హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Health Connect: ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ హెల్త్ కనెక్ట్ యాప్‌ వచ్చేసింది... ఫీచర్స్‌ ఇవే

Health Connect: ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ హెల్త్ కనెక్ట్ యాప్‌ వచ్చేసింది... ఫీచర్స్‌ ఇవే

Health Connect: ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ హెల్త్ కనెక్ట్ యాప్‌ వచ్చేసింది... ఫీచర్స్‌ ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

Health Connect: ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ హెల్త్ కనెక్ట్ యాప్‌ వచ్చేసింది... ఫీచర్స్‌ ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

Health Connect | ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు గూగుల్ హెల్త్ కనెక్ట్ యాప్‌ (Health Connect App) అందుబాటులోకి వచ్చేసింది. బీటా వర్షన్‌లో ఈ యాప్ అందుబాటులో ఉంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

నూరేళ్ల జీవితాన్ని సంతోషంగా ఆస్వాదించాలంటే సంపూర్ణమైన ఆరోగ్యం అందరికీ అవసరమే. అయితే ఈరోజుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు చాలా మంది వేరబుల్స్ (Wearables), ఫిట్‌నెస్‌ యాప్స్‌ (Fitness Apps)పై ఆధారపడుతున్నారు. సాధారణంగా ప్రజలు రన్నింగ్/వాకింగ్ కోసం ఒక యాప్‌, మెడిటేషన్ కోసం మరో యాప్, ఫిట్‌నెస్‌ డైట్ ట్రాకింగ్‌కి ఇంకొక యాప్.. ఇలా నాలుగైదు యాప్స్ ఉపయోగిస్తుంటారు. కాగా వీటన్నిటిలోని డేటాను ఒకదానికి ఒకటి షేర్ చేసి హెల్త్ గురించి మెరుగైన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కుదరదు. ఒకేసారి ట్రాక్ చేయడం, వాటి పర్మిషన్లను మేనేజ్ చేయడం కూడా ఇబ్బందిగానే ఉంటుంది. ఈ సమస్యలకు పరిష్కారంగా తాజాగా గూగుల్ సంస్థ హెల్త్ కనెక్ట్ (Health Connect) అనే యాప్ లాంచ్ చేసింది.

హెల్త్ కనెక్ట్ యాప్‌తో యూజర్లు తమ ఆండ్రాయిడ్ ఫోన్‌లో వివిధ హెల్త్, ఫిట్‌నెస్‌, వెల్‌బీయింగ్ యాప్స్ ద్వారా స్టోర్ అయిన డేటాను ఒకదానితో ఒకటి షేర్ చేసుకునేందుకు అనుమతించవచ్చు. ఆ విధంగా హెల్త్, ఫిట్‌నెస్‌, వెల్‌బీయింగ్ యాప్స్ డేటాను కావాల్సిన యాప్స్‌కి షేర్ చేస్తూ మెరుగైన హెల్త్ ఇన్‌సైట్స్‌ పొందొచ్చు. అలానే అన్ని యాప్స్ ఈజీగా మేనేజ్ చేయవచ్చు. ట్రాక్ చేయవచ్చు. ప్రస్తుతానికి ప్లే స్టోర్ (Play Store)లో బీటా వెర్షన్‌లో మాత్రమే హెల్త్ కనెక్ట్ అందుబాటులోకి వచ్చింది. ఆసక్తి ఉన్నవారు ప్లే స్టోర్ ద్వారా ఈ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం హెల్త్ కనెక్ట్ యాప్ Fitbit, శామ్‌సంగ్ హెల్త్, MyFitnessPal, గూగుల్ ఫిట్ వంటి 10కి పైగా యాప్‌లకు సపోర్ట్ ఇస్తుంది.

Weak Password: ఇండియాలో టాప్ 20 వీక్ పాస్‌వర్డ్స్ ఇవే... మీరు వెంటనే మార్చేయండి

ఈ యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత మీ ఫోన్‌లో డౌన్‌లోడ్ అయి ఉన్న కంపాటబుల్ యాప్‌లను హెల్త్ కనెక్ట్ అప్లికేషన్ డిస్‌ప్లే చేస్తుంది. ఆపై మీరు ఏ యాప్స్‌కి హెల్త్ డేటా యాక్సెస్ అందించాలో సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి, మీరు హార్ట్ బీట్ రేటు, స్లీప్, స్టెప్స్, బర్న్ చేసిన కేలరీల వంటి డేటాకు ఏ యాప్స్ యాక్సెస్ చేయగలవో నిర్ణయించొచ్చు. ఈ హెల్త్ డేటాను ఫలానా యాప్ యాక్సెస్ చేయకూడదనుకుంటే దాని పర్మిషన్ తొలగించవచ్చు. అంతేకాదు, మీరు హెల్త్ కనెక్ట్ ద్వారా ఫోన్ సేకరించిన మొత్తం డేటాను కూడా తొలగించవచ్చు.

30 Days Validity: జియో , ఎయిర్‌టెల్ , Vi యూజర్లకు 30 రోజుల వేలిడిటీ ప్లాన్స్ ఇవే

సింపుల్‌గా చెప్పాలంటే హెల్త్ కనెక్ట్ అనేది ఫిట్‌నెస్‌ యాప్‌లలో మరింత స్థిరమైన డేటా కలెక్షన్, యాప్స్ మధ్య డేటాను సులభంగా షేర్ చేయడానికి ఉపయోగపడుతుంది. “హెల్త్ కనెక్ట్‌తో, యూజర్లు ఒకే చోట పర్మిషన్లను సులభంగా మేనేజ్ చేయవచ్చు. ఏ సమయంలోనైనా ఏ యాప్‌లు డేటాను యాక్సెస్ చేస్తున్నాయో చూడొచ్చు." అని గూగుల్ తన బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది. గూగుల్ సామ్‌సంగ్‌ (Samsung)తో కలిసి ఈ వన్-స్టాప్ హెల్త్ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించింది. స్లీప్ ట్రాకింగ్, సైకిల్ ట్రాకింగ్, బాడీ మెజర్‌మెంట్‌తో సహా 50కి పైగా ఇతర సమాచారాన్ని హెల్త్ కనెక్ట్ ట్రాక్ చేయగలదు.

First published:

Tags: Android, Fitness, Google, Health

ఉత్తమ కథలు