్ట్’ ఆప్షన్ల ద్వారా రెస్పాండ్ కావచ్చని గూగుల్ హెచ్చరిస్తుంది.
Google: గూగుల్ షాకింగ్ నిర్ణయం.. 9 లక్షల యాప్స్‌ను తొలగింపు.. అదే బాట పట్టిన యాపిల్..కారణం ఇదే!
పెద్ద, ఎరుపు బ్యానర్‌లో ఇటువంటి హెచ్చరిక మెసేజ్‌లు పెర్సనల్ గూగుల్ అకౌంట్ ఉన్న వారికి వచ్చిన అనుమానాస్పద మెసేజ్‌ల వద్ద కనిపిస్తాయి.
గూగుల్ కొత్తగా తీసుకొంటున్న చర్యల ద్వారా చాట్ మెసేజ్‌ల ద్వారా మాల్వేర్ ఒకరి కంప్యూటర్ లేదా మొబైల్‌లోకి ప్రవేశించకుండా ఆపలేకపోవచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో యూజర్‌లు లింక్‌ను క్లిక్ చేసేలా ప్రేరేపించే మెసేజ్‌లను పంపుతారు. అటువంటి సందర్భాల్లో ప్రతి లింక్‌పై యూజర్ క్లిక్ చేసి ముప్పు బారిన పడకుండా.. జాగ్రత్తపడేలా గూగుల్ బ్రైట్ రెడ్ బాక్స్ మెసేజ్ సహాయపడుతుంది. యూజర్‌లు హెచ్చరికను చూడగానే అప్రమత్తం అవడానికి అవకాశం ఉంటుంది.
Google Features: వెబ్‌కెమెరా పని చేయట్లేదా.. వీడియో కాలింగ్ సమస్యలకు గూగుల్ కొత్త పరిష్కారం..
గూగుల్ చాట్ కోసం కొత్త ‘రెడ్ వార్నింగ్’ ఫీచర్ Google Workspace కస్టమర్‌లందరికీ, అలాగే లెగసీ G Suite Basic, బిజినెస్ కస్టమర్‌లకు, వ్యక్తిగత Google ఖాతాలు ఉన్న యూజర్‌లకు కూడా అందుబాటులో ఉంటుంది. ఇతర గూగుల్ సూట్ సేవలకు ఈ ఫీచర్ పూర్తిగా కొత్తది కాదు, కొంత కాలంగా జీమెయిల్, గూగుల్ డ్రైవ్‌లో కూడా కనిపిస్తుంది. ఈ ఫీచర్ గూగుల్ డాక్స్, షీట్, స్లయిడ్‌ల వంటి ఇతర గూగుల్ సూట్ అప్లికేషన్‌లకు కూడా అందుబాటులోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కస్టమర్‌లను చేరుకోవడానికి కొంత సమయం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Google