గుడ్‌న్యూస్.. ఆండ్రాయిడ్ ఫోన్లలో కొత్త ఫీచర్ తెచ్చిన గూగుల్.. వాటికి చెక్

వెరిఫైడ్ కాల్స్ ఫీచర్ ఆండ్రాయిడ్ ఫోన్లలో మాత్రమే అందుబాటులో ఉంది. యూఎస్, బ్రెజిల్, మెక్సికో, స్పెయిన్, ఇండియాలో మొదట ఈ వెరిఫైడ్ కాల్ ఫీచర్‌ని తీసుకొస్తున్నారు.

news18-telugu
Updated: September 10, 2020, 2:46 PM IST
గుడ్‌న్యూస్.. ఆండ్రాయిడ్ ఫోన్లలో కొత్త ఫీచర్ తెచ్చిన గూగుల్.. వాటికి చెక్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలియని నెంబర్ నుంచి కాల్ వేస్తే మనలో చాలా మంది లిఫ్ట్ చేయరు. ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు అలాంటి కాల్స్ వస్తే అస్సలు తీయరు. అంతేకాదు పదే పదే వ్యాపార సంబంధిత కాల్స్ రావడం మీకు అనుభవం అయ్యే ఉంటుంది. మోసపూరిత వ్యక్తులు కూడా బ్యాంకుల పేరుతో కాల్ చేసి బురిడీ కొట్టిస్తుంటారు. ఐతే ఎవరు కాల్ చేస్తున్నారో తెలుసుకునేందుకు మనలో చాలా మంది ట్రూ కాలర్ యాప్స్ వాడుతున్నారు. అచ్చం అలాంటి అధునాతన ఫీచర్‌నే గూగుల్ తీసుకొస్తోంది. వెరిఫైడ్ కాల్స్ పేరుతో కొత్త ఫీచర్‌ను ఆండ్రాయిడ్ ఫోన్లకు జోడిస్తోంది. దీని కోసం ప్రత్యేకంగా యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ టూల్ అన్ని ఆండ్రాయిడ్ ఫోన్‌లలో ప్రీలోడెడ్‌గా వస్తుంది.

ఇందులో కాలర్ ఐడెంటిఫికేషన్, కాల్‌ బ్లాక్ వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి. ఒక తెలియని నంబర్ నుంచి మనకు ఎందుకు కాల్ వస్తుంది, వాళ్లు ఎలాంటి అవసరాల కోసం మనకు కాల్ చేస్తున్నారో విశ్లేషించి చెబుతుంది. దీంతో కాలర్ ఏ సంస్థ నుంచి ఫోన్ చేస్తున్నాడో స్క్రీన్‌పై తెలుస్తుంది. సదరు వ్యాపార సంస్థ లోగోను కూడా మన ఫోన్లో చూపిస్తుంది. వాటి ఆధారంగా మనకు అవసరమైతే కాల్ లిఫ్ట్ చేయవచ్చు.

ఆయా కంపెనీల వివరాలు కనిపించేందుకు సదరు కంపెనీలు వెరిఫైడ్ కాల్స్‌లో ట్రస్టెడ్‌ బిజినెస్‌లోకి వెళ్లి వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. తద్వారా సదరు కంపెనీలు వినియోగదారులకు ఫోన్‌ చేసినప్పడు వాళ్లు నంబర్‌ బ్లాక్‌ చేయకుండా మాట్లాడుతారని గూగుల్ తెలిపింది. అలా నిజమైన బిజినెస్ కంపెనీలకు లబ్ధి చేకూరుతుందని.. మోసపూరిత కంపెనీల ఆగడాలకు అడ్డుకట్ట పడుతుందని పేర్కొంది. ఈ ఫీచర్ పనిచేయడానికి వినియోగదారులు తమ ఫోన్ నంబర్‌ను వారి గూగుల్ ఖాతాకు జోడించాల్సి ఉంటుంది. వినియోగదారులు వ్యాపార సంస్థల నుంచి ఎలాంటి కాల్స్‌ను స్వీకరిండానికి అనుమతిస్తారు అని గూగుల్ అడుగుతుంది. మనం ఎంచుకున్న ఆప్షన్లను బట్టి స్పామ్ కాల్స్ ను నిరోధిస్తుంది.

అంటే గూగుల్ ఆమోద ప్రక్రియ తర్వాత మాత్రమే ధృవీకరించబడిన కాల్స్ మీకు వస్తాయి. వినియోగదారులు తాము అందుకుంటున్న కాల్.. స్పామ్ కాల్ కాదని అర్థం చేసుకోవడానికి ఇది మరింత సహాయపడుతుంది. వెరిఫైడ్ కాల్స్ ఫీచర్ ఆండ్రాయిడ్ ఫోన్లలో మాత్రమే అందుబాటులో ఉంది. యూఎస్, బ్రెజిల్, మెక్సికో, స్పెయిన్, ఇండియాలో మొదట ఈ వెరిఫైడ్ కాల్ ఫీచర్‌ని తీసుకొస్తున్నారు. మరో వారం రోజుల్లో భారత్‌లోని ఆండ్రాయిడ్ ఫోన్లలో కనిపిస్తుంది. గూగుల్ ఫోన్ యాప్ ఉపయోగిస్తున్నవారు తమ యాప్‌ను అప్‌డేట్ చేసుకొని ఈ ఫీచర్‌ని పొందవచ్చు. అవసరం లేని వారు దీన్ని డిసేబుల్ చేసుకోవచ్చు. తాము వినియోగదారుల నుంచి ఎలాంటి డేటాను సేకరించమని, ధ్రువీకరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత వినియోగదారుల ఫోన్ నంబర్లను ఆటోమేటిగ్గా తొలగిస్తామని గూగుల్ తెలిపింది.
Published by: Shiva Kumar Addula
First published: September 10, 2020, 2:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading