Google meet: గూగుల్ మీట్ వాడుతున్నారా? అయితే మీకు ఓ చేదు వార్త.. 

ప్రతీకాత్మకచిత్రం

గ్రూప్ కాల్స్ కోసం గూగుల్ మీట్ వాడుతున్నారా? అయితే మీకు ఓ చేదు వార్త అందిస్తోంది గూగుల్. ప్రస్తుతం ఏ యూజర్లైనా ఎంత సేపైనా గ్రూప్ కాల్స్ చేసుకోవచ్చు. కానీ ఇక పై మాత్రం అలా సాధ్యం కాదు.

  • Share this:
ఈ రోజుల్లో అన్ని రకాల మీటింగ్స్ ఆన్ లైన్ విధానానికి మారిపోయాయి. జూమ్, గూగుల్ మీట్ వంటి యాప్స్‌ను చాలా సంస్థలే కాదు.. వ్యక్తులు కూడా ఉపయోగిస్తున్నారు. మీరు కూడా అలా మీ పర్సనల్ (ఫ్రీ) అకౌంట్ నుంచి గ్రూప్ కాల్స్ కోసం గూగుల్ మీట్ వాడుతున్నారా? అయితే మీకు ఓ చేదు వార్త అందిస్తోంది గూగుల్. ప్రస్తుతం ఏ యూజర్లైనా ఎంత సేపైనా గ్రూప్ కాల్స్ చేసుకోవచ్చు. కానీ ఇక పై మాత్రం అలా సాధ్యం కాదు. ఎందుకంటే గ్రూప్ కాల్స్ కోసం గూగుల్ ప్రస్తుతం డ్యూరేషన్ (సమయం) లిమిట్ పెడుతోంది. ఇది కేవలం ఉచితంగా గూగుల్ సేవలను ఉపయోగిస్తున్న పర్సనల్ యూజర్లకు మాత్రమే వర్తిస్తుంది. ప్రొఫెషనల్ యూజర్లు ఇంతకుముందు లాగే తమ సేవలను కొనసాగించవచ్చు.

ముగ్గురు కంటే ఎక్కువ మంది పాల్గొనే మీటింగ్స్ ఇక పై కేవలం గంట పాటు మాత్రమే కొనసాగనున్నాయి. ఒక ఫ్రీ గూగుల్ అకౌంట్ నుంచి ఈ మీటింగ్ ని ప్రారంభిస్తే కనుక ఆ మీటింగ్ ని కేవలం గంట పాటు మాత్రమే కొనసాగించే వీలుంటుంది. ఆ తర్వాత మీటింగ్ దానంతట అదే ఎండ్ అయిపోతుంది. జూమ్ ఇప్పటికే ఇలాంటి లిమిట్ పెడుతోంది. అందులో కేవలం 40 నిమిషాల పాటు మాత్రమే ఉచిత కాల్స్ చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు గూగుల్ మీట్ కూడా దాన్ని పాటించనుంది.

అయితే 55 నిమిషాల తర్వాత మీటింగ్ లో ఉన్నవారందరికీ ఇంకో 5 నిమిషాల్లో మీటింగ్ పూర్తవుతుందన్న నోటిఫికేషన్ వస్తుందని ఒకవేళ గంట సమయంలో ఇలా కాల్ పూర్తి కాకుండా ఉండేందుకు గూగుల్ అకౌంట్‌ను అప్ గ్రేడ్ చేసుకోవాలని గూగుల్ సంస్థ వెల్లడిస్తోంది. అయితే ఇది కేవలం గ్రూప్ కాల్స్ కి మాత్రమే పరిమితం కానీ ఇద్దరు వ్యక్తులు ఉన్న జూమ్ మీటింగ్స్ 24 గంటల పాటు ఉచితంగా ఎంతసేపైనా మాట్లాడుకునే వీలుంటుంది.

గూగుల్ సంస్థ తమ ఫ్రీ గూగుల్ మీట్ కాల్స్ ని అందించే పరిమితిని ప్రతి కొన్ని నెలలకు ఒకసారి పెంచుతూ వస్తుంది. మార్చి 2020 లో అన్ని సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటిస్తున్న వేళ గూగుల్ తమ గూగుల్ మీట్ హ్యాంగవుట్స్ ని ప్రతి ఒక్కరు ఉచితంగా ఉపయోగించవచ్చని వెల్లడించింది. ముందు ఈ సేవలను సెప్టెంబర్ 2020 వరకు ఆ తర్వాత మరోసారి మార్చి 2021 వరకు తాజాగా జూన్ 2021 వరకు పెంచింది. ఇలా తరచూ వాయిదాలు పెంచుతూ రావడానికి గల కారణం గూగుల్ వెల్లడించకపోయినా వర్క్ స్పేస్ సబ్ స్క్రిప్షన్ ప్లాన్ కి అందరూ మారేందుకే ఇలా చేస్తుందని చాలామంది వెల్లడిస్తున్నారు.
Published by:Krishna Adithya
First published: