హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Google: ChatGPTకి పోటీగా గూగుల్‌ నుంచి బార్డ్? ఈ లేటెస్ట్‌ ఏఐ చాట్‌బాట్‌ విశేషాలివే..

Google: ChatGPTకి పోటీగా గూగుల్‌ నుంచి బార్డ్? ఈ లేటెస్ట్‌ ఏఐ చాట్‌బాట్‌ విశేషాలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Google: కొన్ని నెలల క్రితం రిలీజ్‌ అయిన ChatGPT అబ్బురపరుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టెక్‌ దిగ్గజం గూగుల్‌ కంపెనీ Bard పేరిట కొత్త ప్రయోగాత్మక AI చాట్‌బాట్‌ను ఇంట్రడ్యూస్‌ చేసింది. ఈ కన్వర్జేషనల్‌ సర్వీస్‌ను మైక్రోసాఫ్ట్ సపోర్ట్‌తో వచ్చిన ChatGPT టూల్‌కు పోటీగా తీసుకొచ్చింది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ప్రస్తుత ప్రపంచ టెక్నాలజీ (Technology) చుట్టూ తిరుగుతోంది. భవిష్యత్తులో టెక్నాలజీ మానవాళిని అధిగమించే అవకాశం ఉందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అద్భుతాలకు నోరెళ్లబెట్టాల్సిన పరిస్థితి. కొన్ని నెలల క్రితం రిలీజ్‌ అయిన ChatGPT అబ్బురపరుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టెక్‌ దిగ్గజం గూగుల్‌ కంపెనీ Bard పేరిట కొత్త ప్రయోగాత్మక AI చాట్‌బాట్‌ను ఇంట్రడ్యూస్‌ చేసింది. ఈ కన్వర్జేషనల్‌ సర్వీస్‌ను మైక్రోసాఫ్ట్ సపోర్ట్‌తో వచ్చిన ChatGPT టూల్‌కు పోటీగా తీసుకొచ్చింది. గూగుల్‌ బార్డ్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

* మైక్రోసాఫ్ట్‌ అప్లికేషన్‌లకి ChatGPT సపోర్ట్‌?

మైక్రోసాఫ్ట్‌ సహకారంతో శాన్ ఫ్రాన్సిస్కో-బేస్డ్‌ OpenAI కంపెనీ ChatGPT తయారు చేసింది. దీంతోపాటు టెక్ట్స్‌ చదవడం, రాయడం, న్యూ ఇమేజ్‌ జనరేట్‌ చేయడం వంటి టూల్స్‌పై పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు మైక్రోసాఫ్ట్‌ ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడిన రెండు వారాలలోపు గూగుల్‌ బార్డ్‌ను ఇంట్రడ్యూస్‌ చేసింది. సెకన్లలో ఎస్సేలు, ప్రోగ్రామింగ్‌ కోడ్‌ రాసేస్తూ ChatGPT విపరీతమైన పాపులారిటీ పొందింది.

దీన్ని ఉపయోగించుకుని ఎక్కువ మంది మోసాలకు పాల్పడే అవకాశం ఉందని, నిపుణులు నామమాత్రంగా మారుతారనే భయాలు కూడా మొదలయ్యాయి. మైక్రోసాఫ్ట్‌ గత నెలలో OpenAIకి సపోర్ట్‌ ఇస్తున్నట్లు ప్రకటించింది. దాని టీమ్స్ ప్లాట్‌ఫారమ్‌లో ChatGPT ఫీచర్‌లను ఇంటిగ్రేట్‌ చేయనున్నట్లు తెలిపింది. Office సూట్, Bing సెర్చ్‌ ఇంజిన్‌కు ChatGPT సేవలను యాడ్‌ చేసే యోచనలో ఉంది.

బార్డ్ గురించి గూగుల్‌ CEO సుందర్ పిచాయ్ చేసిన బ్లాగ్‌పోస్ట్‌లో.. బార్డ్ మన లార్జ్‌ లాంగ్వేజ్‌ మోడల్స్‌ పవర్‌, ఇంటెలిజెన్స్‌, క్రియేటివిటీతో ప్రపంచ జ్ఞానాన్ని కలపడానికి ప్రయత్నిస్తుందని పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ AI- బేస్డ్‌ లాంచ్ ఈవెంట్ సందర్భంగా గూగుల్‌ నుంచి ప్రకటన వచ్చింది.

ఇది కూడా చదవండి : Google Chrome: 15 మినిట్స్‌ హిస్టరీని చిటికెలో డిలీట్‌ చేయవచ్చు.. గూగుల్‌ క్రోమ్‌ నయా ఫీచర్ అదుర్స్!

రెండు టెక్ దిగ్గజాలు జనరేటివ్ AI టెక్నాలజీపై పోటీ పడనున్నాయి. ఇండిపెండెంట్ టెక్ విశ్లేషకుడు రాబ్ ఎండెర్లే AFPతో మాట్లాడుతూ.. జనరేటివ్ AI అనేది గేమ్ ఛేంజర్‌ అని చెప్పారు. ఇంటర్నెట్‌ అభివృద్ధి నెట్‌వర్కింగ్ దిగ్గజాలు(AOL, CompuServe) వంటి వాటిని వెనక్కి నెట్టిందని గుర్తు చేశారు. ఏఐకి సెర్చింగ్‌ డైనమిక్‌ను మార్చగల సామర్థ్యం ఉందని అభిప్రాయపడ్డారు.

* బార్డ్ అంటే ఏంటి?

బార్డ్ అనేది లాంగ్వేజ్‌ మోడల్స్‌ పవర్‌, ఇంటెలిజెన్స్‌, క్రియేటివిటీతో విస్తృతమైన ప్రపంచ జ్ఞానాన్ని కలపడానికి ప్రయత్నిస్తుంది. గూగుల్‌ బార్డ్ LaMDAపై ఆధారపడింది. ఇది కంపెనీ లాంగ్వేజ్ మోడల్ ఫర్ డైలాగ్ అప్లికేషన్స్ సిస్టమ్. దీన్ని అనేక సంవత్సరాలుగా గూగుల్‌ డెవలప్‌ చేస్తోంది.

ఇది క్వాలిటీ రెస్పాన్స్‌ అందించేందుకు వెబ్‌ నుంచి సమాచారం తీసుకుంటుందని సుందర్‌ పిచాయ్‌ పేర్కొన్నారు. ChatGPT చేయలేని విధంగా అప్‌ టూ ద డేట్‌ రెస్పాన్సెస్‌ అందిస్తుందని సూచించారు. పార్టీని ప్లాన్ చేయడానికి టిప్స్‌ అందించడం లేదా రిఫ్రిజిరేటర్‌లో మిగిలి ఉన్న ఆహారాన్ని బట్టి లంచ్ ప్రిపరేషన్‌ ఐడియాస్‌ అందించడం చేస్తుందని వివరించారు. గూగుల్‌ చాట్‌బాట్ సంక్లిష్ట విషయాలను పిల్లలకు కూడా అర్థమయ్యేంత సరళంగా వివరిస్తుందన్నారు.

* ఏడాది చివరిలో అందుబాటులోకి

బార్డ్ క్రియేటివిటీకి అవుట్‌లెట్, క్యూరియాసిటీకి లాంచ్‌ప్యాడ్ అని పిచాయ్ రాశారు. రాబోయే వారాల్లో బార్డ్‌ను మరింత విస్తృతంగా అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ప్రజలు సెర్చ్‌ చేస్తున్న అంశాలను సక్రమంగా అర్థం చేసుకుని సమాచారం అందించడంలో AI సహాయపడిందని చెప్పారు. గూగుల్‌ సెర్చింగ్‌లో AI-పవర్‌తో ఫీచర్‌లతో అందిస్తామని తెలిపారు. ఇవి సంక్లిష్ట సమాచారాన్ని సులభంగా అర్థం చేసుకునే విధంగా మారుస్తాయన్నారు. ఈ ఏడాది చివరిలో బార్డ్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని, ప్రస్తుతం విశ్వసనీయ టెస్టర్‌లకు అందిస్తున్నామని వివరించారు.

First published:

Tags: Google, Microsoft, Sundar pichai, Tech news

ఉత్తమ కథలు