పాక్ జెండా.. ప్రపంచంలో బెస్ట్ టాయిలెట్ పేపర్.. మనోళ్లు ఆడేసుకుంటున్నారుగా..

గూగుల్ అల్గారిథమ్‌లో తప్పులు దొర్లడం ఇదే తొలిసారి కాదు. గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా దీని బారినపడ్డారు. గూగుల్‌ సెర్చ్ ఇంజిన్‌లో 'ఇడియట్' అని టైప్ చేస్తే ట్రంప్ ఫోటోలు కనిపించాయి.

news18-telugu
Updated: February 17, 2019, 7:44 PM IST
పాక్ జెండా.. ప్రపంచంలో బెస్ట్ టాయిలెట్ పేపర్.. మనోళ్లు ఆడేసుకుంటున్నారుగా..
గూగుల్‌లో పాక్ జెండా ఫోటోలు..
  • Share this:
'ప్రపంచంలో ది బెస్ట్ టాయిలెట్ పేపర్' అని గూగుల్‌లో టైప్ చేస్తే.. పాకిస్తాన్ జెండా ఫోటోలు కనిపిస్తున్నాయి. అసలే పుల్వామా దాడితో పాక్‌పై పట్టరాని కోపంతో ఉన్న భారతీయులు దీన్ని పండుగ చేసుకుంటున్నారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తూ పాక్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. పాక్‌కు ఇది తగిన శాస్తి అని మండిపడుతున్నారు. అయితే విషయం తెలిసిన గూగుల్ నిర్వాహకులు తప్పిదాన్ని సరిదిద్దుకున్నారు.

గూగుల్ నిర్వాహకులు తప్పిదాన్ని సరిదిద్దుకున్నా.. అప్పటికే చాలామంది భారతీయులు వాటిని స్క్రీన్ షాట్స్ తీసుకుని పెట్టుకోవడంతో సోషల్ మీడియాలో వాటిని పోస్ట్ చేస్తున్నారు. దీంతో బెస్ట్ టాయిలెట్ పేపర్ అని సెర్చ్ చేయగానే.. పాక్ జెండాతో కూడిన స్క్రీన్ షాట్స్ కనిపిస్తున్నాయి.


కాగా, గూగుల్ అల్గారిథమ్‌లో తప్పులు దొర్లడం ఇదే తొలిసారి కాదు. గతంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా దీని బారినపడ్డారు. గూగుల్‌ సెర్చ్ ఇంజిన్‌లో 'ఇడియట్' అని టైప్ చేస్తే ట్రంప్ ఫోటోలు కనిపించాయి. ఆ తర్వాత గూగుల్ నిర్వాహకులు తప్పిదాన్ని సరిదిద్దారు.
First published: February 17, 2019, 7:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading