హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Google I/O 2022 Highlights: మరో వర్చువల్ ఈవెంట్‌ను నిర్వహించిన గూగుల్.. ఆ కీనోట్ హైలెట్స్ ఇవే..

Google I/O 2022 Highlights: మరో వర్చువల్ ఈవెంట్‌ను నిర్వహించిన గూగుల్.. ఆ కీనోట్ హైలెట్స్ ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

టెక్ దిగ్గజం గూగుల్.. మరో కొత్త ఈవెంట్‌ను నిర్వహించింది. Google I/O 2022 పేరుతో కొనసాగిన ఈ ఈవెంట్‌లో గూగుల్ కొత్త ప్రొడక్ట్స్‌ను ప్రదర్శించింది. దీంపాటు డెవలపర్లు కొత్త ప్రొడక్ట్స్‌ను పరిచయం చేశారు.

టెక్ దిగ్గజం గూగుల్(Google).. మరో కొత్త ఈవెంట్‌ను(Event) నిర్వహించింది. Google I/O 2022 పేరుతో కొనసాగిన ఈ ఈవెంట్‌లో గూగుల్ కొత్త ప్రొడక్ట్స్‌ను(Google New Products) ప్రదర్శించింది. దీంపాటు డెవలపర్లు(Developers) కొత్త ప్రొడక్ట్స్‌ను పరిచయం చేశారు. ఆల్ఫాబెట్ CEO సుందర్ పిచాయ్ హోస్ట్(Host) చేసిన Google I/O 2022 కీనోట్ సమ్మిట్‌.. బుధవారం రాత్రి 10.20 నుంచి 2 గంటల పాటు కొనసాగింది. ఈ వర్చువల్ ఈవెంట్‌ను(Virtual Event) ప్రపంచం మొత్తం ఉచితంగా లైవ్ స్ట్రీమ్ చేశారు. ఈ సందర్భంగా ఆవిష్కరించిన ప్రొడక్ట్స్‌తో పాటు ఈవెంట్ హైలెట్స్ పరిశీలిద్దాం.

* 12:38 AM IST

Google I/O 2022 కీనోట్ సమ్మిట్ ముగింపు

* 12:36 AM IST

గూగుల్ పిక్సెల్ టాబ్లెట్‌ను పరిచయం చేశారు. ఇది 2023లో లాంచ్ కానుంది. టెన్సర్ చిప్‌సెట్ ద్వారా పనిచేయనుంది.

* 12:24 AM IST

గూగుల్ పిక్సెల్ వాచ్‌ను ఆవిష్కరించారు. ఇది గూగుల్ నుంచి రానున్న మొదటి స్మార్ట్‌వాచ్. సర్క్యులర్ డిజైన్‌లో, Wear OS ప్లాట్‌ఫారమ్‌తో పనిచేస్తుంది. అన్ని గూగుల్ ఫీచర్స్‌కు సపోర్ట్ చేస్తుంది.

* 12:17 AM IST

గూగుల్ పిక్సెల్ 7 ఫోన్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. ఈ ఏడాది చివర్లో రానున్న పిక్సెల్ 7 స్మార్ట్‌ఫోన్, సరికొత్త ఫీచర్లతో ఆకట్టుకోనుంది.

* 12:12 AM IST

గూగుల్ పిక్సెల్ 6A స్మార్ట్‌ఫోన్‌ను అనౌన్స్ చేశారు. దీని ధర 449 డాలర్లుగా ఉంటుందని ప్రకటించారు. Pixel 6a స్మార్ట్‌ఫోన్‌ లాంటి ఫీచర్లతోనే ఇది లాంచ్ కానుంది. ఈ డివైజ్ ప్రీ-ఆర్డర్లు జూలై 21 నుంచి ప్రారంభమవుతాయి.

* 12:09 AM IST

ఆండ్రాయిడ్ 13 బీటా వెర్షన్‌ను ఈరోజు నుంచే స్మార్ట్‌ఫోన్‌ల కోసం అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించారు.

* 12:06 AM IST

సరికొత్త గూగుల్ క్రాస్-డివైస్‌ లింక్ ఫీచర్‌ను పరిచయం చేశారు.

* 11:53 PM IST

గూగుల్ SMSను అప్‌గ్రేడ్ చేయడంతో పాటు కొత్త వాలెట్‌ను తీసుకువస్తున్నట్లు ప్రకటించారు. Google Messages యాప్‌కు RCS ప్లాట్‌ఫారమ్‌లో 500 మిలియన్ల నెలవారీ యాక్టివ్ యూజర్లు ఉన్నారు. ఇది ఆండ్రాయిడ్‌ వెర్షన్‌లో iMessageగా ఫేమస్ అయింది. డిజిటల్ బ్యాంక్ కార్డ్‌లను స్టోర్ చేసుకోగలిగే కొత్త వాలెట్ ప్రొడక్ట్‌ను Google తీసుకువస్తోంది. స్టూడెంట్ ID లేదా బోర్డింగ్ పాస్‌ వంటివి ఇందులో స్టోరే చేసుకోవచ్చు.

* 11:32

ఇంప్రూవ్డ్ ప్రైవసీ ఫీచర్‌లను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించారు. వీటిద్వారా సైబర్ సెక్యూరిటీపై గూగుల్ దృష్టి సారించింది. Google థ్రెట్ అనాలిసిస్ ఈ విధులు నిర్వర్తిస్తోంది. ఈ సిస్టమ్‌లను ఆధునీకరించడానికి, కొత్త సైబర్‌సెక్యూరిటీ వర్క్‌ఫోర్స్‌కు శిక్షణ ఇవ్వడానికి కంపెనీ $10 బిలియన్లు పెట్టుబడి పెడుతోంది.

* 11:10 PM IST

మెరుగైన కన్వర్జేషన్స్ కోసం గూగుల్ అసిస్టెంట్‌ను అప్‌డేట్ చేస్తున్నట్లు ప్రకటించారు.

* 10:54 PM IST

గూగుల్ సెర్చ్ ఇప్పుడు మల్టీ-మోడ్‌ సర్వీస్‌ అందిస్తుంది. ఈ అప్‌డెటెడ్ సెర్చ్ ఫీచర్లను గూగుల్ ఈ ఏడాది చివర్లో అందుబాటులోకి తీసుకురానుంది.

* 10:48 PM IST

గూగుల్ వర్క్‌స్పేస్‌కు కొత్త ఫీచర్‌లను అందిస్తున్నట్లు ప్రకటించారు.

* 10:39 PM IST

గూగుల్ ట్రాన్స్‌లేట్‌లో 24 కొత్త లాంగ్వేజ్‌లను యాడ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

* 10:35 PM IST

సుందర్ పిచాయ్‌ GOOGLE I/O 2022 కీనోట్ ఈవెంట్‌ను ప్రారంభించారు.

Published by:Veera Babu
First published:

Tags: Events, Google, Sunder Pichai

ఉత్తమ కథలు