గ్లోబల్ టెక్ దిగ్గజం గూగుల్(Google) సంస్థ ఏ కంపెనీలోనైనా పెట్టుబడులు పెడుతుందంటే అందరి దృష్టి అటువైపే ఉంటుంది. ఇప్పటికే బైట్ డ్యాన్స్(Bytedance) అనుబంధం సంస్థ టిక్ టాక్(Tik Tok) లో భాగస్వామ్యం కోసం చేస్తున్న ఈ సెర్చింగ్ దిగ్గజ సంస్థ భారత్ లో ఒకే రోజు రెండూ షార్ట్ వీడియో ప్లాట్ ఫామ్ ల్లో భారీ పెట్టుబడులు పెట్టింది. గ్లాన్స్(Glance) సంస్థకు చెందిన రోపోసో(Roposo), డైలిహంట్(Dialy hunt) పేరెంట్ సంస్థ వెర్సే ఇన్వోవేషన్ కు చెందిన జోష్(Josh) వీడియో యాప్ లో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకుంది. ఆసక్తికకర విషయమేమంటే రోపోసో, జోష్ రెండూ సంస్థలు స్థానిక భాషల్లో కూడా కంటెంట్ ను అందిస్తున్నాయి.
గూగుల్ ఫర్ ఇండియా కార్యక్రమంలో గ్లోబల్ టెక్ దిగ్గజం భారతదేశం కోసం 10 బిలియన్ డాలర్లు(రూ.73.81 వేల కోట్లు) పెట్టుబడి ప్రణాళికను ప్రకటించింది. దీని నుంచి రిలయన్స్ జియో(Reliance Jio) 4.5 బిలియన్ డాలర్లు నిధులను ప్రకటించింది. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఈ విషయాన్ని తెలియజేశారు. పెట్టుబడి పెట్టబోయే నాలుగు రంగాల్లో హిందీ, తమిళం, పంజాబీ లేదా మరే ఇతర భాషల్లో ప్రతి భారతీయుడికి సొంత భాషలో సరసమైన ప్రాప్యత సమచారాన్ని అందించే సంస్థల్లో ఉంటుందని ఆయన అన్నారు.
ఇప్పటికే చాలా మంది భారతీయులు కంటెంట్ ను తమ సొంత భాషల్లో నమ్మకంగా ఉపయోగించగల సేవలను కనుగొనడంలో ఇబ్బంది పడుతున్నారు. ఇది వారికి ఇంటర్నెట్ విలువను గణనీయంగా పరిమితం చేస్తుంది. ప్రత్యేకించి ఇలాంటి సమయంలో ఇంటర్నెట్ లో చాలా మందికి జీవనాధారంగా ఉంటుంది. ఈ పెట్టుబడి ప్రతి ఒక్కరికీ ప్రయోజనం చేకూర్చే నిజమైన కలుపుకొని ఉన్న డిజిటల్ ఆర్థిక వ్యవస్థను నిర్మించాలనే భాగస్వామ్య లక్ష్యం వైపు భారత్ లో వినూత్న స్టార్టప్ లో పనిచేయాలనే మా బలమైన నమ్మకాన్ని నొక్కి చెబుతున్నాం అని కంపెనీ వీపీ సీజన్ సేన్ గుప్తా ఓ ప్రకటనలో తెలిపారు.
రోపోసు.. గ్లాన్స్ యాజమాన్యంలో ఉంది. గ్లాన్స్ గూగుల్ నుంచి ప్రస్తుతం పెట్టుబడి అందుకుంటుంది. మిథ్రిల్ క్యాపిటల్ నుంచి 145 మిలియన్ డాలర్లను సేకరించింది. తాజా పెట్టుబడితో గ్లాన్స్, రోపోసో అంతటా దాని AI సామర్థ్యాన్ని మరింతగా పెంచడం, దాని సాంకేతిక బృందాన్ని విస్తరించడం ప్లాట్ ఫాంలో సేవలను ప్రారంభించడం లాంటి వాటితో ప్రపంచ మార్కెట్లో విస్తరణను లక్ష్యంగా పెట్టుకుంది.
జోష్ నెలవారీ నెంబర్లు..
నెలవారీ యాక్టివ్ యూజర్లు...................... 77 మిలియన్లు
డైలీ యాక్టివ్ యూజర్లు............................ 36 మిలియన్లు
గూగుల్ నుంచి ఇతర పెట్టుబడులు డైలిహంట్, టిక్ టాక్ చిన్న వీడియో ప్లాట్ ఫాం(Video Platform) జోష్ కోసం తీసుకున్నారు. భారత్ లో టిక్ టాక్ నిషేధించిన తర్వాత న్యూస్ అగ్రిగేటర్ ప్లాట్ ఫాం స్థానిక భాషల్లో 'భారత్' యూజర్ల(Bhart Users)ను రాబట్టుకునేందుకు జోష్ ను ప్రారంభించింది. ఈ పదం భారత్ లో తదుపరి 200 మిలియన్లు ఇంటర్నెట్ వినియోగదారులకు ఉపయోగించబడింది. దీంతో డైలీహంట్ మాతృ సంస్థ వెర్సే ఇన్నోవేషన్ బిలియన్ డాలర్ల విలువను దాటింది. ఫాల్కాన్ ఎడ్జ్ క్యాపిటల్ యూనిట్ అయిన మైక్రోసాఫ్ట్(Microsoft), ఆల్ఫావేవ్ లతో పాటు డైలీహంట్ గూగుల్ నుంచి నిధులను సేకరించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Google, Google news, Technology