హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Youtube: యూట్యూబ్‌లో అదిరిపోయే ఫీచర్.. అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలోనూ ఇక ఆ ఆప్షన్ అందుబాటులోకి..!

Youtube: యూట్యూబ్‌లో అదిరిపోయే ఫీచర్.. అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలోనూ ఇక ఆ ఆప్షన్ అందుబాటులోకి..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రముఖ ఆన్ లైన్ వీడియో షేరింగ్ ప్లాట్ ఫామ్ యూట్యూబ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. స్మార్ట్ ఫోన్ యూజర్లు ఎక్కువ సేపు యూట్యూబ్‌లోనే గడుపుతుంటారు. వారి అభిరుచికి తగ్గట్టుగా యూట్యూబ్ కూడా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను చేర్చుతుంది. దీనిలో భాగంగానే ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ఇప్పుడు కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. యూట్యూబ్‌లో సరికొత్తగా...

ఇంకా చదవండి ...

ప్రముఖ ఆన్ లైన్ వీడియో షేరింగ్ ప్లాట్ ఫామ్ యూట్యూబ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. స్మార్ట్ ఫోన్ యూజర్లు ఎక్కువ సేపు యూట్యూబ్‌లోనే గడుపుతుంటారు. వారి అభిరుచికి తగ్గట్టుగా యూట్యూబ్ కూడా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను చేర్చుతుంది. దీనిలో భాగంగానే ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ఇప్పుడు కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. యూట్యూబ్‌లో సరికొత్తగా 4K క్వాలిటీ వీడియో సపోర్ట్‌ని చేర్చింది. ఒకవేళ, మీరు చూసే యూట్యూబ్ వీడియో 4K రిజల్యూషన్ అందుబాటులో ఉంటే, ఇక నుంచి ఆ వీడియోను 4K రిజల్యూషన్‌తోనే చూడవచ్చు. కాగా, ఇప్పటివరకు కేవలం 720p, 1080p పిక్సెల్ రిజల్యూషన్‌తో మాత్రమే కంటెంట్‌ని వీక్షించే వీలుండేదన్న విషయం తెలిసిందే. అయితే, 4K వీడియో ప్లేబ్యాక్‌ సపోర్ట్ తక్కువ -రిజల్యూషన్ డివైజెస్‌లో కూడా అందుబాటులో ఉంటుందా? లేదా కేవలం Full HD / Full HD + డివైజెస్‌కి మాత్రమే పరిమితం అవుతుందా? అనే విషయంపై యూట్యూబ్ అధికారికంగా స్పష్టతనివ్వలేదు. అయితే Mashable తన రిపోర్టులో పేర్కొన్న దాని ప్రకారం.. ఈ ఫీచర్ అన్ని డివైజెస్‌లో అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది.

కాగా, ఇది అందుబాటులోకి వస్తే కంటెంట్‌ని ఇకపై 4K రిజల్యూషన్‌తో చూడవచ్చు. తద్వారా చాలా అద్భుతమైన అనుభూతి పొందవచ్చు. అంతేకాక, మీ డివైజ్ డిస్ప్లే రిజల్యూషన్‌తో సంబంధం లేకుండా 4K కంటెంట్‌ని యాక్సెస్ చేసుకునే అవకాశం లభిస్తుంది. అయితే, మీ వద్ద కనుక FHD+ లేదా QHD డిస్ప్లే గల స్మార్ట్ ఫోన్ ఉంటే మాత్రం కంటెంట్‌ని మరింత క్లియర్‌గా చూడవచ్చు. ఈ నూతన ఫీచర్‌తో వినియోగదారులు తమ డివైజెస్ లో 4K డిస్‌ప్లే లేకపోయినప్పటికీ, 4K వీడియో ప్లేబ్యాక్‌ను ఎంచుకునే అవకాశం లభిస్తుంది. ఈ 4 కె వీడియో ఆప్షన్‌ ద్వారా తక్కువ డిస్ప్లే రిజల్యూషన్‌ ఉన్న డివైజెస్‌లోనూ క్లారిటీతో కూడిన కంటెంట్‌ని ఆస్వాదించవచ్చు.

మీ ఫోన్‌లో ఇలా సెట్ చేసుకోండి.. దీని కోసం ఎటువంటి ప్రత్యేకమైన సెట్టింగ్స్ చేయాల్సిన పనిలేదు. మీ ఫోన్‌లో యూట్యూబ్ వీడియోలు చూసే సందర్భంలో పైన కనిపించే మూడు చుక్కల గుర్తుపైన క్లిక్ చేయండి. దానిలో మీరు చూస్తున్న కంటెంట్ ఎటువంటి రిజల్యూషన్ లో ఉందన్న విషయం మీకు తెలుస్తుంది. ఇక్కడ మీకు 144p నుండి మొదలుకొని 720p, 1080p, 2160p వంటివి అందుబాటులో ఉంటాయి.  వాటిలో 2160p లేదా 4K రిజల్యూషన్‌ని సెలెక్ట్ చేసుకోండి. అంతే, ఇక మీ ఆండ్రాయిడ్ ఫోనులో కూడా 4K రిజల్యూషన్ గల కంటెంట్‌ని చక్కగా ఆస్వాదించవచ్చు. అయితే, ఈ కొత్త ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయంపై యూట్యూబ్ స్పష్టతనివ్వలేదు.

First published:

Tags: Google, Technology, Youtube

ఉత్తమ కథలు