GOOGLE INDIA RELEASED TOP 10 SEARCHES IN VARIOUS CATEGORIES BY INDIANS IN 2021 SS
Google Search 2021: ఈ ఏడాది గూగుల్‌లో నెటిజన్లు ఎక్కువగా ఏం సెర్చ్ చేశారో తెలుసా?
Google Search 2021: ఈ ఏడాది గూగుల్‌లో నెటిజన్లు ఎక్కువగా ఏం సెర్చ్ చేశారో తెలుసా?
(ప్రతీకాత్మక చిత్రం)
Google India Year in Search 2021 | మీరు ఈ ఏడాది గూగుల్‌లో ఎక్కువగా ఏం సెర్చ్ (Google Search) చేశారు? మీలాగే ఇండియాకు చెందిన నెటిజన్లు ఎక్కువగా ఏం వెతికారు? తెలుసుకోండి.
ఇంకొన్ని రోజుల్లో డిసెంబర్ ముగుస్తుంది. 2021 ఏడాది కూడా ముగుస్తుంది. కొత్త సంవత్సరం రాబోతోంది. 2022 ఏడాదిని ఆహ్వానించేందుకు అంతా సిద్ధం అవుతున్నారు. డిసెంబర్ రాగానే ఈ ఏడాదిలో ఏం జరిగిందో, ఏం చేశామో గుర్తుచేసుకోవడం అలవాటు. గూగుల్ కూడా అలాగే ఓ డేటా తీసింది. ఈ ఏడాదిలో గూగుల్‌లో ఎక్కువగా ఏం సెర్చ్ (Google Search) చేశారా? అని వెతికితే ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. ఇండియాలో అన్ని కేటగిరీల్లో ఎక్కువగా ఏం సెర్చ్ చేశారు? "Near me" పేరుతో ఏం వెతికారు? "How to" లేదా "What is" అని సెర్చ్ చేసి ఏం తెలుసుకోవాలని అనుకున్నారు? అని గూగుల్ ఓ నివేదికను విడుదల చేసింది. మరి ఏ కేటగిరీలో ఏం వెతికారో తెలుసుకోండి.
న్యూస్, స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్ లాంటి అన్ని కేటగిరీల్లో టాప్ 10 సెర్చ్‌లు చూస్తే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) టాప్‌లో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో కోవిన్ ఉంది. ఇక ఈ ఏడాది జరిగిన ఐసీసీ టీ20 వాల్డ్ కప్ మూడో స్థానంలో ఉంది. మరి అన్ని కేటగిరీల్లో టాప్ 10 సెర్చెస్ ఏవో తెలుసుకోండి.
ఇక తమకు దగ్గర్లో ఉన్నవాటి కోసం వెతికేందుకు Near me అని సెర్చ్ చేస్తుంటారు. మరి భారతీయులు నియర్‌మీ అని ఎక్కువగా దేనికోసం వెతికారో తెలుసా కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ కోసం. మొదటి స్థానంలో కోవిడ్ వ్యాక్సిన్ గురించి ఉంటే, రెండో స్థానంలో కోవిడ్ టెస్ట్ గురించి ఉంది. ఇక మూడో స్థానంలో ఫుడ్ డెలివరీ ఉంది. మరి టాప్ 10 Near me సెర్చెస్ ఏవో తెలుసుకోండి.
ఇక కరోనా వైరస్ మహమ్మారి విజృంభించిన 2021 లో కొత్త విషయాలు తెలుసుకోవడానికి ప్రతీ ఒక్కరూ ఏదో ఓ విషయంలో How to అని సెర్చ్ చేసే ఉంటారు. మరి టాప్ 1 లో నిలిచింది ఏంటో తెలుసా? కోవిడ్ వ్యాక్సిన్ కోసం ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అని. ఇక వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ఎలా డౌన్లోడ్ చేయాలి అనే సెర్చ్ రెండో స్థానంలో ఉంది. ఆక్సిజన్ లెవెల్ ఎలా పెంచుకోవాలి అని కూడా ఎక్కువగా సెర్చ్ చేశారు.
ఇక కొత్తగా విన్నవాటి గురించి తెలుసుకోవడానికి What is అని సెర్చ్ చేయడం అలవాటే. ఈ ఏడాది బ్లాక్ ఫంగస్ అంటే ఏంటో తెలుసుకోవడానికి ఎక్కువమంది ఆసక్తి చూపించారు. మరి టాప్ 10 What is సెర్చెస్ ఏం ఉన్నాయో తెలుసుకోండి.
1. What is black fungus
2. What is the factorial of hundred
3. What is Taliban
4. What is happening in Afghanistan
5. What is remdesivir
6. What is the square root of 4
7. What is steroid
8. What is toolkit
9. What is Squid Game
10. What is delta plus variant
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.