Home /News /technology /

Google New Feature: భ‌ద్ర‌తే ముఖ్యం.. జీమెయిల్‌లో కొత్త రూల్స్.. వివ‌రాలు ఇవే

Google New Feature: భ‌ద్ర‌తే ముఖ్యం.. జీమెయిల్‌లో కొత్త రూల్స్.. వివ‌రాలు ఇవే

జీమెయిల్‌

జీమెయిల్‌

Google New Feature: గూగుల్ అందిస్తున్న ప‌లు డేటా సేవింగ్‌కు జీమెయిల్ ఎకౌంట్ త‌ప్ప‌నిస‌రి. ఈ నేప‌థ్యంలో ఎంతో కీల‌క‌మైన ఈ జీమెయిల్ వినియోగంపై గూగుల్ (Google) కొత్త విధానాన్ని తీసుకొస్తోంది. అదే టూస్టెప్ వెరిఫికేష‌న్‌. దీని ద్వారా మ‌నంఇకపై జీ మెయిల్‌ ఓపెన్‌ చేయాలంటే కేవలం పాస్‌వర్డ్‌ ఒక్కటి ఎంటర్‌ చేస్తే సరిపోదు.

ఇంకా చదవండి ...
    జీమెయిల్ (GMail) మ‌నం అన్ని ప‌నుల‌కు ఎక్కువ‌గా ఉప‌యోగించేది. ఫోన్‌లో ఎకౌంట్ నుంచి.. ప్ర‌తీ యాప్ వినియోగానికి ఇప్పుడు జీమెయిల్ త‌ప్ప‌నిస‌రిగా మారింది. అంతే కాకుండా అద‌నంగా గూగుల్ అందిస్తున్న ప‌లు డేటా సేవింగ్‌కు జీమెయిల్ ఎకౌంట్ (Account) త‌ప్ప‌నిస‌రి. ఈ నేప‌థ్యంలో ఎంతో కీల‌క‌మైన ఈ జీమెయిల్ వినియోగంపై గూగుల్ కొత్త విధానాన్ని తీసుకొస్తోంది. అదే టూస్టెప్ వెరిఫికేష‌న్‌ (Two Step Verification). దీని ద్వారా మ‌నంఇకపై జీ మెయిల్‌ ఓపెన్‌ చేయాలంటే కేవలం పాస్‌వర్డ్‌ ఒక్కటి ఎంటర్‌ చేస్తే సరిపోదు. దాంతో పాటు మరో అథెంటీకేషన్‌ని ఇవ్వాల్సి ఉంటుంది. దీని ద్వార వినియోగ‌దారుల‌కు లాభ‌మ‌ని ఎంతో సెక్యూరిటీ ఉంటుంద‌ని గూగుల్ పేర్కొంటోంది.

    మార్పులు ఏమిటీ..
    - టూ స్టెప్‌ వెరిఫికేషన్‌కి సంబంధించి యూజర్‌ సెట్‌ చేసుకున్న పాస్‌వర్డ్ ఎంట‌ర్ చేసిన త‌రువాత‌ మొబైల్‌ ఫోన్‌ని రెండో పాస్‌వ‌ర్డ్ వ‌స్తుంది. దాని ద్వారా గూగ‌ల్ ఎకౌంట్ ఓపెన్ అవుతుంది.
    - అంటే ఇకపై జీ మెయిల్‌ ఓపెన్‌ చేయాలంటే పాస్‌వర్డ్‌ (Password)తో పాటు ఫోన్‌ వెరిఫికేషన్‌ కూడా పూర్తి చేయల్సి ఉంటుంది.
    - దీని అర్థం మ‌నం జీ మెయిల్‌ ఓపెన్‌ చేసేప్పుడు ఫోన్‌ని పక్కనే ఉంచుకోవాల్సిన అవ‌స‌రం ఉంటుంది.

    Facebook : ఇక ఈ ఫీచ‌ర్లు ఉండ‌వు..ఫేస్‌బుక్ తాజా నిర్ణ‌యం


    - గతంలో కూడా టూ ఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌ (Authentication)ను అమలు చేయాలని గూగుల్‌ ప్రయత్నించినా యూజర్ల నుంచి వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గింది.
    - ఈసారి వ్యతిరేకత రాకుండా జాగ్రత్త పడుతూ టూ ఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌ను అమలు చేయాలని ప్ర‌త్యేక ప్రణాళిక రూపొందిస్తోంది.
    - వినియోగ‌దారుల నుంచి వ్య‌తిరేక‌త రాకుండా ముందు పది శాతం యూజర్లకే దీన్ని పరిమితం చేసింది.
    - 2022 చివరి నాటికి యూజర్లందరికి వర్తింప చేయాలనే గూగుల్ అడుగులు వేస్తోంది.

    ప్రారంభ‌మైన ప్ర‌క్రియ‌
    ఈ విధానం ద్వారా వినియోగ‌దారుల నుంచి వ్య‌తిరేక‌త రాకుండా ఉండేందుకు జీమెయిల్ అన్ని చ‌ర్య‌లు తీసుకొంటుంది. ఇందుకోసం  న‌వంబ‌ర్ 8, 2021 నుంచి ఎంపిక చేసిన యూజ‌ర్ల‌కు మాత్ర‌మే ఈ టూ స్టెప్ వెరిఫికేష‌న్ అమ‌లు చేస్తారు. ప‌ది శాతం యూజ‌ర్ల‌ను ఎంపిక చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. ప్రారంభ ద‌లో 15 కోట్ల మంది వినియోగ‌దారుల‌కు ఈ విధానాన్ని అమ‌లు చేయాల‌ని గూగుల్ భావిస్తోంది. 2022 నాటికి పూర్తిస్థాయిలో ఈ విధాన్ని అమ‌లు చేయాల‌ని గూగుల్ నిర్ణ‌యించుకొంది.

    సోషల్‌ మీడియా సైట్లు, బిజినెస్‌ మెయిల్స్‌ (Business Mails)లోకి దూరి వ్యక్తిగత సమాచారం చోరీ కాకుండా ఈ విధానం ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని గూగుల్ చెబుతోంది. దీని ప్రకారం ఇకపై జీ మెయిల్‌ ఓపెన్‌ చేయాలంటే కేవలం పాస్‌వర్డ్‌ ఒక్కటి ఎంటర్‌ చేస్తే సరిపోదు. దాంతో పాటు మరో అథెంటీకేషన్‌ని ఇవ్వాల్సి ఉంటుంది.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Cyber security, GMAIL, Google, Latest Technology

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు