Home /News /technology /

GOOGLE HANGOUTS SHUTTING DOWN IN NOVEMBER TELLS USERS TO SHIFT TO CHAT UMG GH

Hangouts: హ్యాంగవుట్స్‌ సేవలు బంద్.. నవంబర్ తర్వాత యూజర్లంతే ఆ యాప్‌కే..!

హ్యాంగవుట్స్ సేవలు బంద్

హ్యాంగవుట్స్ సేవలు బంద్

హ్యాంగవుట్స్‌ (Hangouts)ను నవంబర్‌లో శాశ్వతంగా నిలిపివేస్తామని గూగుల్ (Google) తాజాగా మరోసారి ప్రకటించింది. ఇప్పటికీ హ్యాంగవుట్స్‌ను యూజ్ చేస్తున్నవారు గూగుల్ చాట్‌ (Google Chat)కి మారిపోవాలని కోరింది.

ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ (Google) 2013లో హ్యాంగవుట్స్‌ (Hangouts) అనే ఒక ఇన్‌స్టంట్ మెసేజింగ్ సర్వీస్ తీసుకొచ్చింది. స్నేహితులకు మెసేజ్ పంపించడానికి, ఫ్రీగా వీడియో లేదా వాయిస్ కాల్స్‌ చేసుకోవడానికి హ్యాంగవుట్స్‌ యూజర్లకు ఎంతగానో ఉపయోగపడింది. అయితే గూగుల్ ఈ యాప్ యూజర్లను 2020 నుంచి గూగుల్ చాట్ (Google Chat)కి మారిపోవాలని విజ్ఞప్తి చేస్తోంది. హ్యాంగవుట్స్‌ను శాశ్వతంగా నిలిపివేస్తామని, అందువల్ల యూజర్లు తమ డేటాను డౌన్‌లోడ్ చేసుకోవాలని కూడా చెబుతూ వస్తోంది. అయితే తాజాగా గూగుల్ బ్లాగ్‌లో హ్యాంగవుట్స్‌ను నవంబర్‌లో శాశ్వతంగా నిలిపివేస్తామని స్పష్టంగా పేర్కొంది. ఇప్పటికీ హ్యాంగవుట్స్‌ను యూజ్ చేస్తున్నవారు గూగుల్ చాట్‌కి మారిపోవాలని కోరింది.

2020 నుంచి గూగుల్ చాట్ (Google Chat) సర్వీసెస్ అందరికీ ఉచితంగా అందుబాటులోకి వచ్చాయి. ఈ యాప్‌లో హ్యాంగవుట్స్‌ కంటే ఎన్నో ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి. అందుకే గూగుల్ హ్యాంగవుట్స్‌ను వదిలేసి చాట్‌ వినియోగించాలని చెబుతోంది. ఇప్పటికీ మారని యూజర్లు నవంబర్‌లోపు హ్యాంగవుట్స్‌లోని తమ డేటాను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని గూగుల్ తెలిపింది. గూగుల్ చాట్ కొత్త టూల్స్.. యూజర్ల కోసం మెరుగైన ఇంటిగ్రేషన్‌తో వస్తుందని కంపెనీ చెబుతోంది. ప్రస్తుతం మొబైల్‌లో హ్యాంగవుట్స్‌ వాడే వారికి "ఇట్స్ టైమ్ ఫర్ చాట్ ఇన్ జీమెయిల్‌" అనే ఓ పాప్-అప్ నోటిఫికేషన్‌ పంపించి హ్యాంగవుట్స్‌ను గూగుల్ చాట్‌తో భర్తీ చేశామని కంపెనీ చెబుతోంది. ఇప్పుడు జీమెయిల్‌ వెబ్/మొబైల్ యూజర్లు జీమెయిల్‌లోనే గూగుల్ చాట్ సర్వీసెస్ పొందొచ్చు. ఇందుకోసం మొబైల్ యూజర్లు జీమెయిల్ యాప్‌లోని లాంచ్ పేజీలో కింద కనిపిస్తున్న కన్వర్జేషన్ ఐకాన్‌పై క్లిక్ చేస్తే సరిపోతుంది. లేదా సపరేట్‌గా గూగుల్ చాట్ యాప్ కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా, హ్యాంగవుట్స్‌ క్రోమ్ ఎక్స్‌టెన్షన్ వాడుతున్న పీసీ యూజర్లు వెబ్‌లోనే చాట్‌కు మారవచ్చు లేదా చాట్ వెబ్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటే సరిపోతుంది.

యూజర్లు మరింత మెరుగ్గా కమ్యూనికేట్ కావడానికి, తమ భావాలను వ్యక్తీకరించడానికి తాము చాట్‌లో భారీగా పెట్టుబడులు పెడుతున్నామని గూగుల్ చాట్ ప్రోడక్ట్ మేనేజర్ రవి కన్నెగంటి బ్లాగ్‌పోస్ట్‌లో తెలిపారు. ఇప్పుడు మిగిలిన హ్యాంగవుట్స్‌ యూజర్లందరూ కూడా చాట్‌కి మారేలా సహాయ చర్యలు చేస్తున్నామన్నారు. ఈ గూగుల్ చాట్‌లో యూజర్లు డాక్యుమెంట్స్‌, స్లయిడ్‌లు, షీట్‌ల నుంచి ఫైల్స్‌ను ఎడిట్ చేసుకోవచ్చు. ఇందుకు సైడ్-బై-సైడ్ ఎడిటింగ్ ఫీచర్‌ను అందించారు.

ఈ యాప్‌తో యూజర్లు తమ సహోద్యోగులు లేదా స్నేహితులతో సంభాషణలో పాల్గొనవచ్చు. అలానే వివిధ ఫైల్‌లలో సహకరించవచ్చు. స్లాక్, ప్లాక్, టీమ్స్ వంటి ఇతర కొలాబరేటివ్‌ ప్లాట్‌ఫామ్‌లకు చాట్‌లను గట్టి పోటీదారుగా మార్చాలని గూగుల్ కోరుకుంటోంది. దీనితో పాటు యూజర్ల కోసం చాట్‌కు చాలా ఇంటర్‌ఫేస్ ఫీచర్లను తీసుకువస్తోంది. "చాట్‌కు మారడం వల్ల యూజర్లు స్కిన్-టోన్ ఆప్షన్స్‌తో ఎమోజీలను ఉపయోగించవచ్చు. చాట్‌లకు ప్రాధాన్యతనిచ్చే రిచ్ టెక్స్ట్ ఎడిటింగ్, గ్రూప్‌లో ఎవరినైనా @మెన్షన్ చేయవచ్చు. ఇంకా మరెన్నో కూల్ ఫీచర్లతో ఫీలింగ్స్‌ను మరింత సరదాగా ఎక్స్‌ప్రెస్ చేయవచ్చు" అని కంపెనీ తెలిపింది.
Published by:Mahesh
First published:

Tags: Google, Google Chat, Google Meet

తదుపరి వార్తలు