Google: గూగుల్ లోగోలు, ఐకాన్లు మారుతున్నాయి.. పాత లోగోలు కనుమరుగు

గూగుల్ యాప్స్ లోగోలు మారనున్నాయి. ఈ నెల ప్రారంభంలోనే జీసూట్ (G Suite) ఫ్యామిలీ విభాగంలోని యాప్లను గూగుల్ వర్క్ స్పేస్ గా రీబ్రాండ్ చేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.

news18
Updated: October 19, 2020, 1:37 PM IST
Google: గూగుల్ లోగోలు, ఐకాన్లు మారుతున్నాయి.. పాత లోగోలు కనుమరుగు
File image
  • News18
  • Last Updated: October 19, 2020, 1:37 PM IST
  • Share this:
గూగుల్ యాప్స్ లోగోలు మారనున్నాయి. ఈ నెల ప్రారంభంలోనే జీసూట్(GSuite) ఫ్యామిలీ విభాగంలోని యాప్లను గూగుల్ వర్క్ స్పేస్ గా రీబ్రాండ్ చేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. రీబ్రాండింగ్లో Gmail, డ్రైవ్, గూగుల్ డాక్యుమెంట్స్, క్యాలెండర్ వంటి అన్ని గూగుల్ ప్రొఫెషనల్, ప్రొడక్టివిటీ టూల్స్ లోగోలు మారనున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా క్లౌడ్ స్టోరేజ్, ఈమెయిల్ సేవలకు కేంద్రంగా మారిన గూగుల్ డ్రైవ్, జీ మెయిల్ వంటి యాప్ ల ఐకాన్లు కనుమరుగు కానున్నాయి. గూగుల్ వర్క్ స్పేస్ రీబ్రాండింగ్లో వీటికి కొత్త రిఫ్రెష్ లోగోలు వస్తున్నాయి. తన వర్క్ స్పేస్ ప్రొడక్ట్స్ కోసం గూగుల్ కొత్త చిహ్నాలను రూపొందిస్తోంది. Gmail, డ్రైవ్ అప్డేట్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

జీ మెయిల్ ఐకాన్ ఉండదు

గూగుల్ లోగోలో కనిపించే బ్లూ, గ్రీన్, ఎల్లో, రెడ్ కలర్స్ తో కొత్త Gmail 2020.10.04.337159408వెర్షన్ (Androidతో పనిచేసే జీమెయిల్) లోగోను రూపొందించారు. కొత్త లోగో హోమ్ స్క్రీన్ పైనే కనిపిస్తుంది. ఇప్పుడు Gmailయాప్ కు రెడ్ కలర్లో కనిపించే 'M'ఐకాన్ పూర్తిగా కనుమరుగవుతుంది.

Google, GSuite, Google Workspace rebranding, Gmail, Google Drive, New icons
ప్రతీకాత్మక చిత్రం


ఆ నాలుగు రుంగుల్లోనే డ్రైవ్
ఎండ్ యూజర్లకు అందుబాటులోకి వచ్చిన మొదటి రీ బ్రాండ్ లోగో గూగుల్ డ్రైవ్. ఆండ్రాయిడ్ వెర్షన్ 2.20.401.06.40లో గూగుల్ కొత్త డ్రైవ్ ఐకాన్ ను విడుదల చేస్తోంది. ఈ కొత్త ఐకాన్ హోమ్ స్క్రీన్, స్ప్లాష్ స్క్రీన్ లో కనిపిస్తుంది. గూగుల్ డ్రైవ్ కొత్త లోగో పెద్దగా మారలేదు.

Google, GSuite, Google Workspace rebranding, Gmail, Google Drive, New icons
Google Maps (ప్రతీకాత్మక చిత్రం)


ఇంతకు ముందు లాగే ఇది ట్రయాంగిల్ షేప్ లోనే కనిపిస్తోంది. కానీ ఐకాన్ కార్నర్స్ గుండ్రంగా మార్చారు. గూగుల్ బ్రాండ్ లోగోలో ఉండే నాలుగు రంగులతో డిఫాల్ట్ కలర్లతో ఇది కనిపిస్తోంది. కొత్త Gmail, గూగుల్ డ్రైవ్ ఐకాన్లు రెండూ నోటిఫికేషన్ బార్లో కనిపిస్తాయి. ఈ కొత్త Gmail, డ్రైవ్ ఐకాన్లు ఇప్పుడిప్పుడే కొంతమంది వెబ్ యూజర్లకు కనిపిస్తున్నాయి.
Published by: Srinivas Munigala
First published: October 19, 2020, 1:35 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading