GOOGLE HOME TV ANDROID SOFTWARE REMOTE LAUNCH DETAILS HERE GH VB
Google Home Remote: ఆండ్రాయిడ్ యూజర్లకు మరో యాప్ బేస్డ్ గూగుల్ టీవీ రిమోట్ ఆప్షన్.. వివరాలివే..
ప్రతీకాత్మక చిత్రం
గూగుల్ హోమ్ రిమోట్ ఫీచర్ ప్రస్తుతానికి ఆండ్రాయిడ్‌లో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. అయితే iOS వెర్షన్లో కూడా ఈ సేవలను లాంచ్ చేస్తే ఎక్కువ మంది యూజర్లు ఈ సేవలను వినియోగించుకునే అవకాశం ఉంటుంది.
గూగుల్ హోమ్ఆండ్రాయిడ్ యాప్‌ను తాజాగా అప్డేట్ చేసింది గూగుల్. ఆండ్రాయిడ్ టీవీ (Android TV), గూగుల్ టీవీ (Google TV), ఇతర డివైజ్‌ల కోసం ఇన్-బిల్ట్ రిమోట్‌ను ఈ అప్డేట్ ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చింది. గూగుల్, ఆండ్రాయిడ్‌కు సంబంధించిన వార్తలను అందించే 9to5Google బ్లాగ్ ఈ ఫీచర్‌ను గుర్తించింది. ఫిజికల్ రిమోట్ స్థానంలో ఈ వర్చువల్ రిమోట్‌ను వాడుకోవచ్చు. దీన్ని ఉపయోగించడానికి గూగుల్ హోమ్ యాప్‌లో సంబంధిత డివైజ్‌ను ఎంచుకోవాలి. ఈ పేజీలో కిందివైపు ఎడమ మూలలో ఉన్న “ఓపెన్ రిమోట్” ఆప్షన్‌పై క్లిక్ చేసి సేవలను వినియోగించుకోవచ్చు.
గూగుల్ హోమ్ రిమోట్ ఫీచర్ ప్రస్తుతానికి ఆండ్రాయిడ్‌లో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. అయితే iOS వెర్షన్లో కూడా ఈ సేవలను లాంచ్ చేస్తే ఎక్కువ మంది యూజర్లు ఈ సేవలను వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఆండ్రాయిడ్ యూజర్లకు ఇప్పటికే Google TV యాప్ ద్వారా ఇలాంటి సాఫ్ట్వేర్ రిమోట్ అందుబాటులో ఉంది. అలాగే సెట్టింగ్స్‌లో రిమోట్ టైల్‌ను కూడా యాక్సెస్ చేయవచ్చు. కానీ iOS వినియోగదారులకు మాత్రం ఇలాంటి ఫీచర్లకు యాక్సెస్ లేదు. iOSలో కొత్త గూగుల్ హోమ్ రిమోట్ ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే వివరాలను గూగుల్ ఇంకా ప్రకటించలేదు.
ఫిజికల్ రిమోట్‌ను మించిన ఫీచర్లు
టచ్‌ప్యాడ్ ఇంటర్‌ఫేస్‌పై స్వైప్ చేయడం ద్వారా ఈ సరికొత్త రిమోట్‌ను యూజర్లు యాక్సెస్ చేయవచ్చు. ఫిజికల్ రిమోట్లో ఉండే బ్యాక్, హోమ్, గూగుల్ అసిస్టెంట్ షార్ట్‌కట్ బటన్స్ వంటివన్నీ ఈ వర్చువల్ రిమోట్లో ఉన్నాయి. టీవీని ఆన్, ఆఫ్ చేయడానికి ఒక స్పెషల్ బటన్ కూడా ఉంటుంది. ఆండ్రాయిడ్ టీవీ బేస్డ్ ప్రొజెక్టర్‌ను నియంత్రించే రిమోట్లో వాల్యూమ్, మ్యూట్ బటన్లు కూడా కనిపించాయని నివేదికలు చెబుతున్నాయి.
దీంతోపాటు లాగిన్ వివరాలను ఎంటర్ చేసే ఆప్షన్‌ను ఎంచుకున్నప్పుడు ఆటోమెటిక్‌గా కీబోర్డ్ కనిపిస్తుంది. ఇలాంటి సరికొత్త ఫీచర్లు ఆండ్రాయిడ్ వినియోగదారులకు కొత్తవేం కాదు. అయితే గూగుల్ హోమ్ iOS యాప్‌లో ఇవి అందుబాటులోకి వస్తే.. అన్ని రకాల ఫీచర్లు iOS యూజర్లకు ఉపయోగపడతాయని టెక్ నిపుణులు చెబుతున్నారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.