Home /News /technology /

GOOGLE HANGOUTS SHUTTING DOWN IN NOVEMBER TELLS USERS TO SHIFT TO CHAT UMG GH 2

HTC Smartphone: హెచ్‌టీసీ న్యూ స్మార్ట్‌ఫోన్ లాంచ్.. బోల్డెన్ని ప్రత్యేకతలు.. మొబైల్ లవర్స్ ఓసారి చూడండీ..!

హెచ్‌టీసీ న్యూ మొబైల్ లాంచ్

హెచ్‌టీసీ న్యూ మొబైల్ లాంచ్

ఈ వారంలో హెచ్‌టీసీ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మెటావర్స్ కోసం లాంచ్ చేస్తుందని ప్రచారం జరిగింది. అయితే ఎట్టకేలకు కంపెనీ కొత్త హెచ్‌టీసీ డిజైర్ 22 ప్రో స్మార్ట్‌ఫోన్‌(HTC Desire 22 Pro Smartphone)ను లాంచ్‌ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ హెచ్‌టీసీ వైవ్ ఫ్లో హెడ్‌సెట్‌తో వస్తుందని, వైవర్స్

ఇంకా చదవండి ...
మెటావర్స్‌ టెక్నాలజీ ప్రస్తుతం అన్ని రంగాల్లోకి అడుగుపెడుతోంది. తాజాగా మెటావర్స్‌ ఎక్స్పీరియన్స్‌ అందించే సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను హెచ్‌టీసీ (HTC) లాంచ్‌ చేసింది. అయితే ఈ మొబైల్‌ ఇండియన్‌ మార్కెట్‌లో లభించే అవకాశం లేదు. గ్లోబల్‌ మార్కెట్‌లో వినియోగదారులు పొందవచ్చు. ఈ వారంలో హెచ్‌టీసీ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మెటావర్స్ కోసం లాంచ్ చేస్తుందని ప్రచారం జరిగింది. అయితే ఎట్టకేలకు కంపెనీ కొత్త హెచ్‌టీసీ డిజైర్ 22 ప్రో స్మార్ట్‌ఫోన్‌(HTC Desire 22 Pro Smartphone)ను లాంచ్‌ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ హెచ్‌టీసీ వైవ్ ఫ్లో హెడ్‌సెట్‌తో వస్తుందని, వైవర్స్ ఎకోసిస్టమ్‌కు అనుకూలంగా ఉందని కంపెనీ తెలిపింది. హెచ్‌టీసీ డిజైర్ 22 ప్రో అనేది మిడ్‌ రేంజ్‌ డివైజ్‌, ఇది స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌పై రన్‌ అవుతుంది. ట్రిపుల్ రియర్ కెమెరాలతో వస్తుంది. ఇది వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్‌ చేస్తుంది.

హెచ్‌టీసీ డిజైర్‌ 22 ప్రో ధర
హెచ్‌టీసీ డిజైర్‌ 22 ప్రో స్మార్ట్‌ఫోన్ ధర 404 డాలర్లుగా ఉంది. హెచ్‌టీసీ కొన్ని సంవత్సరాల క్రితం ఇండియన్‌ మార్కెట్‌ నుంచి నిష్క్రమించింది. కాబట్టి ఇప్పట్లో ఇండియన్‌ మార్కెట్‌లో హెచ్‌టీసీ ఫోన్‌ చూసే అవకాశం లేదు. ప్రస్తుతం ఈ డివైజ్ గ్లోబల్ మార్కెట్లో లభిస్తోంది.

 హెచ్‌టీసీ డిజైర్ 22 ప్రో స్పెసిఫికేషన్‌లు
హెచ్‌టీసీ డిజైర్‌ 22 ప్రో స్మార్ట్‌ఫోన్‌ స్నాప్‌డ్రాగన్ 695 SoCతో వచ్చే మిడ్‌ రేంజ్‌ డివైజ్‌. ఈ డివైజ్‌ VRకు సపోర్ట్‌ చేస్తుంది. ఇది ఫోన్ ద్వారా వినియోగదారుల కోసం మెటావర్స్‌ను VR హెడ్‌సెట్‌తో జత చేస్తుంది. ఇందుకు హెచ్‌టీసీ సొంత వర్చువల్ కంటెంట్ లైబ్రరీని ఏర్పాటు చేసింది. అది ఇప్పుడు HTC VR హెడ్‌సెట్‌కి కనెక్ట్ అయినప్పుడు.. స్మార్ట్‌ఫోన్ ద్వారా కంటెంట్‌లైబ్రరీని యాక్సెస్ చేయవచ్చు.
ఫోన్‌లో నిర్వహించగలిగే క్రిప్టోకరెన్సీ, NFTలకు హెచ్‌టీసీ సపోర్ట్‌ అందిస్తోంది. ఇంత కెపాసిటీ ఉన్న ఈ ఫోన్‌కు స్నాప్‌డ్రాగన్ 600 సిరీస్ చిప్‌సెట్‌ని ఎంచుకోవడం సరైనది కాదని నిపుణులు భావిస్తున్నారు.

ఈ ఫోన్ 6.6-అంగుళాల ఫుల్‌ HD+ LCD డిస్‌ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. ఫోన్ బరువు 205 గ్రాములు, ఆండ్రాయిడ్‌ 12 అవుట్‌ ఆఫ్‌ ది బాక్స్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై రన్‌ అవుతుంది. 8GB RAM, 128GB స్టోరేజ్‌తో వస్తుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం కంపెనీ దీనికి IP67 రేటింగ్ ఇచ్చింది.
హెచ్‌టీసీ డిజైర్‌ 22 ప్రో వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 4520mAh బ్యాటరీని అందిస్తోంది. HTC 13-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్, 5-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో పాటు 64-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌ను పొందే ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ ఉంది. ఫోన్ ముందు భాగంలో 32-మెగాపిక్సెల్ షూటర్ ఉంది.
Published by:Mahesh
First published:

Tags: Mobiles, Smart phones

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు