హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Android 13: ఆండ్రాయిడ్ 13 బీటాను స్మార్ట్‌టీవీలకు లాంచ్ చేసిన గూగుల్.. కొత్త OS అందిస్తున్న ఫీచర్లు ఇవే..

Android 13: ఆండ్రాయిడ్ 13 బీటాను స్మార్ట్‌టీవీలకు లాంచ్ చేసిన గూగుల్.. కొత్త OS అందిస్తున్న ఫీచర్లు ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

గూగుల్ ఆండ్రాయిడ్ 13 బీటాను ఇప్పటికే లాంచ్ చేసింది. అయితే ఇది గూగుల్ టీవీ లేదా ఆండ్రాయిడ్ టీవీలకు కూడా సపోర్ట్ చేస్తుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఆండ్రాయిడ్ 13 బీటా వెర్షన్.. ఆండ్రాయిడ్ టీవీలకు కొత్త ఇంటర్‌ఫేస్‌ను అందిస్తుంది.

ఇంకా చదవండి ...

స్మార్ట్ ఫోన్లు(Smartphones), డివైజ్‌లు వంటివి పనిచేయాలంటే ఏదైనా ఆపరేటింగ్ సిస్టమ్(Operating System) సపోర్ట్ ఉండాలి. మనకు తెలిసిన వివిధ రకాల స్మార్ట్‌ గాడ్జెట్లలో(Smart Gadgets)  ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. గూగుల్‌కు చెందిన ఈ ఓఎస్‌ను కంపెనీ ఎప్పటికప్పుడు అప్‌డేట్(Update) చేస్తుంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ 12 వెర్షన్(Android 12 Version) ట్రెండింగ్‌లో(Trending) ఉంది. స్మార్ట్ డివైజ్‌లకు సంబంధించి ఇదే లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్. దీని తర్వాత ఆండ్రాయిడ్ 13 రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. గూగుల్ ఆండ్రాయిడ్ 13 బీటాను ఇప్పటికే లాంచ్ చేసింది. అయితే ఇది గూగుల్ టీవీ లేదా ఆండ్రాయిడ్ టీవీలకు కూడా సపోర్ట్ చేస్తుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

ఆండ్రాయిడ్ 13 బీటా వెర్షన్.. ఆండ్రాయిడ్ టీవీలకు కొత్త ఇంటర్‌ఫేస్‌ను అందిస్తుంది. డెవలపర్‌లు, బీటా టెస్టర్‌లు ఈ కొత్త ఆండ్రాయిడ్ టీవీ వెర్షన్‌ను టెస్ట్ చేయగలిగే స్మార్ట్ టీవీలలో బీటా వెర్షన్‌ను పుష్ చేయవచ్చు. ఆండ్రాయిడ్ 13తో స్మార్ట్ టీవీ వినియోగదారుల కోసం గూగుల్ లేటెస్ట్ ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి ఇది ఇంటర్‌ఫేస్, ఇతర సెట్టింగ్స్‌లో కొన్ని మార్పులను మాత్రమే అందిస్తుంది. ఆండ్రాయిడ్ 13 ఇంటర్‌ఫేస్ కూడా దాదాపు ఆండ్రాయిడ్ 12 మాదిరిగానే కనిపిస్తోంది. దీంట్లో పెద్దగా మార్పులు కనిపించట్లేదు.

PM-WANI Scheme: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్... రైల్వే స్టేషన్లలో పీఎం వాణి సేవలు

రానున్న రోజుల్లో గూగుల్ స్మార్ట్ టీవీ ప్లాట్‌ఫారమ్‌కు ఉపయోగకరమైన కొన్ని మార్పులు, చేర్పులను ఆపరేటింగ్ సిస్టమ్‌లో చేయాలి. గత కొన్ని సంవత్సరాలుగా కొత్త టూల్స్‌ కోసం స్మార్ట్ టీవీ యూజర్లు ఎదురుచూస్తున్నారు. స్మార్ట్‌ఫోన్‌ల మాదిరిగా కాకుండా, ఆండ్రాయిడ్ టీవీలో స్మార్ట్ టీవీల కోసం బలమైన సాఫ్ట్‌వేర్ సైకిల్ లేదు. దీని వల్ల మిలియన్ల కొద్దీ స్మార్ట్ టీవీలు పాత వెర్షన్‌లోనే రన్ అవుతున్నాయి. ప్రస్తుతం చాలా కంపెనీలు ఎక్కువగా కొత్త మోడళ్లకు మారాయి. దీంతో పాత మోడళ్లు సెక్యూరిటీ రిస్క్‌ బారిన పడే అవకాశం ఉంది. ఎందుకంటే పాత మోడళ్లలో సెక్యూరిటీ స్టాండర్డ్స్ చాలా వరకు తక్కువగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో గూగుల్ తమ పార్ట్నర్స్, ఇతర తయారీదారులతో అవగాహనకు వచ్చి కొత్త సాఫ్ట్‌వేర్ సెటప్‌పై దృష్టి సారించాలి.

ప్రస్తుతం గూగుల్ కంపెనీ ‘Google I/O 2022’ పేరుతో ఈవెంట్‌ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ ఈవెంట్‌లో గూగుల్ ఆండ్రాయిడ్ 13 TV వెర్షన్‌లో కొత్త ఫీచర్‌లు, అప్‌గ్రేడ్‌లను అందిస్తుందని టెక్ వర్గాలు ఆశిస్తున్నాయి. ఆండ్రాయిడ్ టీవీ 13.. పిక్చర్-ఇన్-పిక్చర్ మోడ్‌ను టెస్ట్ చేస్తోంది. ఈ ఫీచర్‌ను తాజా డిస్‌ప్లే రేషియోలలో పని చేసేలా చేయడానికి కోడ్ లెవల్ సమస్యలను గూగుల్ పరిష్కరిస్తుందని కస్టమర్లు ఆశిస్తున్నారు.

First published:

Tags: Android 13, Android TV, Smart tvs

ఉత్తమ కథలు